యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆర్ఎస్ఎస్ ఛీఫ్; అంబాసిడర్ స్పేర్స్ దొరుకుతాయా?

By Ravi

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన బుధవారం ఘోరక్‌పూర్ వెళ్లేందుకు ఢిల్లీలో ప్రయాణిస్తుండగా, అతని కారును తన సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహనమే ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కానీ, మోహన్ భగవత్ అధికారిక వాహనం (విఐపి అంబాసిడర్ కారు) వెనుక భాగం మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యింది.

ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మేరకు, ధౌలాకౌన్ రెడ్ లైట్ పాయింట్ బుధవారం మధ్యాహ్నం మోహన్ భగత కాన్వాయ్ వెళ్తుండగా, ఆయన కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటం, వెనుక నుంచి వస్తున్న సెక్యూరిటీ ఎస్కార్ట్ దానిని గమనించకపోవటంతో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న మోహన్ భగవత్ కొంచెం ముందుకు తూలారు. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన అనంతరం ఆయన తన స్వంత కారులో ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.

RSS Chief Bhagawat

ఇకపై అంబాసిడర్ స్పేర్స్ దొరుకుతాయా..?
ఇదిలా ఉంటే, హిందుస్తాన్ మోటార్స్ ఇటీవలే తమ ఐకానిక్ అంబాసిడర్ కారు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఇప్పటికే అంబాసిడర్ కార్లను ఉపయోగిస్తున్న వారికి అత్యవసరంగా ఏవైనా స్పేర్స్ పార్ట్స్ అవసరమైతే భవిష్యత్తులో దొరుకుతాయా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

వాస్తవానికి ఏ కార్ కంపెనీ అయినా ఒక నిర్ధిష్ట మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించిన తర్వాత కనీసం 8-10 పదేళ్ల పాటు ఆ కారుకు సంబంధిచిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ (విడిభాగాలను) అందుబాటులో ఉంచాలి. కానీ హిందుస్థాన్ మోటార్స్ మాత్రం తమ అంబాసిడర్ స్పేర్స్ పార్ట్స్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే, భవిష్యత్తులో అంబాసిడర్ స్పేర్ట్ పార్ట్స్ దొరక్కపోతే ఆ కార్లను మెకానిక్ షెడ్డుకు లేదా డంప్ యార్డ్‌కు పరిమితం చేయాల్సిందేనా..? హిందుస్తాన్ మోటార్స్ దీనికి మీ సమాధానమేంటి..?

More from DriveSpark

Article Published On: Thursday, June 5, 2014, 10:32 [IST]
English summary
RSS chief Mohan Bhagwat escaped unhurt after his car was hit by his security escort vehicle in Delhi on Wednesday while he was on his way to the airport. According to sources, Bhagwat's car was hit by his security vehicle due to the impact on it after a car hit the escort car from behind at the Dhaula Kuan red light point around noon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+