పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?

రోజులు మారుతున్నాయి.. ఈ ఆధునిక యుగంలో చాలామంది ఆధునిక వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ఊరేగింపు జరపడానికి మరింత ఖరీదైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. అయితే కెనడాకు చెందిన ఒక NRI ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

నివేదికల ప్రకారం, ఒక NRI తాను పెళ్లి చేసుకోబోయే వధువును తన తండ్రి యొక్క మారుతి 800 తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే దీని కోసం తన తండ్రి యొక్క మారుతి 800 కారుని అందంగా పువ్వులతో అలంకరించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పంజాబ్ నేషనల్ టీవీ యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయబడింది.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

ఈ వీడియోలో వరుడు, వధువుని అందంగా అలంకరించిన మారుతి 800 కారులో తీసుకురావడం చూడవచ్చు. మారుతి 800 కారుకి సంబంధించి వరుడు మాట్లాడుతూ.. తనకు ఆ కారుతో ఎంతో గొప్ప సంబంధం ఉందని, అంతే కాకుండా అది స్వయంగా తన తండ్రి ఉపయోగించింది కావడం వల్ల దానితో అనేక మధుర స్మృతులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే తన తండ్రి కారులో వధువు తీసుకుని వచ్చాడు.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

నిజానికి సాధారణంగా రోజు వారీ వినియోగానికే మంచి కారు ఉండాలనుకునే కాలంలో పెళ్ళికి అంతకు మించి ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ కారణంగానే తమ వద్ద ఖరీదైన కారు లేకపోతే అద్దె కారులైన ఉపయోగించడానికి సిద్ధపడతారు. అయితే వీటన్నింటికి భిన్నంగా NRI అయినప్పటికీ తన తండ్రి ఉపయోగించిన మారుతి 800 తన పెళ్లి కారుగా ఉపయోగించాడు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

వరుడు చేసిన ఈ పనికి ఎంతో మంది తెగ మెచ్చుకుంటున్నారు. నిజంగానే ఈతడు చేసిన పని అందరూ మెచ్చుకోదగ్గదే. ఎందుకంటే ఎంతో మంది ధనవంతులు పెళ్లిళ్ల కోసం లెక్కకు మించి డబ్బు ఖర్చు చేసి ఎంతో వైభవంగా చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాము. అలన్తి ఈ రోజుల్లో ఎంతో సాధారణంగా మారుతి 800 కారుని పెళ్ళికి ఉపయోగించడం చాలా గొప్ప విషయం.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

ఒక పేద కుటుంభం మారుతి 800 కారుని పెళ్లి కారుగా ఉపయోగిస్తే, అదే వారి స్థోమత అనుకోవచ్చు. కానీ ఒక NRI తన పెళ్లికి ఖరీదైన కారుని ఉపయోగించకుండా చాలా సింపుల్ గా మారుతి 800 కారు ఉపయోగించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. గతంలో కేరళకు చెందిన ఒక పెళ్లి జంట తమ పెళ్లి ఊరేగింపుకు ఎద్దుల బండిని ఉపయోగించింది.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

నిజానికి మారుతి 800 కారు ప్రస్తుతం భారతీయ రోడ్ల మీద అక్కడక్కడా కనిపించినప్పటికీ రెండు దశాబ్దాలకు ముందు భారతీయ మార్కెట్‌ని తిరుగులేకుండా ఏలింది. అంటే అంతగా ప్రజాదరణ పొందగలిగింది. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో తిరుగులేని ఈ మారుతి 800 కాలక్రమంగా కొత్త వాహనాల విడుదల వల్ల దీనికున్న ఆదరణ క్రమంగా తగ్గింది. అయినప్పటికీ ప్రస్తుతం అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి.

పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. దీనిపై మీ స్పందన ఏమిటి?

మారుతి 800 అనేది 4 సీట్లు కలిగిన కారు, ఇది అప్పట్లోనే వాహనం వినియోగదారులను ఆకర్శించడంలో విజయం పొందింది. ఇది మంచి డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉండటానికి ఇది అద్భుతంగా రూపొందించబడింది. ఈ కారణంగానే ఈ కారు ఎంతో మంది ప్రజల మనసు దోచుకోగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 25, 2023, 11:50 [IST]
English summary
Canadian nri groom bring his bride to home in his dads maruti 800 car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+