ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

పడవల తయారీలో ఇటీవల తరచూగా వినిపించే టెక్నాలజీ పేరు హైడ్రోఫాయిల్ (Hydrofoil). హైడ్రోఫాయిల్ అనేది పడవలను నీటిపై తేలియాడనీయకుండా, నీటి ఉపరితలం నుండి కాస్తంత ఎత్తులోకి పైకి లేపి హోవర్ చేసేలా చేస్తుంది. దీని వలన పడవలు సాధారణ వేగం కన్నా అనేక రెట్లు అత్యధిక వేగంతో ప్రయాణించగలవు. సింపుల్ గా చెప్పాలంటే, ఈ టెక్నాలజీ, పడవలను నీటిపై ఎగిరేలా చేస్తుందన్నమాట.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

సరే ఈ విషయం అటుంచితే, అలాంటి ఓ హైడ్రోఫాయిల్ పడవను తయారు చేసింది స్టాక్‌హోమ్ ఆధారిత పడవల తయారీ సంస్థ కాండెలా (Candela). కాండెలా తయారు చేసిన ఈ హై-స్పీడ్ హైడ్రోఫాయిల్ బోటు పేరు సి-8 (C-8). ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదొక ఎలక్ట్రిక్ పడవ. గత నెలలో ఇది ప్రారంభించబడింది, ఇప్పుడు సహజ పడవల మార్కెట్ ని హడలెత్తిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

ఇప్పటికే, రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాన్ని రీప్లేస్ చేస్తుంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ పడవలు సాధారణ పెట్రోల్, డీజిల్ పడవల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. తాజాగా, మార్కెట్లోకి వచ్చిన కాండెలా సి-8 హైడ్రోఫాయిల్ ఎలక్ట్రిక్ బోట్ ఇప్పుడు శిలాజ-ఇంధన-ఆధారిత పడవలను తొలగించడం ప్రారంభించింది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ ప్రారంభించిన 6 వారాల్లోనే 60 యూనిట్లకు పైగా అమ్ముడైంది. సమాచారం ప్రకారం, కాండెలా సి-8 (Candela C-8) ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ అనేది సామూహికంగా ఉత్పత్తి చేయబడిన ప్రోడక్ట్, ఇది కంపెనీ భారీగా ఉత్పత్తి చేసిన సి-7 స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఈ పడవ పొడవు 28 అడుగులు మరియు ఇది విద్యుత్ ఆధారిత పడవ. ఈ పడవ నీటిపై ఒక జత హైడ్రోఫాయిల్స్‌ సాయంతో పనిచేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

కాండెలా సి-8 పడవ దిగువన (హౌల్ క్రింది భాగంలో) ఈ హైడ్రోఫాయిల్ వ్యవస్థ అమర్చబడి ఉంటుంది. ఈ రెండు హైడ్రోఫాయిల్స్ సాయంతోనే ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటి ఉపరితలం నుండి సుమారు 3-4 అడుగుల ఎత్తుకి లేస్తుంది. సాధారణంగా, పడవలు నీటిపై తేలుతూ వెళ్లేటప్పుడు నీటి డ్రాగ్ కారణంగా, వాటి వేగం తగ్గుతుంది. కానీ, ఈ హైడ్రోఫాయిల్స్ వలన పడవ నీటిపై నుండి గాలిలో తేలుతూ ఉంటుంది, కాబట్టి దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

ఒకవేళ, నీటిపై తరంగాలు (అలలు) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, పడవ యొక్క ఫ్లైట్ కంట్రోలర్ దానిని గుర్తించి పడవను తిరిగి నీటిపైన తేలియాడేలా చేస్తుంది. ఫలితంగా, అలలపై పడవ కంట్రోల్ గా ఉంటుంది. సమాచారం ప్రకారం, C-POD అని పిలువబడే కాండెలా సి-8 లో ఒక కొత్త నిశ్శబ్ధ థ్రస్టర్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ థ్రస్టర్‌ ను కాండెలా స్వతహాగా అభివృద్ధి చేసింది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

ఈ ఎలక్ట్రిక్ పడవలోని C-POD ఒక జత కౌంటర్‌ రోటేటింగ్ ప్రొపెల్లర్‌లను ఉపయోగించి పనిచేస్తుంది, ఇది ఒక వ్యక్తిగత మోటార్ ద్వారా నడపబడుతుంది మరియు ఈ మోటార్ పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. C-POD ఒక కొత్త డిజైన్ ఫిలాసఫీలో భాగంగా కాండెలా సి-8 హైడ్రోఫాయిల్ ఎలక్ట్రిక్ బోట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

స్కాండినేవియన్ కంపెనీ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ లోనలుగురు వ్యక్తులకు సరిపోయేంత విశాలమై గది, సౌకర్యాలు మరియు సోఫాతో కూడిన దిగువ డెక్ క్యాబిన్ వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని సోఫాను మడిచినట్లయితే, ఇద్దరు పెద్దలు మరియు ఇద్దరు పిల్లలకు స్లీపింగ్ బెడ్‌ లా మారుతుంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

ఇంకా ఇందులో టాయిలెట్ మరియు మంచినీటి షవర్ తో కూడిన బాత్రూమ్, చల్లని వాతావరణం లేదా సూర్య రక్షణ కోసం ఆప్షనల్ హార్డ్ టాప్ మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. నావిగేషన్ మరియు కంట్రోల్ సిస్టమ్ కోసం క్యాబిన్‌లో 15.4 ఇంచ్ హై-రిజల్యూషన్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ కూడా ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

కొత్త కాండెలా సి-8 పడవ యొక్క గరిష్ట వేగం విషయానికి వస్తే, ఇది 30 నాటికల్ మైళ్ల వేగంతో పరుగులు తీయగలదు మరియు 2.5 నాటికల్‌కి 20 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించడానికి సరిపోయే బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బోట్ లో 45 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 50 నాటికల్ మైళ్ల (92 కిమీ) పరిధిని అందిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ నీటిపై తేలదు కానీ ఎగురుతుంది! దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?

హైడ్రోఫాయిల్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది ?

హైడ్రోఫాయిల్ అనేది లిఫ్టింగ్ సర్‌ఫేస్ లేదా ఫాయిల్, ఇది నీటిలో పనిచేస్తుంది. ఈ హైడ్రోఫాయిల్స్ అనేవి విమానంలో ఉపయోగించే ఏరోఫాయిల్స్‌ తో సమానంగా ఉంటాయి. హైడ్రోఫాయిల్ టెక్నాలజీని ఉపయోగించే పడవలను హైడ్రోఫాయిల్స్ అని కూడా పిలుస్తారు. హైడ్రోఫాయిల్ క్రాఫ్ట్ వేగం పెరిగే కొద్దీ, పడవ క్రింది భాగంలో ఉన్న హైడ్రోఫాయిల్స్ పడవ యొక్క క్రింది భాగాన్ని నీటిలోంచి పైకి లేపి, డ్రాగ్ ను తగ్గించి, ఎక్కువ వేగాన్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఆటోమొబైల్ ప్రపంచంలో లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‍‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Candela c 8 hydrofoil electric boat range features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X