వీడియో: కారును దొంగిలించిన కుక్క (రియల్ or ఫేక్)
సాధారణంగా క్రిమినల్స్ కార్లను దొంగతనం చేయడం గురించి మనం తరచూ వింటుంటాం, ఇందుకోసం సదరు క్రిమినల్స్ చేసే కొత్త కొత్త ట్రిక్‌ల గురించి తెలుసుకుంటుంటాం. కానీ జంతువులు, అందులోను ఓ కుక్క కారును దొంగిలించడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అయితే, ఈ వీడియోని చూడండి, మీరే ఆశ్చర్యపోతారు.
ఇది కూడా చూడండి: కోక్ టిన్నులతో కారు చోరీ!
యూట్యూబ్‌లో మా కంటబడిన వీడియోలో ఓ తెలివైన కుక్క కారు యజమానిని బురిడీ కొట్టించి, కారులో ఎక్కి పరారయ్యింది. ఓ లేడీ డ్రైవర్ రోడ్డుపై కారులో వెళ్తుంటే, అడ్డుగా వచ్చిన ఓ కారు ముందుకు వచ్చింది, చనిపోయినట్లు పడిపోయింది. ఇది చూసిన సదరు డ్రైవర్ కారును కొంచెం వెనక్కి పోనిచ్చి, కారు లోనుంచి క్రిందకి కుక్కకు ఏమైందోనని చూడసాగింది.
కుక్క చనిపోయిందేమోనన్న విచారంతో ఆమె అటువైపుకు తిరిగి బాధపడుతుంటే, ఇంతలో కుక్క టక్కున లేచి కారులోకెక్కి పరారయ్యింది. అయితే, ఇదంతా నిజమా లేక ఏదైనా కార్ కంపెనీ ప్రకటనలో భాగమా అనేది మాత్రం తెలియడం లేదు. మరి ఆ సరదా వీడియోని మీరు కూడా చూసేయ్యండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/-K-zDK4wrI4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








