రేంజ్ రోవర్ ఎవోక్ కొనలేరా? అయితే ఈ డూప్లికేట్ కొనండి!

By Ravi

ఎలాంటి వస్తువుకైనా డూప్లికేట్‌ను తయారు చేయటంలో చైనీయులను మించిన వారు మరొకరు ఉండరు అనటంలో పెద్ద అతిశయోక్తి లేదేమో. చైనీయులు అచ్చం ఒరిజినల్‌లా ఉండే వస్తువులను, ఒరిజినల్ వస్తువు ధర కన్నా కాలు భాగం ధరకే తయారు చేయగలరు.

కార్ల విషయంలో కూడా చైనీయులు అనేక గొప్ప గొప్ప లగ్జరీ కార్లకు డూప్లికేట్ కార్లను తయారు చేసిన దాఖలాలున్నాయి. ఫోర్డ్ ఎఫ్150, క్యాడిలాక్ ఎస్ఆర్ఎక్స్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి అనేక మోడళ్లకు డూప్లికేట్ మోడళ్లను కేవలం 1/3 వంతుల ధరకే విక్రయిస్తున్నారు.

LandWind X7

తాజాగా.. చైనీయులు, భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్‌ను కాపీ కొట్టి, దానిని ల్యాండ్ విండ్ ఎక్స్7 పేరుతో అత్యంత చవక ధరకే ఆఫర్ చేస్తున్నారు.

ఒరిజినల్ రేంజ్ రోవర్ ఎవోక్ సుమారు 62,000 డాలర్లకు లభిస్తుంటే, ఈ డూప్లికేట్ రేంజ్ రోవర్ ఎవోక్ (అలియాస్ ల్యాండ్‌విండ్ ఎక్స్7) మాత్రం కేవలం 22,000 డాలర్లకే లభిస్తోంది. జియాంగ్లింగ్ మోటార్స్, చాంగన్ ఆటో కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ కారును తయారు చేస్తున్నారు.

LandWind X7

ల్యాండ్‌విండ్ ఎక్స్7 మోడల్‌లో 2.0 లీటర్, టర్బో-చార్జ్డ్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పిల శక్తిని, 250ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అందుబాటులో ఉంటుంది.

ల్యాండ్‌విండ్ ఎక్స్7 ఎక్స్టీరియర్స్ మాత్రమే కాదు ఇంటీరియర్స్ కూడా ఒరిజినల్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను పోలి ఉంటాయి. కాపీరైట్ నిబంధనలకు విరుద్ధంగా తమ రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్‌ను కాపీ కొట్టి ల్యాండ్‌విండ్ ఎక్స్7ను తయారు చేయటంపై జియాంగ్లింగ్ మోటార్స్, చాంగన్ ఆటో కంపెనీలపై జాగ్వార్ ల్యాండ్ రోవర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, December 5, 2014, 17:42 [IST]
English summary
Chinese automakers Jiangling Motors and Changan Auto has created LandWind X7 which replicates the exact copy of British luxury carmaker Jaguar Land Rover's Range Rover Evoque. The LandWind X7 was launched at the Guangzhou motor show in China last month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+