ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచిన ప్రముఖ నటుడు కెప్టెన్ విజయకాంత్ ఎలాంటి కార్లలను వినియోగించారో తెలుసా?
ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ (Actor Captain vijayakanth) అనారోగ్య సమస్యలతో చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఇవాళ ఉదయం మరణించారు. విజయకాంత్ మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
27 సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి వచ్చిన విజయకాంత్ తన నటనతో ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. సుమారు 150 సినిమాల్లో నటించారు. 1984 సంవత్సరంలో ఏకంగా 18 సినిమాలను విడుదల చేశారు. పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాల్లో విజయకాంత్ నటించారు. చివరిగా 2015లో నటించారు.

బాధితులను ఉదారంగా ఆదుకున్న కొంతమంది నటుల్లో విజయకాంత్ ఒకరు. తుపానులు సహా ఇతర విపత్తుల సమయంలో విరాళాలు ఇచ్చి ఆదుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడిన శ్రీలంక ప్రజలకు సాయం చేశారు. నటుడు విజయకాంత్ తన జీవిత కాలంలో అనేక కార్లను వినియోగించారు. ఆయా కార్ల జాబితా మీకోసం.
Audi Q7 : భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న లగ్జరీ వాహనాల్లో ఆడి క్యూ 7 వాహనం ఒకటి. ఆడి క్యూ 7 కారు ప్రారంభ ధర ధర రూ.84.70 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. మరియు హై ఎండ్ మోడల్ 92.30 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ కారు 3 వేరియంట్లు, 6 రంగుల్లో అందుబాటులో ఉంది. గతంలో తన ప్రయాణాల కోసం కెప్టెన్ విజయకాంత్ ఈ వాహనాన్ని వినియోగించేవారు.

మెర్సిడెస్ బెంజ్ S350 CDI : ఈ మెర్సిడెస్ లగ్జరీ కారును విజయకాంత్ వినియోగించేవారు. ఈ వాహనం ధర రూ.1.6 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ వాహనం 2014లో భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు డిజైన్, ఫీచర్ల పరంగా ఆకట్టుకుంటుంది.
BMW X5: విజయకాంత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు షణ్ముగ పాండియన్ మరియు విజయ ప్రభాకర్.. వీరిద్దరు కలిగి విజయకాంత్‌కు ఈ బీఎండబ్ల్యూ X5 కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర రూ.95.20 లక్షల నుంచి రూ.1.02 కోట్లుగా ఉంది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇటీవలే భారత్‌లో విడుదల అయింది. దీని ధర రూ.93.9 లక్షలుగా ఉంది. మరియు హైఎండ్ మోడల్ ధర రూ.1.06 కోట్లుగా ఉంది.

ఫోర్డ్ ఎండీవర్ : ఈ ఫోర్డ్ మోడల్ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు. అయితే భారత్‌లో చాలా తక్కువ మంది ఈ కారును వినియోగిస్తుండగా.. అందులో విజయకాంత్ ఒకరు. ఈ కారు ధర. 29.99 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉండేది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.36.26 లక్షలుగా ఉండేది.
Volvo S90 : కెప్టెన్ విజయకాంత్ ఎక్కువగా ఇష్టపడే కార్లలో వోల్వో ఎస్90 కారు ఒకటి. ఈ సెడాన్‌లో అనేక ప్రీమియం ఫీచర్లున్నాయి. భారత్‌లో ఈ కారు ధర రూ.68 లక్షలుగా ఉండేది. 5-సీటర్ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. తన కుటుంబంతో ప్రయాణించే సమయాల్లో విజయకాంత్ ఈ వాహనాన్ని వినియోగించేవారు.

ఈ కార్లతోపాటు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎక్కువగా వినియోగించారు. పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినప్పుడు ఈ కారులోనే ప్రయాణం చేసేవారు. దీంతోపాటు హ్యుందాయ్ శాంటా FE మోడల్ వాహనాన్ని కూడా కెప్టెన్ వినియోగించారు. భారత్‌లో విక్రయించని కార్లలో ఈ మోడల్ కూడా ఉంది. అయితే వాహనాన్ని విజయకాంత్ వినియోగించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








