ఈ కష్టం ఎవరికీ రావద్దు బ్రో.. కొత్త కారుకు కొన్న రోజే యాక్సిడెంట్.. రోడ్డుమీద కూర్చొని!

కారు కొనడం చాలా మందికి ఓ పెద్ద కల. దాన్ని సాకారం చేసుకోవడానికి సామాన్యులు చాలా శ్రమిస్తుంటారు. డబ్బులు కూడబెట్టి నచ్చిన కారును కొనుగోలు చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు నిజమైన రోజు వాళ్ల ఆనందానికి అవధుల్లేవన్నట్లే ఉంటుంది. కొత్త కారుకు పూజ చేసి, ఇంటిల్లిపాది దాని ముందు ఫోటో దిగి దాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. తమ కలల ప్రయాణాన్ని హాయిగా మొదలుపెడతారు. మరి అలాంటి కారు ఇంటికి తెచ్చుకునే రోజునే యాక్సిడెంట్‌కు గురైతే ? మురిపెంగా ఇంటికి తీసుకురావాల్సిన కారును సొట్టలు పడి తీసుకువస్తే? ఇది ఎవరినైనా కలచి వేస్తుంది కదా! ఇలాంటి ఓ ఘటన నిజంగా జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆశగా కొనుగోలు చేసిన కారుకు కొన్న రోజునే యాక్సిడెంట్ గురువడంతో ఓ వ్యక్తి.. రోడ్డు మీద కూర్చుని బోరున విలపించాడు. ఆ కారుకు ఇంకా పూజలు చేసినట్లుగా దాని చుట్టూ పూలదండలు, రిబ్బన్లు అలాగే ఉన్నాయి. అంత కొత్త కారు ముందు అతడు అలా కన్నీరు పెట్టడం.. చూసేవారిని కలచి వేసింది.

Car Accident on Delivery Day

వీడియోలో కనిపించిన ఈ కారు నిస్సాన్ మ్యాగ్నైట్ కారు. ఇది దేశంలో కాస్త తక్కువ ధరలో లభించే ఎస్‌యూవీ అని చెప్పవచ్చు. భారత్‌లో వినియోగదారుల నుంచి ఈ కారు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తక్కువ ధరలో ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది. అయినప్పటికీ దీన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు ఓ పెద్ద కలనే!

డెలివరీ తర్వాత కొన్ని గంటల్లోనే ఈ కారు యాక్సిడెంట్‌కు గురైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ యాక్సిడెంట్‌లో ఎలాంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం జరగలేదు. కానీ, కారు పక్క భాగం కొద్దిగా దెబ్బతిని కనిపించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ కారణమేంటనేది తెలియరాలేదు.

Car Accident on Delivery Day

ఈ కారు డ్రైవర్ దాన్ని నడిపేటప్పుడు ఏకాగ్రత కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్‌లో కారు సైడ్ బాగం కొద్దిగా డ్యామెజీ అయినప్పటికీ.. ఇది పెద్ద సమస్య కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. దీన్ని రిజస్టర్ చేసుకునేటప్పుడు బీమా సౌకర్యం ఉంటుంది కాబట్టి దీన్ని సరిచేయించవచ్చు.

ఈ కారులో ఫెండర్, బంపర్, హెడ్ లైట్లు దెబ్బతిన్నాయి. ఇక నిస్సాన్ మ్యాగ్నైట్ కారు ఫీచర్లను గమనిస్తే.. దీంట్లో LED హెడ్ లైట్స్, 8- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కార్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటివి ఉంటాయి. దీంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్, JBL మ్యూజిక్ సిస్టం, యాంబియెంట్ లైట్ సెట్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉంటాయి.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: ఈ నిస్సాన్ మ్యాగ్నైట్ కారు మోడల్ రూ.4.99 లక్షలతో లాంఛ్ అయింది. అయితే ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.6 లక్షలుగా ఉంది. ఇది కేవలం ఎక్స్- షో రూమ్ ధర. ఈ కారు చాలా మంది భారత వినియోగదారులకు ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2025, 18:47 [IST]
English summary
Car accident on delivery day man cried by sitting middle of the road video went viral
Read more on: #off beat #accident #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+