Just In
Don't Miss
- Movies
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?
బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను మాత్రమే కాదు యావత్ భారత సినీ పరిశ్రమని కలవరపెట్టింది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్‌లో ధోని పాత్ర పోషించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికి తెలిసిన విషయమే.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని హావభావాలన్నీ తెరపై అద్భుతంగా చూపించడమే కాకుండా, ఎంతో మంది ప్రజలచేత ప్రశంసించబడ్డాడు. ఈ చిత్రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యొక్క నటనా సామర్థ్యానికి ఒక చిన్న ఉదాహరణ. అసాధారణ ప్రతిభ ఉన్న ఈ యువ నటుడు 2020 జూన్ 14 న అనుకోకుండా మరణించాడు.

బాలీవుడ్ రాజకీయాల కారణంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు షాకింగ్ కి గురి చేస్తాయి. మరోవైపు అతని అభిమానులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. 2006 లో తీసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యింది.
MOST READ:హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఈ ఫోటోలో సుశాంత్ హోండా కంపెనీ యొక్క పసుపు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చున్నాడు. చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉండటం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ స్పోర్ట్స్ బైక్‌పై చాలాసార్లు కనిపించారు. నేటి యువకులు కళాశాలలో ఉన్నప్పుడు అత్యధిక విలువైన బైకులను నడుపుతున్నారు.

పిల్లల కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పోర్ట్స్ బైక్‌లను నెలవారీ వాయిదాలలో కొనుగోలు చేస్తారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కాలేజీ రోజుల నుండే ఈ హోండా స్పోర్ట్స్ బైక్‌ను కొన్నాడు.
MOST READ:మతి పోగొడుతున్న కొత్త డుకాటీ పానిగలే వి 4 ఆర్ : ధర & ఇతర వివరాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన పట్టుదల ద్వారా కొనుగోలు చేసిన మొదటి బైక్ ఇదే. కళాశాల రోజుల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇతర విద్యార్థులకు ట్యూషన్ తీసుకుంటున్నాడు.

ట్యూషన్ ద్వారా సంపాదించిన డబ్బు నుండి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. 2016 లో అతడు ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసాడు. ఈ పోస్ట్ లో విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం ద్వారా కొనుగోలు చేసిన మొదటి బైక్ అని తెలిపాడు.
MOST READ:మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

ఈ చిత్రాన్ని అతడు తన అభిమానులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పంచుకుంటున్నారు. ఈ బైక్‌తో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బిఎమ్‌డబ్ల్యూ కె 1300 ఆర్ బైక్ కూడా ఉంది.

ఈ బైక్‌పై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి మహేంద్ర సింగ్ ధోని ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదనంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రేంజ్ రోవర్ మరియు మసెరటి క్వాట్రోపోర్ట్ వంటి అనేక విలువైన లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నారు.
Image Courtesy: Ankur Tyagi Via Zee News
MOST READ:రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]