9 కార్ బాడీ స్టైల్స్ : అందుబాటులో ఉన్న కార్లు

By Vinay

హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్.యూ.వీ, వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇంతకీ వాటి అర్థాలు ఏంటి? అవి కార్ బాడీ స్టైల్స్ యొక్క రకాలు, కార్ తయారుచేయబడిన రకాలు. అర్థమయ్యే రీతిలో కార్ బాడీ స్టైల్స్ యొక్క రకాలు, కార్ తయారుచేయబడిన రకాల గురించి వివరించబోతున్నాం.

ఈ ఆధునిక యుగంలో అనేక రకాల కార్లు వివిధ స్టైల్స్ లో వస్తున్నాయి. క్రింది కథనం ద్వారా వివిధ రకాల కార్ బాడీ స్టైల్స్ గురించి తెలుసుకుందాం....

1. సెడాన్ :

1. సెడాన్ :

సెడాన్ ను సెలూన్ అని కూడా పిలుస్తారు. ఇది ఇంజన్ బ్యానెట్ తో కవర్ చేయబడి, వెనుక భాగంలో లగేజి కోసం ప్రత్యేక క్యాబిన్ కలిగి ఉండే ప్యాసింజర్ కార్. ఈ కాలంలో ఇది ఒక పాపులర్ కార్ బాడీ స్టైల్స్. ఇందులో నలుగురు కూర్చునే విధంగా తయారుచేయబడింది. హోండా సిటీ సెడాన్ కు ఒక ఉదాహరణ.

2. హ్యాచ్ బ్యాక్ :

2. హ్యాచ్ బ్యాక్ :

హ్యాచ్ బ్యాక్ వెనుక భాగం వాలుగా, వెనుక డోర్ పైకి లేచేలా ఉండే కార్ బాడీ స్టైల్స్. ఈ కారు ఎస్వీయూ, ఎమ్పీవీ, వ్యాన్ లకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నలుగురు, ఐదుగురు కూర్చునే విధంగా తయారుచేయబడింది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ కు ఒక ఉదాహరణ.

3. ఎస్.యూ.వీ :

3. ఎస్.యూ.వీ :

ఎస్.యూ.వీ అంటే స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఇది ఎస్టేట్ ను లాగా ఉంటుంది. కానీ పెద్దదిగా, భూమి నుంచి చాలా ఎత్తుగా ఉంటుంది. ఎస్.యూ.వీ కొన్ని సార్లు ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ ఆఫ్షన్ ను కల్పిస్తుంది. మిని వ్యాన్ లేదా పెద్ద సెడాన్ లాగా ప్యాసింజర్ కెపాసిటీని కలిగి ఉంది. ఫోర్డ్ ఎండ్యావర్ ఎస్.యూ.వీ కు ఒక ఉదాహరణ.

4. ఎమ్.పీ.వీ. :

4. ఎమ్.పీ.వీ. :

ఎమ్.పీ.వీ. అంటే మల్టీ పర్పస్ వెహికల్. ఇది ఒకటి లేక రెండు బాక్సుల డిజైన్ మరియు స్టేషన్ వ్యాగన్స్ కన్నా పొడువైనది. వీటిని పీపుల్ క్యారియర్స్, పీపుల్ మూవర్స్ అని పిలుస్తారు. ఏడుగురు, అంత కంటే ఎక్కువ మంది కూర్చునే విధంగా మూడు భాగాలుగా డివైడ్ చేయబడి ఉంది. టయోటా ఇన్నోవా ఎమ్.పీ.వీ.కు ఒక ఉదాహరణ.

5. ఎస్టేట్ :

5. ఎస్టేట్ :

ఎస్టేట్ లేదా స్టేషన్ వ్యాగన్, సెడాన్ ను పోలిన బాడీ స్టైల్ ను కలిగి ఉంది. అయితే వెనుక భాగం ఎక్స్ టెండెడ్ లగేజి లేదా కార్గో ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది రెండు బాక్సుల డిజైన్ తో ప్యాసింజర్ లకు అనుగుణంగా ఉంటుంది. స్కోడా ఆక్టావియా కాంబీ ఎస్టేట్ కు ఒక ఉదాహరణ.

6. క్రాసోవర్ :

6. క్రాసోవర్ :

క్రాసోవర్ అనేది కార్ ప్లాట్ ఫామ్ తో తయారుచేయబడింది. అయితే కొన్నిసార్లు ఎస్.వీ.యూ లాగా గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి, ఎక్కువ మంది కూర్చునే విధంగా డిజైన్ చేయబడి ఉంది. ఇది కొద్దిగా ఆఫ్-రోడ్ ఆఫ్షన్ ను కల్పిస్తుంది. కొత్తగా ఆవిష్కరించబడిన ఫియట్ అవెంటురా క్రాసోవర్ కు ఒక ఉదాహరణ.

7. కుపే :

7. కుపే :

కుపే కార్లు డోర్లను 4 నుంచి 2కు తగ్గించిన సెలూన్ కార్లలోని స్ఫోర్టీ వేరియంట్లు. కుపే అనే పేరు టు కట్ అని అర్థానిచ్చే ఫ్రెంచ్ పదం కూపర్ నుంచి వచ్చింది. ఇందులో కార్ బాడీ స్టైల్ తయారీ సంస్థను బట్టి మారుతుంది. మెర్సెడెస్ బెంజ్ సీఎల్ఎస్-క్లాస్ 4 డోర్ల కుపే కారుకు ఒక ఉదాహరణ. ఆడి ఏఎస్ 2 డోర్ల కుపే కారుకు ఒక ఉదాహరణ.

8. కన్వర్టిబుల్ :

8. కన్వర్టిబుల్ :

కన్వర్టిబుల్ లేదా కార్బియోలెట్ వేయగల మరియు ముడుచుకోగల టాప్ కలిగిన కార్ బాడీ స్టైల్. ఈ కార్లు క్యాన్వాస్ లేదా వినైల్ టాప్ లను కలిగి ఉండేవి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్, అల్యూమినియం, స్టీల్ తోను తయారవుతున్నాయి. ఈ కార్లు రెండు-డోర్లను కలిగి ఉన్నాయి. బీ.ఎమ్.డబ్ల్యూ జెడ్4 కన్వర్టిబుల్ కారుకు ఒక ఉదాహరణ.

9. ఫిక్ అఫ్ :

9. ఫిక్ అఫ్ :

ఫిక్ అఫ్, వెనుక భాగం బెడ్ అనే ఓపెన్ కార్గో ఏరియాను కలిగి ఉంటాయి. ఇవి యూఎస్ లో ప్రసిద్ధి చెందాయి. ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఉట్స్ అని పిలువబడుతున్నాయి. కొన్ని సార్లు 2, 4 డోర్లు కలిగి ప్యాసింజర్లను తీసుకెళ్లే విధంగా ఉంటాయి. వీటిని సింగిల్ స్లాబ్, డ్యూయల్ స్లాబ్ ఫిక్ అఫ్ అని పిలుస్తారు. టాటా క్సెనాన్ ఫిక్ అఫ్ కు ఒక ఉదాహరణ.

More from DriveSpark

Article Published On: Thursday, June 25, 2015, 16:32 [IST]
English summary
Ever come across the terms ‘hatchback' or ‘sedan' and wondered what they mean? Well, those actually are descriptions of body styles of a car, or the type or form of vehicle design.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+