కారులో కూర్చుంటే క్యాన్సర్.. తాజా అధ్యయనంలో భయంకరమైన విషయాలు వెలుగులోకి.!!
కారులో లాంగ్ జర్నీ చేయడమంటే ఇష్టపడని వారుండరు. ఇష్టమైన మ్యూజిక్ వింటూ స్నేహితులతో, ఫ్యామిలీతో లేదా ఒంటరిగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడమంటే చాలా మందికి సరదా. అయితే ఇలా కారులో ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్ వస్తుందని మీకు చెబితే ఒక్కసారిగా మీ హార్ట్ బీట్ పెరుగుతుంది. అవునండీ.. తాజా అధ్యయనంలో ఇందుకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
రోజూ కారులో ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్(Car Cabin Air Causes Cancer) వస్తుందట. ఇటీవల నిర్వహించిన ఓ రీసెర్చ్ ఈ షాకింగ్ విషయం చెబుతోంది. ఈ అధ్యయనంలో నమ్మలేని నిజాలను పరిశోధకులు చెబతున్నారు. అసలు కారులో కూర్చుంటే క్యాన్సర్ రావడమేంటి.. కారుకి, క్యాన్సర్‌కి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలోనే ఎక్కువ: ఇటీవల "Environmental Science & Technology"లో ఇందుకు సంబంధించి ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం.. కారులో కూర్చునే ప్రయాణికులు క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారని పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇతర సీజన్లతో పోలిస్తే.. వేసవి కాలంలో మాత్రం క్యాబిన్ నుంచి ఈ కెమికల్స్ ఇంకా ఎక్కువ విడుదలవుతున్నాయని పరిశోధనలో వెల్లడైంది.
ఆ కార్లపై పరిశోధన: ఈ పరిశోధనలో ప్రధాన పరిశోధకురాలిగా పనిచేసిన టాక్సికాలజీ సైంటిస్ట్.. రెబెక్కా హోహెన్ డ్యూక్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కారు క్యాబిన్(Cancer from Car Cabin Air) నుంచి వెలువడే హానికర కెమికల్స్‌పై నిర్వహించిన అధ్యయనంలో ఆమె ప్రధానంగా ఉన్నారు. కాగా ఈ పరిశోధనలో 2015 నుంచి 2022 మధ్యలో విడుదలైన 101 కారు మోడళ్లపై పరిశీలన చేశారు.

క్యాన్సర్ కారకాలివే: పరిశోధనలో భాగంగా ఈ 101 కారు మోడళ్లలో ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల ఎయిర్ క్యాబిన్‌లపై నిశితంగా అనాలసిస్ చేపట్టారు. ఈ రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 99 శాతం కార్లలో TCIPP అనే ఫ్లేమ్ రిటార్డెంట్ ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే చాలా వరకు కార్లలో TDCIPP, TCEP అనే క్యాన్సర్ కారక ఫ్లేమ్ రిటార్డెంట్లు కూడా ఉన్నాయని కూడా వెల్లడించారు.
కారులో కూర్చున్నవారు TCIPP, TDCIPP, TCEP కారకాలను ఎంత ఎక్కువగా పీల్చితే.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా రోజూ కారులో ఎక్కువగా ప్రయాణిస్తూ.. హానికరమైన రసాయనాలను పీల్చడం వల్ల క్యాన్సర్ బారిన పడటమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు.

అయితే చలికాలం, వర్షాకాలంతో పోలిస్తే.. ఎండాకాలంలో అధిక వేడి కారణంగా కారు క్యాబిన్‌లో ఈ హానికరమైన రసాయనాలు ఇంకా ఎక్కువ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఇంకా వీటి ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని.. పెద్దలపై తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి వాహనదారులు, ప్రయాణికులు ఈ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: కారు క్యాబిన్ నుంచి హానికరమైన కెమికల్స్ ఎక్కువగా విడుదల కాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలని రెబెక్కా పేర్కొన్నారు. వాహనదారులు వీలైనంత వరకు కారును ఎండలో పార్క్ చేయకుండా.. చెట్టు నీడలో లేదా గ్యారేజ్‌లో పార్క్ చేయడం ఉత్తమం. వీలైనప్పుడల్లా కారు విండోస్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. దీని వల్ల లోపలి గాలి బయటకు వెళ్లిపోయి క్యాబిన్‌లో తాజా గాలి వ్యాపిస్తుంది.

ఇంకా కారు ఆగినప్పుడు అందులోనే కూర్చోవాల్సి వస్తే.. విండోస్ ఓపెన్ చేసి ఉంచుకోవాలని పేర్కొన్నారు. దీని ద్వారా తాజా గాలి ప్రసరిస్తుంది. కాగా ఈ సూచనలన్నీ తాజా అధ్యయనం ప్రకారం పరిశోధకులు, శాస్త్రవేత్తలు అందించినట్లు వ్యూయర్స్ గమనించాలి. ఏదేమైనా వేసవిలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణికులు ఎక్కువగా ఏసీపైనే ఆధారపడకుండా బయటి గాలికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ.. అనారోగ్యం బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలి.


Click it and Unblock the Notifications








