శీతాకాలంలో మీ వాహనం మైలేజీ తగ్గుతోందా... ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి మైలేజీతోపాటు..!!
భారత్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రజలు వణికిపోతున్నారు. దక్షిణ భారతంలోనూ గత నెల వరకు ఎండ, ఉక్కపోతతో బాధపడిన ప్రజలను చలి వణికిస్తోంది. అయితే చలికాలం ప్రజలకే కాకుండా వాహనాల పనితీరు పైనా ప్రభావం చూపిస్తుంది.
ముఖ్యంగా చలికాలంలో అప్రమత్తంగా లేకుంటే వాహనం మైలేజీ తగ్గిపోయే ప్రమాదం ఉంది. చలికాలం పరిస్థితులు వాహన మైలేజీపై ప్రభావం చూపుతాయి. మరియు ఇతర సమస్యలకు కారణం కావచ్చు. అయితే సరైన చర్యలు తీసుకోవడం ద్వారా చలి కాలంలోనూ సరైన మైలేజీని పొందవచ్చు.

టైర్ ప్రెజర్ : కొంత మంది వాహనదారులకు టైర్ ప్రెజర్ మేనేజ్‌మెంట్‌పైన సరైన అవగాహన ఉండదు. ఇతర కాలాలతోపాటు చలికాలంలోనూ సరైన టైర్ ప్రెజర్‌ను కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి. తగినంత టైర్ ప్రెజర్ ఉంటేనే.. సరైన ట్రాక్షన్‌ను కలిగి ఉంటాయి. మరియు తగిన మైలేజీ ఇచ్చేందుకు సాయపడుతుంది. దీంతోపాటు టైర్లు మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది.
డ్రైవింగ్ : రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా వాహనం నడపాలి. కొంతమంది వాహనదారులు వర్షాకాలంలో జారిపోతామనే భయంతో నిర్ధిష్ట వేగంతో వాహనాలను డ్రైవింగ్ చేస్తారు. మిగిలిన కాలాల్లో అధికవేగంతో డ్రైవింగ్ చేస్తారు. చలికాలంలో మంచు కారణంగా వాహనాలు జారిపోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు అధిక వేగం కారణంగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది.

ఇంజిన్ వేడెక్కేందుకు సమయం ఇవ్వండి : వర్షాకాలం, శీతాకాలాల్లో వాహనాల ఇంజిన్లు త్వరలో చల్లబడతాయి. అందువల్ల ఇలాంటి సమయంలో వాహనాలను స్టార్ట్ చేసేటప్పుడు.. ఇంజిన్ వేడెక్కేందుకు అవకాశం ఇవ్వండి. వాహనం స్టార్ట్ చేసి వెంటనే ప్రయాణం ప్రారంభించకండి. ఇది ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందువల్ల ఇంజిన్ వేడెక్కేలా తగిన సమయం ఇవ్వాలి.
సరైన ఇంజిన్ ఆయిల్‌ను ఎంచుకోండి : ఇంజిన్ ఆయిల్‌ను ఎంచుకొనేటప్పుడు వాహనదారుడికి సరైన అవగాహన అవసరం. కొన్ని రకాల ఇంజిన్ ఆయిల్స్ గేర్‌బాక్స్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఫలితంగా మైలేజీ తగ్గుతుంది. అందువల్ల సరైన ఇంజిన్ ఆయిల్‌ను ఎంచుకొనేందుకు అవగాహన ఉన్నవారి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఓవర్ వెయిట్ : వాహన మైలేజీ తగ్గేందుకు ఓవర్ వెయిట్ కూడా కారణం. ఎందుకంటే వాహనం మోయగలిగిన బరువు కంటే అదనంగా బరువు ఉంటే... వాహనానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఫలితంగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. నిర్దిష్ట బరువులు తీసుకెళ్లడం ద్వారా సరైన మైలేజీని పొందవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








