కారు క్లీనింగ్ కోసం పది అత్భుతమైన చిట్కాలు..

By N Kumar

ప్రతి ఒక్క కారు యాజమానికి వారి కార్ల పట్ల కొంచెం భాత్యత ఉంటుంది. కారు యాజనికే అని కాదు ఇంట్లో వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిని కడగాలి అంటే ఏ సర్వీసింగ్‌ సెంటర్‌కో పంపేస్తాం ఇక్కడే తెలిసిపోతుంది మన కారు మీద మనకు ఎంత ప్రేమ ఉందో అని.

ఒక వేళ మీరు మీ కారులో దూరప్రాంత ప్రయాణాలు చేసినపుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని మీ కారు ఎలా మారిపోయి ఉంటుందో తెలుసా? కారు మొత్తం బురదతో నిండపోయి, చక్రాలకు పూర్తిగా తారు అంటుకుని అసలు చూడటానికే వీలవదు. అప్పడు ఏం చేస్తారు?

మీరు దీనికి గురించి ఆలోచించడం మానేయండి. ఎందుకంటే కార్ క్లీనింగ్‌కు సంభందించి పది చిట్కాలు ఉన్నాయి. ఏది ఒ లుక్కేసుకోండి.

 1. నీరు శుభ్రపరిచే ఉత్పత్తులు

1. నీరు శుభ్రపరిచే ఉత్పత్తులు

చాలా మంది అనుకుంటారు రెండు బకెట్‌ల నీళ్లు ఉంటే చాలని. కాని ఇది తప్పు ఎందుకంటే? మీరు క్లాత్‌ని లేదా స్పాంజిని నీటిలో అద్ది కారును తుడుస్తారు. మళ్ళీ దానిని బకెట్‌లో అద్దుతారు అప్పుడు అందులో ఉన్న మట్టి మరియు చిన్నచిన్న రాళ్లు మళ్లీ స్పాంజి ద్వారా కారు మీదకు చేరుకుని గీతలు పడేట్లు చేస్తుంది. అందుకో అదనం మరొక టబ్ నీటిని ఉపయోగించడం మంచిది.

2.శుభ్రపరిచే ఉత్పత్తులు

2.శుభ్రపరిచే ఉత్పత్తులు

కొన్ని కారు క్లీనింగ్ ఉత్పత్తులు మీ కారు పెయింట్‌కు హాని కలిగిస్తాయి. అందుకోసం మంచి కారు క్లీనింగ్ ఉత్పత్తులను ఎంచుకునేందుకు మంచి సలహా. మీ కారు డీలర్‌ని సంప్రదించండి. వారు ఏది మంచిదో అనే సందేహాన్ని నివృతి చేస్తారు.

3. రిమ్‌లు మరియు చక్రాలు

3. రిమ్‌లు మరియు చక్రాలు

లాంగ్ డ్రైవింగ్ తరువాత కారు రిమ్‌లకు గ్రీస్ మరియు బ్రేక్ ఫ్లూయిడ్స్ అంటుకునే అవకాశం ఉంది. వీటిని క్లీన్‌ చేయడానికి ప్రత్యేకంగా ఏమి లేవు కాని మనం పాత్రలు కడిగే సబ్బుతో ఈ గ్రీస్ మరకలను ఎంతో సులభంగా శుభ్రపరచవచ్చు.

4. కీటకాలు

4. కీటకాలు

మీరు లాంగ్ ట్రిప్ వెళ్లివచ్చిన తరువాత కీటకాలు మరియు పురుగులు ముందు వైపు అద్దం మీద చనిపోయి ఉంటాయి. వీటిని క్లీన్ చేయడానికి కొంచెం కోలాను ఉపయోగించండి. అయితే దీనిని కారు అద్దానికి కాకుండా ఇతర భాగాలకు తగిలిస్తే ఇది కారు పెయింట్‌ను తొలగించేయగలదు.

 5. తారు మచ్చలు

5. తారు మచ్చలు

మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసినపుడు అక్కడక్కడ రోడ్డు పనులు జరుగుతుంటాయి. అప్పడు తారు మీ కారు మీద పడే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి తారు మచ్చలు తొలగించడానికి మయోన్నైస్ అనే పదార్థాన్ని తారు మచ్చల మీద పూసి ఐదు నిమిషాల తరువాత కడిగేస్తే తారు మచ్చలు తొలగిపోయి కారు పెయింట్ అలాగే ఉంటుంది. మయోన్నైస్ అనగా గుడ్డు యొక్క తెల్ల సోన, ఆయిల్ మరియు వెనిగర్ మిశ్రమం.

 6. పక్షుల రెట్ట

6. పక్షుల రెట్ట

ఇది ప్రతి ఒక్కరూ తరచూ ఎదుర్కొనే సమస్య. మీ కారు అద్దం మీద పక్షుల రెట్ట ఉంటే కొంచెం క్లబ్ షోడాను దీనిని పోసి ఒ రెండు నిమిషాల తరువాత నీటితో కడిగేస్తె సరిపోతుంది.

7.క్రోమ్ పరికరాలు

7.క్రోమ్ పరికరాలు

కారులో ఉన్న క్రోమ్ పరికరాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ క్రోమ్ పరికరాల మీద బూడిద చేరడం వలన అవి కాంతిని కోల్పోతాయి. మీరు మెత్తటి క్లాత్ తో దానిని తుడవడం వలన అవి తిరిగి వాటి ప్రకాశాన్ని పొందుతాయి.

8. మ్యాట్లను శుభ్రపరచడం

8. మ్యాట్లను శుభ్రపరచడం

కారు లోపల ఉన్న మ్యాట్లను కడగడం ఎంతో శ్రమతో కూడకున్నది అని అందరి అభిప్రాయం కాని ఇది తప్పు ఎందుకంటే ఇది ఎంతమాత్రము శ్రమ కాదు. ముందుగా కారులో ఉన్న మ్యాట్లను క్రిందకి తీసి వాటిని ఏటవాలుగాఉంచి కొంచెం సోప్ వాటర్ ఉపయోగించి బ్రష్‌తో కడిగేయండి చాలు.

9. మంచి వాసన కోసం

9. మంచి వాసన కోసం

కొన్ని రోజుల పాటు చేసిన లాంగ్ జర్నీ వలన మీ కారు లోపల నుండి చెడ్డ వాసనలు. దీనికి కారణం సిగరెట్లు కాల్చడం, తినుబండరాలు ఉండిపోవడం వలన. దీనికి పరిష్కారం గనులలో లభించే బొగ్గును కొంచెం ఒక సంచిలో నింపి మీ కారులో రెండు రోజుల పాటు ఉంచండి. ఈ బొగ్గు కారు లోపల ఉన్న దుర్గందాలను గ్రహించేస్తుంది.

10. బిగుసుకు పోయిన కారు తలుపులు

10. బిగుసుకు పోయిన కారు తలుపులు

కారును ఎక్కువగా కడగడం వలన కొన్ని నీళ్లు డోర్ల యొక్క కీళ్ల దగ్గర నిలువ ఉంటాయి. దీని వలన కారు డోర్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అప్పడు ఆ తలుపుల కీలు వద్ద కొంచెం ఆలివ్ నూనెను వదిలితే ఇలా జరగదు.

కార్లకు సంభందించి మరిన్ని టిప్స్ కోసం.....

  • కార్లకు సంభందించి మరిన్ని టిప్స్ కోసం.....

More from DriveSpark

Article Published On: Thursday, November 5, 2015, 13:28 [IST]
English summary
10 Car Cleaning Secrets To Try At Home
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+