మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట 'కేఎల్ రాహుల్-అతియా శెట్టి' లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి

ఇండియన్ స్టార్ క్రికెటర్ 'కేఎల్ రాహుల్' మరియు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె మరియు నటి 'అతియా శెట్టి' ఇటీవల వైభవంగా వివాహం చేసుకున్నారు. సునీల్ శెట్టికి చెందిన ఖండాలా బంగ్లాలో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

కేఎల్ రాహుల్ వివాహానికి ఇషాంత్ శర్మ, వరుణ్ ఆరోన్ మొదలైన వారు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది, దీనికి తోడు మరో వైపు రంజీ సీజన్ కూడా నడుస్తోంది. ఈ కారణంగా చాలామంది క్రికెటర్లు రాహుల్ పెళ్ళికి కాలేకపోయారు. అయితే ఐపీఎల్ తర్వాత రాహుల్-అతియా శెట్టి వివాహ రిసెప్షన్ జరగనుంది. అయితే పెళ్లిబంధంతో ఒక్కటైనా రాహుల్-అతియా కార్లను గురించి ఇక్కడ చూద్దాం.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

కేఎల్ రాహుల్ కార్లు:

BMW X7:

కేఎల్ రాహుల్ కార్లు వద్ద ఉన్న కార్లలో BMW కంపెనీ యొక్క X7 ఒకటి. ఇది రాహుల్ గ్యారేజిలో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి. ఈ SUV ప్రారంభ ధర రూ. 1.18 కోట్లు. ఇది 3.0 లీటర్ డీజిల్ మరియు 3.0 లీటర్ పెట్రోల్ అనే ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

BMW X7 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 340 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడి ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా డీజిల్ ఇంజిన్ 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్:

కేఎల్ రాహుల్ గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన వాహనం ఈ లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్ అని తెలుస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఐకానిక్ కారు అని చెప్పవచ్చు. దీని ధర సుమారు రూ. 4 కోట్లు కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్ 5.2 లీటర్ 10-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 640 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ సూపర్ కారు కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 325 కిమీ.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

మెర్సిడెస్ బెంజ్ సి43:

కేఎల్ రాహుల్ గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ సి43 కారు కూడా ఉంది. ఈ లగ్జరీ కారు ధర రూ. 83 లక్షలు. ఇది 3.0 లీటర్ వి6 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 390 హెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 155 కిమీ.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

అతియా శెట్టి కార్లు:

ఆడి క్యూ7:

ఇక కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి కార్ల జాబితాలో ఒకటి ఆడి కంపెనీ యొక్క క్యూ7. దీని ధర భారతీయ మార్కెట్లో రూ. 1 కోటికంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ లగ్జరీ కారు 3.0-లీటర్ 6-సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ టిఎఫ్ఎస్ఐ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 340 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

ఆడి క్యూ7 కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ SUV యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఈ SUV అద్భుతమైన డిజైన్ అధునాతన పర్ఫామెన్స్ అందించేలా రూపొందించబడి ఉంటుంది. ఈ SUV పొడవు 5 మీటర్లు కాగా వీల్ బేస్ 3 మీటర్ల వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్:

అతియా శెట్టి వద్ద ఉన్న కార్లలో జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ ఒకటి. దీని ధర రూ. 99.56 లక్షల నుంచి రూ. 1.97 కోట్లు వరకు ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో మొత్తం 6 వేరియంట్స్ లో లభిస్తుంది. అతియా వద్ద ఉన్న జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ ధర రూ. 1.15 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ లగ్జరీ కారు డీజిల్ మరియు పెట్రోల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. మార్కెట్లో ఈ జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ BMW 7 సిరీస్, ఆడి ఎ8 ఎల్ మరియు మెర్సిడెస్ ఎస్-క్లాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Car collection kl rahul athiya shetty bmw x7 audi q7 and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X