మూడు ముళ్ళతో ఒక్కటికానున్న కొత్త జంట.. ఖరీదైన కార్లు ఇవే - చూసారా!

మూడు ముళ్ళు, ఏడు అడుగులతో ఒక్కటికానున్న రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ బగ్నానీ పెళ్లి ఈరోజు గోవాలో జరగనుంది. ఈ కథనంలో వీరిరువురు ఎలాంటి కార్లను ఉపయోగిస్తున్నారు, వాటి ధరలు ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా ఫేమస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ఆ తరువాత ధ్రువ, సరైనోడు వంటి సినిమాల్లో తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు ఈ రోజు నిర్మాత జాకీ బగ్నానీతో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు గోవాలో వాలిపోయాయి.

Rakul Preet Singh Toyota

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta)

రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా ఉపయోగించే కారు టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిస్టా అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబిటీల వరకు అందరికీ ఇష్టమైన ఈ కారు గత రెండు దశాబ్దాలుగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 150 పీఎస్ పవర్ మరియు 343 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఎంజీ గ్లోస్టర్ (MG Gloster)

రకుల్ అండ్ జాకీల కార్ కలెక్షన్‌లో ఎంజి మోటార్ కంపెనీకి చెందిన గ్లోస్టర్ కూడా ఉంది. జాకీ రోజు వారీ వినియోగానికి ఈ కారును ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. గ్లోస్టర్ రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 2.0లీటర్ టర్బో ఇంజిన్ (163 PS పవర్ & 375 NM టార్క్), మరొకటి 2.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ (218 PS పవర్ & 480 NM టార్క్).

Rakul Preet Singh Mercedes

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ (Mercedes Benz GLE 350d)

రకుల్ ప్రీత్ ఉపయోగించే కార్లలో బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఈ 350డీ ఒకటి. ఈ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు హై ఎండ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ వెర్షన్ 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 330 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes Maybach S500)

రకుల్ గ్యారేజిలో ఖరీదైన కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్500. ఇది సాధారణ బెంజ్ కార్ల కంటే కూడా శక్తివంతమైనది. ఇందులోని 4663 సీసీ వీ8 పెట్రోల్ ఇంజిన్ 453 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

Rakul Preet Singh Mayback

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 ధర రూ. 2 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇందులో లెదర్ అపోల్స్ట్రే, వెంటిలేషన్ అండ్ మసాజ్ పంక్షన్లలో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, విండో షేడ్స్, వెనుక ప్రయాణికుల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రీమియం ఆడియో సిస్టం, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో అమ్మకానికి లేదు.

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 (Mercedes Maybach GLS600)

ఇక చివరగా చెప్పుకోదగ్గ మరియు రకుల్ గ్యారేజిలోని అత్యంత ఖరీదైన కారు మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600. దీని ధర రూ. 2.96 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఆన్ రోడ్ ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువ ఉంటుంది. సినీ తారలకు ఇష్టమైన ఈ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. ఇది మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 21, 2024, 15:00 [IST]
English summary
Rakul preet singh and jackky bhagnani car collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+