ఓల్డ్ మోడల్ కారు డెలివరీ.. 16 లక్షల ఫైన్, అసలేం జరిగిందంటే.. !
బుక్ చేసుకున్న కారును కాకుండా వేరే కారును డెలివరీ చేసిన ఓ డీలర్ కు భారీ జరిమానా పడింది. తప్పుడు కారును డెలివరీ చేయడమే కాకుండా సర్వీసులో జాప్యం చేసినందుకు రూ.15,95,110 చెల్లించాలని జిల్లా వినియోగదారుల కంప్లైంట్స్ రిడ్రెసల్ ఫోరం ఆదేశించింది. ఈ సంఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగింది.
ధార్వాడ్ లోని JSS కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్ నాగరాజు పాటిల్, కియా నుంచి విడుదలైన Seltoz HTK+G, స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీటర్, ( FaceLift+ Muffer) బంపర్ తో కూడిన వాహనాన్ని విడుదల చేసింది. దీనిని మే 28, 2020న నాగరాజ్ పాటిల్ బుక్ చేసుకున్నారు. ఈ వాహనం అధికారికంగా జూన్ 2, 2020న లాంఛ్ కావాల్సి ఉంది.
అయితే జూలై 2 2020న, పాత మోడల్ అయిన Seltoz HTK+ 1.5 లీటర్ వాహనాన్ని హుబ్బళిలోని నాగశాంతి కియా డీలర్ డెలివరీ చేసింది. అనంతరం తనకు అమ్మిన కారు బుక్ చేసిన కారు కాదని గమనించిన నాగరాజు.. నెల రోజుల తర్వాత విషయాన్ని గుర్తించి డీలర్ ను సంప్రదించాడు. వెంటనే కారును మార్చాలని కోరాడు. అయినా కానీ అతని కంప్లైట్ ను సదరు డీలర్ పట్టించుకోలేదు.

ప్రయోజనం లేక వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు..
రిప్లేస్ మెంట్ కోసం చాలాసార్లు డీలర్ ను సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం లభించలేదని నాగరాజు తెలిపారు. షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నాగశాంతి KIA జనరల్ మేనేజర్ వాహనాన్ని మార్చడానికి నిరాకరించారని వినియోగదారుడు ఆరోపించారు. ఇప్పటికే డెలివరీ చేసిన వాహనం కొత్త మోడల్ లోనే అందుబాటులో ఉందని మోసం చేసిందని వాపోయాడు.
నాగశాంతి KIA డీలర్ పై వినియోగదారుల ఫోరమ్ ను నాగరాజు ఆశ్రయించాడు. తాజాగా ఇరువురి వాదనలు విన్న ఫోరం వినియోగదారుని సమర్పించిన పత్రాలను పరిశీలించింది. ఫోరం చైర్మన్ ఈశప్ప భూటే, సభ్యులు విఐ బొలిశెట్టి, పిసి హిరేమఠ్ లు ఫిర్యాదు దారుడు బుక్ చేసిన వాహనాన్ని నాగశాంతి కియా డీలర్ డెలివరీ చేయలేదని నిర్ధారణకు వచ్చారు.
కొత్త కారు ఇవ్వాలన ఆదేశం..
పూర్తి స్థాయిలో వినియోగదారునికి సేవలు అందించకపోవడం వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫోరమ్ పేర్కొంది. ఏదైనా వ్యాపారంలో ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమైందని తెలిపింది. ఈ సందర్భంగా, నాగశాంతి KIA డీలర్లు వినియోగదారుని నమ్మకాన్ని వమ్ముచేశారని మండిపడింది.పాత మోడల్ వాహనాన్ని డెలివరీ చేయడం ద్వారా కస్టమర్ ను మోసం చేయడమేనని వెల్లడించింది.
ఖరీదైన వస్తువులను కస్టమర్లు కొనుగోలు చేసినప్పుడు, వారికి డెలివరీ చేయబడిన వస్తువు నాణ్యతపై కూడా జాగ్రత్త వహించాలని డీలర్ కు ఆదేశించింది. ఇకపై ఇలాంటి సందర్భాల్లో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని చెప్పింది. ప్రస్తుత వినియోగదారుడికి తను బుక్ చేసుకున్న HTK+G స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీటర్ వాహనాన్ని నెలలోపు డెలివరీ చేయాలని డీలర్ ను ఆదేశించింది.

దాదాపు 16లక్షల ఫైన్..
కొత్త కారు ఆర్డర్ జాప్యంలో విఫలమైనందుకు 2 జూలై 2020 నుంచి 8% వడ్డీతో సుమారు కస్టమర్ కు రూ. 14.85 లక్షలను రీఫండ్ చేయాలని ఆదేశించింది. దీంతో పాటు కస్టమర్ కు కలిగిన అసౌకర్యానికి రూ. లక్ష పరిహారం చెల్లించాలని చెప్పింది. కారు డెలవరీ ఖర్చుల నెల రోజులకు మరో రూ.10,000 చెల్లించాలని డీలర్ ను ఫోరం ఆదేశించింది. మొత్తం మీద దాదాపు రూ.16 లక్షల జరిమానా విధించింది.
వినియోగదారుల హక్కులపై భారత ప్రభుత్వం 2019లో నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. 2020 జూలై 20 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది.ఈ చట్టం వల్ల వినియోగదారుడు మరింత బలవంతుడు అవుతాడని చట్టం చెబుతోంది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీ దారులకు శిక్షణ, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాల్లో అనేక నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








