Car Accident ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. అలర్ట్‌గా లేకుంటే అంతే సంగతులు.. లైవ్ యాక్సిడెంట్ వీడియో..!!

ఘాట్‌ రోడ్‌లో డ్రైవింగ్‌ చేయడమంటే సాధారణ విషయం కాదు. మలుపుల మధ్య అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ వాహనం నడపాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరగడం ఖాయం. అందుకే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు విషయానికొస్తే నైపుణ్యం ఉన్న డ్రైవర్లను మాత్రమే విధుల్లోకి తీసుకుంటారు. ఇక ప్రైవేట్‌ వాహనాల డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలి. తాజాగా ఓ కారు డ్రైవర్‌ ఘాట్‌ రోడ్డుపై డ్రైవింగ్‌ చేస్తూ తడబడటంతో ప్రమాదానికి గురయ్యారు.

తప్పుడు డ్రైవింగ్‌ పద్ధతుల వల్ల ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటో మొబైల్‌ రంగంలో వచ్చిన విస్తృత మార్పుల కారణంగా ఆ ప్రమాదాలు ఎలా జరిగాయో తెలుసుకునే అవకాశం ఏర్పడింది. కార్లలో పొందుపరిచిన డ్యాష్‌ బోర్డు కెమెరాల ద్వారా ఆయా ఘటనలకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కియా సెల్టోస్‌ కారు ఘాట్‌ రోడ్డుపై ప్రమాదానికి గురైంది.

Car Accident

తమిళనాడులో ఓ ఘాట్‌ రోడ్డుపై కియా సెల్టోస్‌ కారు నడుపుతూ కొందరు యువకులు బయలుదేరారు. డ్రైవర్‌ రోడ్డుకి ఎడమవైపుగా వెళ్తున్నాడు. ఇంతలో ఎదురుగా అవతలివైపు నుంచి ట్రక్‌ వస్తోంది. అనుకోని పరిణామంతో తడబడిన డ్రైవర్‌ భయంతో కారును కుడివైపునకు మళ్లించాడు. దీంతో కారు, ట్రక్‌ ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. ఇదంతా కియా సెల్టోస్‌ కారులోని డ్యాష్‌ బోర్డు కెమెరాలో రికార్డయింది.

ఘాట్‌ రోడ్డులో వాహనం నడుపుతున్నప్పుడు మలుపుల వద్ద ప్రతిసారీ డ్రైవర్‌ హారన్‌ కొట్టడం తప్పనిసరి. ఇక్కడ ట్రక్‌ డ్రైవర్‌ హారన్‌ కొడుతూనే ఎదురుగా వస్తున్నట్లు వీడియోలో వినిపిస్తుంది. కానీ అది గమనించని కారు డ్రైవర్‌ ఎడమ వైపుగా వెళ్తున్నాడు. అంతలోనే ఎదురుగా ట్రక్‌ కనిపించేసరికి తప్పించుకోవడానికి కుడివైపునకు వెళ్తూ ఎదురుగా ట్రక్‌ను ఢీకొన్నాడు. దీంతో ప్రమాదం సంభవించింది.

Car Accident

అవగాహన తప్పనిసరి : ఘాట్‌ రోడ్లపై ట్రక్కు, లారీ వంటి భారీ వాహనాలు ప్రయాణించేటప్పుడు హై రేడియస్‌ కారణంగా ఎక్కువగా మలుపులు తీసుకుంటాయి. ఈ వీడియోలో ట్రక్‌ డ్రైవర్‌ కూడా అదే పని చేశారు. కానీ అది గమనించని కారు డ్రైవర్‌ క్షణకాలంలో భయాందోళనకు గురై ట్రక్‌ను ఢీకొన్నాడు. ఘాట్‌ రోడ్లపై డ్రైవింగ్‌ పట్ల అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

థ్రిల్‌తో పాటు రిస్క్‌ : ఘాట్‌ రోడ్లపై డ్రైవింగ్‌ ఎవరికైనా ఓ థ్రిల్లింగ్‌ను ఇస్తుంది. కానీ అందులో ఎంత థ్రిల్‌ ఉంటుందో రిస్క్‌ కూడా అంతే ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ అప్రమత్తంగా ఉంటూ.. ఘాట్‌ రోడ్డుపై డ్రైవింగ్‌ నియమాలను పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే వాహనాలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. బ్లైండ్ కార్నర్‌లలో ఓవర్‌టేక్ చేయడం చాలా ప్రమాదకరం లేదంటే ఊహించని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

హిల్ డ్రైవింగ్ ఎవరికైనా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘాట్‌ రోడ్‌లో డ్రైవర్లు, ప్రత్యేకించి శీతాకాలంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చుట్టూ మంచు కప్పబడి ఉండటంతో ఆ మార్గాల్లో డ్రైవింగ్‌ చేయాలంటే సాహసంతో కూడుకున్న పని.. అందుకే ఆ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా సాహసోపేతమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని ఆస్వాదింవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 16, 2023, 12:54 [IST]
English summary
Car driver panics while driving on the ghat road and accident occurred
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+