చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

ఈ వీడియో చూడండి, అందరూ చూస్తుండగానే ఓ కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ అమాంతం నేలలోకి కుంగిపోయింది. ఈ సంఘటన ముంబై నగరంలో జరిగింది. ముంబైలో, ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారు క్రింద అకస్మాత్తుగా పెద్ద గుంట ఏర్పడి, క్షణాల్లో కారు అందులోకి జారిపోయింది.

చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

ఈ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీడియా కథనాల ప్రకారం, సదరు కారు పార్క్ చేసిన ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద బావి ఉండేదట. బిల్డింగ్ యజమానులు దానిని మట్టితో పూడ్చేసి, దానిపై తారు రోడ్డు వేసి, పార్కింగ్ ప్రదేశంగా మార్చారు.

చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

అయితే, గత కొన్ని రోజులుగా ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, పూడ్చి వేసిన బావిలోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో కారు పార్క్ చేసిన చోట మట్టి కుంగిపోయి, కారు కూడా క్షణాల్లోనే అందులోకి కూరుకుపోయింది. మునిగిపోయిన వెన్యూ కారు పక్కనే మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి. కానీ, వాటికి మాత్రం ఏమీ కాలేదు.

చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

ముంబైలోని గాట్కోపర్ వద్ద ఉన్న రాంనివాస్ పార్కింగ్ స్థలంలో జూన్ 13 ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పక్కనే ఓ వ్యక్తి తమ కారును తుడుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే అతను సదరు కారు యజమానికి తెలియజేశాడు. అనంతరం యజమానికి పార్కింగ్ స్థలానికి వచ్చి, తన సెల్‌ఫోన్‌లో ఈ వీడియో తీశారు.

చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

అపార్ట్‌మెంట్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం, బావిని సరిగ్గా పూడ్చలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. భారీ వర్షాల కారణం, ఆ బావిలో వేసిన మట్టి కరిగిపోయి, నీటితో నిండిపోయింది. భూమిలో కారు సుమారు 30 అడుగుల లోతుకు కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.

చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

ఈ సంఘటనపై వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బృహన్ ముంబై నగరపాలక సంస్థ సంఘటనా స్థలానికి చేరుకుని మోటార్ల సాయంతో బావిలో నీటిని బయటకు తోడేస్తున్నారు. మునిగిపోయిన కారును బయటకు తీసేందుకు భారీ క్రేన్‌ను తెప్పించారు.

కారు మంచి కండిషన్‌లో ఉందని, ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎవ్వరూ లేరు కాబట్టి ప్రాణ నష్టం తప్పిందని, ఒకవేళ ఆ సమయంలో కారులో ఎవరైనా ఉండి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిళ్లేదని సదరు వాహన యజమాని అన్నారు.

చూస్తుండగానే బుడుక్కున మునిగిపోయిన కొత్త హ్యుందాయ్ వెన్యూ కార్!

ఆరుబయట కార్లను పార్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, వర్షాకాలంలో కార్లను సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయటం చాలా ముఖ్యం. వరద ప్రభావిత ప్రాంతాలు, మురుగు నీరు చేరే చోటు, బావులు, పాత భవనాలు, శిధిలమైన గోడలు మరియు భారీ చెట్లు ఉన్న ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయటం మంచిది కాదు.

Most Read Articles

English summary
Car Drowns In Massive Sinkhole In Mumbai, Video Goes Viral. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X