కార్ ఫెయిల్ కాంపిలేషన్: ఫన్నీ కార్ ఫొటోస్
సాధారణంగా మనం ఉపయోగించే కార్లకు ఏదైనా మరమ్మత్తు అవసరమైతే, దాన్ని వెంటనే రిపేరు చేయిస్తుంటాం. కానీ కొందరు తమ వద్ద సమయం లేకనో లేకపోతే సదరు మరమ్మత్తుకు అయ్యే ఖర్చుకు సరిపడా డబ్బులు లేకనో, తామే దానిని స్వంతంగా రిపేరు చేసే ప్రయత్నం చేస్తుంటారు.
ప్రత్యేకించి కారుకు సొట్టలు పడినప్పుడు దాన్ని కవర్ చేసే ప్రయత్నం, అలాగే కారుకు స్వంత మోడిఫికేషన్లు చేసే ప్రయత్నాలు తమ వరకు బాగానే అనిపించినా చూసే వారికి మాత్రం నవ్వు పుట్టిస్తాయి. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అవుతారు. ఈ కథనంలో మనం అలాంటి కార్ ఫెయిల్ చిత్రాలను వీక్షిద్దాం రండి.
క్యాట్ కార్.. ఫిష్ కార్.. స్కల్ కార్.. బనానా కార్..

కారుపై మంచు క్లీన్ చేసుకునేంత టైమ్ లేదు బాసూ.. అందుకే ఇలానే లాగించేశా..!

ఏం నాయనా.. ఆటో బాడీని అద్దెకిచ్చి, చాస్సిస్‌ను మాత్రం నువ్వు వాడుకుంటున్నావా..? నువ్వు కూర్చున్న సీట్, డీజిల్ ట్యాంక్ సూపర్ బాసూ..

జాగ్రత్త అల్లరి పిడుగులూ.. చక్క విరిగిందో.. అందరూ పార్సిల్ అయిపోతారు..

ముందు సీట్లలో వాళ్లకి నీల్ కమల్.. వెనుక సీట్లలో కూర్చునే వారికి వినైల్ లెథర్..

యాక్సిడెంట్ జరిగింది సరే.. ఇందులో తప్పెవరదరంటారు..?

ఎస్కలేటర్ మనుషులకు మాత్రమే.. ఏం నేను వాడకూడదా..?

కారులో కంపెనీ వాళ్లిచ్చిన ఏసి పవర్ సరిపోలేదు.. అందుకే నేను స్పెషల్ విండో ఎయిర్ కండిషనింగ్ పెట్టించుకున్నా.. బాగుందా..?

కార్ ఫ్రమ్ పుత్తూర్.. అందుకేనా అన్ని కట్లు..

భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కారు ముందు సగం నీకు వచ్చిందా నాయనా..!

వాట్ ఏ మోడిఫికేషన్ గురూజీ.. మీరు ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనర్ అయి ఉంటారు..!

ఒకటి.. రెండు.. మూడు.. చాలా ఇంకేమైనా టార్చ్ లైట్లు కావాలా గురూ..

డిక్కీ కోసేశా.. ట్రంకు పెట్టి తగలించేశా..

సొట్ట పడింది.. ఆ సొట్టను కవర్ చేయటానికే ఈ ట్రిక్..

కారుకు సైలెన్సర్ బిగించావా.. లేక ఇంట్లో ఉండే పొగ చిమ్నీని కారుకు తగిలించావా..

ఏంటి నిజంగా ఎగిరేద్దామనే..

ఇటు మామూలు రోడ్లపై వెళ్లేందుకు అటు మంచు రోడ్లపై హిమాన్ని క్లీన్ చేస్తూ వెళ్లేందుకు..

శరీరం ఉంటే సరిపోదు భయ్యా.. కూసింత బ్రెయిన్ కూడా ఉండాలి..

టైం బాగోలేనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేం..

ఏం బాసూ.. నో పార్కింగ్ ప్లేస్‌లో కారును పార్క్ చేశావా.. హమ్.. ఫైన్ కట్టి, లాక్ తీయించుకో..

అసలేం చేద్దామని ఆ గోతి దగ్గరకు వెళ్లావ్ నాయనా..


Click it and Unblock the Notifications








