పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

ప్రపంచవ్యాప్తంగా ఫ్యూయల్ స్టేషన్ లలో ప్రమాదాలు జరగటం సర్వసాధారణనం. కానీ వాహనదారులు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కారులో డీజిల్ గాని పెట్రోల్ గాని ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఏమరుపాటుగా ఉండకూడదు. ఏమరుపాటుగా లేదా అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

ఇంతకుముందు ఫిల్లింగ్ స్టేషన్లలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల జరిగిన ప్రమాదాలు మనం చాలానే చూసాము. అదే విధంగా వాతావరణంలో జరిగే మార్పుల వల్ల కూడా ప్రమాదాలు జరగవచ్చు. ఇలా జరగటం వల్ల వాహనదారులు మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న చాల మంది కూడా ఈ ప్రమాదం బారిన పడతారు.

పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

ఇక్కడ ఉన్న వీడియోలో చూసినట్లైతే వాహనదారుడు వాహనాన్ని ఫిల్లింగ్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఫిల్లింగ్ చేసే వ్యక్తి వచ్చే వరకు వేచి చూస్తూ కార్ డోర్ తెరిచి ఉన్నాడు. కారులో ఇంధనాన్ని నింపే వ్యక్తితో మాటాడుతూ డ్రైవర్ కారు యొక్క ఫ్లోర్‌బోర్డుపై కాళ్ళు పెట్టుకుని ఉంటాడు. ఆ సమయంలో ఫ్యూయల్ క్యాప్ నుండి మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా వ్యాపించడం మనం వీడియోలో చూడవచ్చు.

మంటలు వ్యాపించిన వెంటనే డ్రైవర్ ప్రమాదం నుంచి బయట పడతాడు. అక్కడ ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఉన్న ఫైర్ అటెండర్ మంటలను ఆర్పే దృశ్యం మనం వీడియోలో చూడవచ్చు.

పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

సాధారణంగా వాతావరణంలో స్థిర విద్యుత్ అనేది పాజిటివ్ మరియు నెగటివ్ చార్జెస్ వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సంభవిస్తుంది. ఈ విధంగా విద్యుత్ విడుదలవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇదే కాకుండా టైర్లు మరియు రహదారుల మధ్య జరిగిన ఘర్షణ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొన్ని అరుదైన సందర్భాలలో ఫిల్లింగ్ స్టేషన్స్ లో ఈ స్థిర విద్యుత్ పుట్టి మంటలు చెలరేగుతాయి.

పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

వాహనదారుడు ఫిల్లింగ్ స్టేషన్ కి వెళ్లినప్పుడు వాహనాన్ని ఆక్కడ నిలిపి కొంత దూరంగా నిలబడాలి. ఎక్కువగా ట్రక్కులు మరియు బస్సులకు ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

సాధారణంగా వాహనదారుడు తన వాహనానికి పెట్రోల్ గాని డీజిల్ గాని ఫిల్లింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ మాటాడటం కాని, స్మోక్ చేయడం వంటివి కానీ తప్పని సరిగా నివారించాలి. ఎందుకంటే అనుకోని ప్రమాదాలు సంభవించినపుడు ప్రాణాలుకోల్పోయే ప్రమాదం ఉంది.

పెట్రోల్ బంక్ లో మీ కార్ డోర్స్ ఓపెన్ చేయకండి, చేస్తే ఏమవుతుందో (వీడియో) చూడండి

వాహనదారుడు వాహనాన్ని నిలిపి దానికి కొంత దూరంగా నిలబడాలి. ఫ్యూయల్ గొట్టం కూడా వాహనం లోపలి ఉండకుండా తాటిష్ఠంగా ఉండేట్లు చోసుకోవాలి. ఇంధనం నింపినతరువాత అక్కడి నుంచి వెళ్ళాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంధనం నింపేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోండి.

Most Read Articles

English summary
Never open your car’s door while refueling: We explain why [Video]. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X