కారు బీభత్సంతో గాల్లోకి ఎగిరిపడ్డ బైక్‌లు.. డ్యాష్‌క్యామ్‌లో యాక్సిడెంట్ విజువల్స్, చూస్తే షాక్ అవుతారు.!!
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారత్‌లోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం సహా అనేక కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాజాగా అతివేగం కారణంగా ఓ ఎస్‌యూవీ మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి మూడు బైక్‌లు భారీగా డ్యామేజీ అయ్యాయి.
బెంగళూరులో ఆదివారం(నవంబర్ 12) ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కారు అదుపుతప్పి బైక్‌లను ఢీకొట్టింది. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న కారులోని డ్యాష్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం ధాటికి బైక్‌లు గాల్లో ఎగిరిపడ్డాయి.

ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ అభిషేక్ అగర్వాల్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బెంగళూరులోని బన్నేరుఘట్ట సమీపంలోని కాలెనాలోని అగ్రహార రోడ్డులో ప్రయాణం చేస్తోంది. అయితే ఈ సమయంలో కారుకు ఎదురుగా ఓ వ్యక్తి వచ్చాడు. అయితే కారు డ్రైవర్ ఆందోళనకు గురై.. బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌పై కాలు పెట్టాడు. దీంతో కారు వేగంగా దూసుకెళ్లి ముందున్న బైక్‌లను ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోడ్లపై అనుమతించిన వేగంతోనే ప్రయాణం చేయాలి. దీంతోపాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. సీట్‌బెల్ట్‌లు ధరించాలి. ఇండికేషన్ లైట్లను సరైన సమయానికి వినియోగించాలి.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కారణంగా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దాంతో పాటు రోడ్లపై అనుమతించిన వేగాన్ని మించి ప్రయాణం చేసి ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
కార్లు సహా ఇతర వాహనాల డ్రైవింగ్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అయితే సక్రమంగా డ్రైవింగ్ చేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవుతుంటాయి. ఆ సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బ్రేక్ ఫెయిల్ అయిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అయితే బ్రేకులు ఫెయిల్ అయిన సందర్భంలో చాలా మంది డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతారు. ఫలితంగా ప్రమాదాలను నియంత్రించే అవకాశాన్ని కోల్పోతారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు లేదా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడొచ్చు.
సమీప వాహనదారులను హెచ్చరించడం: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే వెంటనే యాక్సిలరేటర్ వేగాన్ని తగ్గించాలి. ఫలితంగా వాహన వేగం తగ్గుతుంది. అనంతరం వాహనం కొంత నియంత్రణలోకి వచ్చాక.. మీ సమీపంలో ఉన్న వాహనదారులను హెచ్చరించండి. హారన్ మోగించడం, హెడ్‌లైట్ల ద్వారా హెచ్చరించవచ్చు.

క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ: వాహనాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. గేర్లను కూడా నెమ్మదిగా తగ్గించాలి. దాంతోపాటు ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించాలి. అయితే ఈ బ్రేకులు వాహనాన్ని పూర్తిగా నిలపలేకపోయినా.. వాహన వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
చివరి అవకాశం: అనంతరం వాహనాన్ని పూర్తిగా నిలిపేసేందుకు చివరి అవకాశంగా ఏదైనా తేలికపాటి వస్తువును ఢీకొట్టవచ్చు. ఫలితంగా వాహనం వేగం గణనీయంగా తగ్గి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే బ్రేకింగ్ ఫెయిల్ అయిన సమయంలో స్టీరింగ్ వీల్‌ను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాలి. వాహన వేగాన్ని నియంత్రించేందుకు ఇతర వస్తువును ఢీకొట్టడం చివరి అవకాశంగా మాత్రమే ఉపయోగించాలి.
పరిస్థితి చేయిదాటిపోయి వాహనాన్ని పూర్తిగా నిలిపి వేసేందుకు అవకాశం లేనప్పుడు, ప్రమాదం జరుగుతుందని భావించినప్పుడు.. శరీరానికి గాయాలు కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాళ్ల, చేతులు సహా ముఖానికి గాయాలు కాకుండా షీల్డ్ లాంటివి ఉపయోగించండి. ఫలితంగా ప్రమాదం జరిగినా.. శరీర భాగాలకు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడొచ్చు.
ప్రస్తుతం అన్ని కార్లలో అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ ఉంటోంది. ఫలితంగా బ్రేక్ ఫెయిల్ చాలా అరుదుగా జరుగుతుంది. అయితే బ్రేక్ ఫెయిల్ సమయంలో ఆందోళన చెందకుండా.. పైన చెప్పిన కొన్ని సూచనల ద్వారా వాహన వేగం తగ్గించడం లేదా పూర్తిగా నిలిపేసేందుకు ప్రయత్నం చేయాలి.


Click it and Unblock the Notifications








