ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 2
కార్ కస్టమైజేషన్ గురించి ఇప్పటికే అనేక కథనాల్లో చర్చించుకున్నాం. వాస్తవానికి ఇది ఇప్పటి ట్రెండ్ కాదు, ఆటోమొబైల్ ప్రపంచం ప్రారంభమైనప్పటి నుంచే ఈ ట్రెండ్‌కు మంచి ఆదరణ ఉంది. అందరి కార్ల మాదిరిగా తమ కార్లు ఉండకూడదుకునే వారు లేదా తమ అభిరుచికి తగినట్లుగా కారును మోడిఫై చేసుకోవాలనుకునే వారు కార్ కస్టమైజేషన్‌ను ఆశ్రయిస్తుంటారు.
కార్ కస్టమైజేషన్ కోసం ఇప్పుడు అనేక కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. స్ట్రీట్ మెకానిక్ నుంచి షోరూమ్ సర్వీస్ టెక్నీషియన్ వరకు తమకు నచ్చిన రీతిలో కార్లను కస్టమైజ్ చేస్తుంటారు. అయితే, కారును కస్టమైజ్ చేసినప్పుడు ఒక్కోసారి వచ్చే అవుట్‌పుట్ చాలా విచిత్రం గాను, సరదాగాను ఉంటుంది. కొందరు కావాలనే తమ కార్లను ఫన్నీగా కస్టమైజే చేస్తుంటారు.
ఈనాటి మన ఆఫ్ బీట్ అలాంటి కొన్ని కార్ కస్టమైజేషన్ ఫొటోలను పరిశీలిద్దాం రండి. ఎప్పుడూ రోటీన్ ఆటోమొబైల్ కథనాలను చదివి బోర్ కొట్టేసిన వారు సరాదా ఈ ఫొటోలను తిరగేసి ఆనందించండి.

బ్యాక్ బరస్ట్ అయ్యింది.. దాన్ని కవర్ చేసేందుకు ఇలా మోడిఫై చేశారు.

బహుశా టర్బో చార్జర్ పెట్టడానికి చోటు లేదేమో, అందుకే ఇలా తిరగేసినట్లుంది.

ముచ్చగా మూడు సైలెన్సర్లు..

సైలెన్సర్లను ఇలా కూడా అమర్చుకోవచ్చా..

హైయ్యస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇదేనా..

ఇదేంటి జీరో గ్రౌండ్ క్లియరెన్స్‌లా ఉందే.. నేలపై పాకుతూ పోతుందేమో..

ఏటి.. కార్లను ఇంత భయంకరంగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చా..

హోమ్ మేడ్ బంపర్‌లా ఉందే..

రెండు కార్లను క్రాస్ చేసి ఇలా సృష్టించినట్టున్నారు..

ఇదేంటి.. నెట్టుడి బండి టైర్లను కారుకు పెట్టినట్టున్నారే..


Click it and Unblock the Notifications








