వరల్డ్ కప్ ఫీవర్: కార్ ఫ్లాగ్స్‌తో పెరుగుతున్న ఇంధన వినియోగం
ఇప్పుడు ప్రపంచమంతా వరల్డ్ కప్ ఫీవర్ నెలకొని ఉంది. ఫిఫా 2014 ప్రపంచ ఫుట్‌బాల్ కప్‌ను సొంతం చేసుకునేందుకు పలు దేశాల సాకర్ జట్లు పోటాపోటీగా తలపడుతుంటే, అభిమానులు తమ దేశంపై ఉన్న ప్రేమను తమదైన రీతిలో చాటుకుంటున్నారు.
ఇందులో భాగంగానే, చాలా మంది ఫిఫా ప్రియులు తమ కార్లపై తమ దేశపు జెండాలను రెపరెపలాడిస్తూ, ఆయా దేశాలు విజయం సాధించి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని తమ అభిమానాన్ని చాటుతున్నాయి.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ, తాజా అధ్యయనం ప్రకారం.. అభిమానులు చూపుతున్న ఈ దేశభక్తి వలన ఇంధన వినియోగం పెరగటంతో పాటుగా సిఓ2 వ్యర్థాలు కూడా పెరుగుతున్నట్లు తేలింది. గడచిన 2006 వరల్డ్ కప్ సమయంలో, ఒక్క ఇంగ్లాండ్‌లోనే అదనంగా 1.22 మిలియన్ లీటర్ల ఇంధనం వినియోగమైంది. ఫలితంగా, అదనంగా మూడు మిలియన్ కిలోగ్రాముల సిఓ2 వ్యర్థాలు విడుదలైనట్లు తేలింది.

అంటే, ప్రతి గంటకు అదనంగా ఒక లీటరు ఇంధనం ఖర్చైందన్నమాట. కెనడియన్ ఇంజనీర్ డా. పీటర్ ఓస్టాఫిచుక్ తెలిపిన సమాచారం ప్రకారం, కారు ముందు భాగంలో అమర్చుకున్న జాతీయ జెండా రెపరెపలాడటం వలన కారు ఏరోడైనమిక్స్‌లో మార్పులు సంభవించి, అధిక ఇందన వినియోగం అవుతుంది. పెరిగిన డ్రాగ్ వలన మైలేజ్ తగ్గుతుందని ఆయన వివరించారు.
కేవలం ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలోనే కాకుండా హాకీ, క్రికెట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడల సమయంలో ఆయా దేశాల అభిమానులు తమ దేశపు జెండాలను తమ కార్లపై రెపరెపలాడిస్తూ తమ దేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకోవటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం.
Source: TreeHugger


Click it and Unblock the Notifications








