Video: ఫుల్ నిద్రలో ఉండగా ప్రమాదం.. రికార్డైన దృశ్యాలు.. కారు కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్

నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుంది. చాలా సందర్భాలలో హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లో అధిక శాతం నిద్రలో మత్తులో జరుగుతున్నవే కావడం గమనార్హం. దీనివల్ల తెలియకుండానే అవతలి వ్యక్తులతో పాటు కారులోని వారిని మృత్యువు కబళిస్తోంది. ఎటువంటి విరామం లేకుండా ఎక్కువ గంటలు డ్రైవింగ్ చేయడం తీవ్ర ఒత్తిడిని తెస్తుంది. అదే కోవాలో జరిగిన ఓ తాజా ప్రమాద దృశ్యాలు కారు డ్యాష్ బోర్డులో రికార్డైంది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హైవే హిప్నాసిస్‌ కారణంగా మెదడు స్పందించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కళ్లు తెరిచి ఉన్నా కానీ నిద్రలోకి సులభంగా జారుకుంటాం. ఇలాంటి కారు ప్రమాదాలే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఓ ప్రమాదంలో కారు బోల్తా పడినప్పటికీ యజమాని మరుసటి రోజు వచ్చి కారు పక్కనే నిలబడి ఫొటో దిగి ఆశ్చర్యపరిచాడు. అసలేం జరిగిందంటే.

ఫోర్డ్

తీవ్ర నిద్రలోకి జారుకుని కళ్లు తెరిచేలోపు..

హైవేలపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. హైవేలపై వాహనాలు అధిక వేగంతో వెళ్లడం వల్ల ప్రమాదాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాల్లో కొందరిని మృత్యువు కబళిస్తే మరికొందరు లక్కీగా ప్రమాదం నుంచి బయటపడతారు. తాజాగా హిమాచల్ లో రోపర్-మనాలి హైవేపై జరిగిన ప్రమాదం జరిగింది. ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌ బ్యాక్ కారులో హైవేపై వెళ్తుండగా అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కారు నిర్మాణ నాణ్యతను మెచ్చుకుంటూ బోల్తా పడిన వాహనంతో మరుసటి రోజు యజమాని పోజులిచ్చాడు. కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డైన దృశ్యాలను నెట్టింట్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆసక్తిని రేపుతోంది. ప్రమాదంలో కారు నేరుగా రోడ్డు పక్కకు వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో కనిపించింది.

ఫుల్ నిద్రలో ఉండగా ప్రమాదం..

యజమాని తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తుండగా వారంతా నిద్రలోకి జారుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న డొంకలోకి దూసుకెళ్లింది. వెంటనే స్థంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారు బోల్తా పడినప్పటికీ ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. 12 గంటలకు పైగా డ్రైవింగ్ చేయడంతో యజమాని తీవ్ర ఒత్తిడికి లోనవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిసింది. దీంతో ఏకాగ్రత కోల్పోయాడు.

ఫోర్ట్ ఫిగో

ఫోర్డ్ ఫిగో కారు ఏకంగా రెండు-మూడు సార్లు బోల్తా పడింది. కారులోని భాగాలు బాగా దెబ్బతిన్నాయి. కారు పైకప్పు నుజ్జునుజ్జు అయినా కానీ కారులో ఉన్న ముగ్గురు క్షేమంగా బయట పడటం విశేషం.సకాలంలో ఎయిర్‌బ్యాగ్‌ లు తెరచుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర గాయాల నుంచి బయటపడతారు. మరుసటి రోజు అలాగే పడిపోయిన ఫిగో చిత్రాన్ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రమాదం జరిగిన తీరును వివరించాడు.

సూపర్ కారుగా ఫోర్డ్ ను వర్ణిస్తూ..

ఫోర్డ్ ఫియాగోను ఓ గొప్ప కారుగా అభివర్ణించాడు. అయితే ఫోర్డ్ భారత మార్కెట్‌లో ఇప్పుడు అంతా యాక్టివ్ లేదు. ప్రస్తుతం ఎలాంటి వాహనాలను విక్రయించడం లేదు. కొన్ని సేవా కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైవే ప్రమాదాల్లో 60 శాతం హైవే హిప్నాసిస్ కారణంగానే జరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

ఫోర్డ్ ఫిగో కారు

దేశంలోని కొన్ని సరళమైన, మృదువైన రహదారులైన బరాక్‌పూర్-డాకుని మధ్య నిర్వహించిన సర్వేపై ఈ అధ్యయనం జరిగింది. ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి ఉంటుందో చెప్పలేం. కాబట్టి రెగ్యులర్ బ్రేక్ తీసుకోవడం వల్ల హైవేలపై నిద్రపోవడం లాంటివి రావు. కావున మీరు ప్రయాణం మొదలు పెట్టే ముందు అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుని బయలు దేరాలి.

More from DriveSpark

Article Published On: Thursday, March 16, 2023, 10:33 [IST]
English summary
Car owner took selfie with accident car thanking ford for high built quality
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+