మీకు తెలుసా కారు కొంటే దానిపై 58 శాతం పన్నులు కట్టాలని?.. కావున కారు కొనేముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

కారు కొనడం చాలా మందికి చిన్న నాటి కల. ఆ కల నెరవేర్చుకోవడానకి చాలా మంది ఎంతో శ్రమిస్తుంటారు. తీరా కారు కొనే సమయంలో వాటి ధరలు చూసి.. "బాబోయ్.. మాకొద్దీ కారు తంటాలు" అంటున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికిి కారణం పన్నులు. పన్నులు చేసే ఘోరాలు "ఇంతింత కాదయా" అనేలా ఉన్నాయి. ఏ వస్తువు కొన్నా సరే దానికి పన్ను కట్టడం దేశ పౌరులుగా అది అందరి బాధ్యత, అది తప్పనిసరి అంశం. అయితే.. కారు విషయానికి వచ్చేటప్పటికీ దాదాపు 58శాతం వరకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం.. చాలా మంది భారంగా ఫీలవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

పన్నులను పరిగణనలోకి తీసుకుంటే.. భారత్‌లో కారు కొనే వినియోగదారులు ఓనర్‌షిప్ కాస్ట్‌లో 58శాతం వరకు పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. వివిధ ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వినియోగదారులపై ఈ అధిక భారం పడుతోంది. కారు కొనేటప్పుడు జరిగే ప్రక్రియను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇటీవలి మీడియా కథనాల ప్రకారం భారత్‌లో కారు కొనగోలు చేయాలంటే.. దానిపై చాలా ప్రాథమిక పన్నులను చెల్లించాల్సి వస్తోంది.

Taxes on Car Owners in India

వీటన్నింటిని కలుపుకుంటే ఈ పన్ను భారం 58శాతానికి చేరుతోంది. దీంట్లో అధిక వాటా వస్తు సేవల పన్ను(GST), రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీ, ఆటో మొబైల్స్ పైన సెస్ వంటివి ఉన్నాయి. ఈ పన్నులపై పెద్ద మొత్తంలో స్లాబ్స్ ఉండడం వల్ల వాహనం కొనుగోలు ఖర్చు అధికమవుతోంది.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... జీఎస్‌టీ రేటు అనేది కారు సైజు, రకాన్ని బట్టి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు.. చిన్న కార్లపై ప్రస్తుతం 28శాతం పన్ను కొనసాగుతుండగా.. లగ్జరీ, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(SUV)పై ప్రస్తుతం 43శాతం పన్ను కొనసాగుతోంది. దీనికి అదనంగా సెస్ కూడా ఉంటుంది. తద్వారా ఈ ప్రాథమిక పన్నుల వల్ల కారు ధర భారమవుతోంది.

Taxes on Car Owners in India

జీఎస్‌టీకి అదనంగా కారు కొనుగోలుదారులు.. రిజిస్ట్రేషన్ చేసుకునే రాష్ట్రాన్ని బట్టి.. 4% నుంచి 20% వరకు వన్- టైమ్ రోడ్ ట్యాక్స్/లెవీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని పబ్లిక్ రోడ్స్ మెయింటెనెన్స్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కారు మొత్తం ధర పెరిగిపోతోంది.

అంతేగాకుండా భారతీయ రోడ్లపై కారు చట్టబద్ధంగా తిరిగేందుకు గాను కారు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కారు ధర పెరుగుతోంది. అయితే.. ఈ ఫీజు రాష్ట్రానికి రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటుంది. కానీ వినియోగదారులు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఈ భారం మోయలేక తప్పదు.

అయితే.. ఈ పన్ను భారాలు ఇక్కడితోనే ముగిసిపోతాయని అనుకోవడానికి లేదు. వినియోగదారులు కారు కొనుగోలు చేసేటప్పుడే కాదు, దాంట్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ, టోల్ ఛార్జెస్ వంటి వాటి ద్వారా ఈ పన్ను భారం మోయక తప్పట్లేదు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు ఇతర దేశాల్లో కంటే భారత్‌లోనే అధికంగా ఉన్నాయి. దీంతో భారత్‌లో ఇంధన భారం అధికంగా ఉంటోంది.

ఈ లెక్కన ఇది కారు రోజువారీ నిర్వహణ ఖర్చు పెరగనీయడమే కాదు, కారు వాడుతున్నంత కాలం కూడా ఈ పన్నులు చెల్లించాల్సిన పరిస్థితిని కనిపిస్తోంది. హైవైలు, ఎక్స్ ప్రెస్ వేలు, టోల్- బేస్డ్ సిస్టం వంటి వాటి సంఖ్య పెరగండం వల్ల.. కారు వినియోగదారులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2025, 13:53 [IST]
English summary
Car owners should pay 58 percentage taxes in india huge trouble for common people
Read more on: #auto news #cars #tax #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+