మల్టీ మిలియన్ డాలర్ వ్యాపారంగా మారిన 'కార్ పూలింగ్'
కార్ పూలింగ్ కాన్సెప్ట్ మనదేశంలో పెద్దగా ప్రాచుర్యం పొందకపోవచ్చు, కానీ విదేశాల్లో మాత్రం దీని నిర్వాహకులకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడుతోంది. యూరప్‌కు చెందిన బ్లాబ్లాకార్ (BlaBlaCar) అనే కార్ షేరింగ్ లేదా కార్ పూలింగ్ కంపెనీ ఇప్పుడు ఓ మల్టీ మిలియన్ డాల్ కంపెనీగా అవతరించింది.
కార్ పూలింగ్ అంటే మీ కారులో ప్రయాణాన్ని ఇతరులో పంచుకోవటమే. సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లటానికి ఒకే రూట్‌లో ట్రావెల్ చేస్తున్నట్లయతే, అదే రూట్‌లో ట్రావెల్ చేసే మీ స్నేహితులు లేదా మీకు తెలిసిన వ్యక్తులను మీ కారులో పికప్, డ్రాపింగ్ చేయటం ద్వారా వారి నుండి కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు.
ఇలా చేయటం వలన ఇంధన ఖర్చును అందరూ సమానంగా పంచుకున్నట్లు అవుతుంది. ఈ పద్ధతిని కార్ పూలింగ్ (కార్ షేరింగ్ కూడా అనొచ్చు) అంటారు. అలాగే దూర ప్రయాణాలకు ఒంటరిగా వెళ్లే వాళ్లు తమ ప్రయాణాన్ని మరికొంత మందితో పంచుకున్నట్లయితే, ఇంధనంపై ఖర్చు చేసే మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవటంతో పాటుగా కొత్త వారితో సంభాషిస్తూ అలసట లేకుండా ప్రయాణించవచ్చు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బ్లాబ్లాకార్ అందిస్తున్న కార్ పూలింగ్ సేవల్లో, యూజర్ అతను లేదా ఆమె స్వంత పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి. దీని వలన తెలియని వ్యక్తులతో ప్రయాణం చేసే రిస్క్ తగ్గుతుంది. భవిష్యత్ ట్రిప్‌ల కోసం బ్లాబ్లాకార్ యూజర్ల నుంచి రేటింగ్‌ను స్వీకరిస్తుంది.

ప్యాసింజర్లు మరియు డ్రైవర్లు ఈ సేవల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా డ్రైవర్ మరియు ప్యాసింజర్ మధ్య ప్రయాణం ఫిక్స్ అయినప్పుడు, సదరు ప్రయాణానికి అయ్యే ఖర్చును ఇరువురు సమానంగా పంచుకోవటం జరుగుతుంది.

మనదేశంలో, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి మహా నగరాల్లో ఇప్పటికే 'కార్ పూలింగ్' సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసులను అందించేందుకు ఇప్పటికే పలు వెబ్‌సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మీ కారులో మీతో పాటు అదే రూట్లో ప్రయాణించే వారికోసం వ్యక్తులను వెతుక్కోవాల్సిన అసరం లేకుండానే, ఈ వెబ్‌సైట్లలో మీ వాహనాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీ రూట్లో ప్రయాణించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మీతో పాటుగా కారును షేర్ చేసుకొని ప్రయాణించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో రైడ్‌మేట్స్ (ridemates.org), మిల్‌కేచలో (milkechalo.com) వంటి వెబ్‌సైట్లు కార్ పూలింగ్ సేవలను అందిస్తున్నాయి.

కార్ పూలింగ్ వలన ఇంధన ఖర్చును తోటి ప్రయాణికులతో పంచుకొని మీ నెలవారీ ఇంధన బడ్జెట్‌లో కాస్తంత మిగులు పొందటమే కాకుండా, పర్యావరణానికి కూడా మీరు, మీతోటి వారు మేలు చేసిన వారు అవుతారు.


Click it and Unblock the Notifications








