కార్లను పోలిన కార్లను తయారు చేసే కంపెనీలు!

By Ravi

మన కన్నా వృద్ధిలో ఉన్న వారిని మనం అధిగమించలేకపోతే, వారిని అనుసరించడమే ఉత్తమమైన మార్గం. ఈ సిద్ధాంతాన్నే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తూ.చ. తప్పకుండా పాటిస్తుంటాయి. ఉదాహరణకు ఓ చిన్న కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ కార్ కంపెనీని అధిగమించలేమని తెలిసినప్పుడు, ఆ ప్రయత్నాలను మానుకొని బిఎమ్‌డబ్ల్యూ కంపెనీని అనుసరిస్తుంటాయన్నమాట.

అదెలాగంటే.. ప్రస్తుత రోజుల్లో అనేక కార్ కంపనీలు అచ్చం ఇతర బ్రాండ్ కార్లను పోలినట్లుండే కార్లను తయారు చేస్తున్నాయి. ఇలా చేయటంలో చైనా నెంబర్ వన్ అని చెప్పొచ్చు. ఏ వస్తువుకైనా నకిలీ వస్తువును తయారు చేయటంలో చైనా ది గ్రేట్ అన్నా అతిశయోక్తి లేదు. ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో ఇలాంటి కాపీక్యాట్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

కార్లను పోలిన కార్లు

తదుపరి స్లైడ్‌లలో కాపీ క్యాట్ కార్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

కార్లను పోలిన కార్లు

గీలే పండా వర్సెస్...

కార్లను పోలిన కార్లు

మారుతి సుజుకి ఏ-స్టార్/సుజుకిఆల్టో

గీలే పండా చైనాలో అమ్ముడవుతున్న బెస్ట్ స్మాల్ కార్. ఇది చూడటానికి మనదేశంలోను అలాగే విదేశాల్లోను అమ్ముడుపోతున్న మారుతి సుజుకి ఏ-స్టార్ (కొన్ని దేశాల్లో ఇది సుజుకి ఆల్టో పేరుతో అమ్ముడవుతోంది) కారులా అనిపిస్తుంది. గీలే పండా, మారుతి ఏ-స్టార్ కార్లను రెండింటినీ పక్కపక్కనే ఉంచి చూస్తే, ఇవి రెండు ఇంచుమించు ఒకేలా అనిపిస్తాయి.

కార్లను పోలిన కార్లు

డాంగ్‌ఫెంగ్ ఈక్యూ 2050 వెర్సస్...

కార్లను పోలిన కార్లు

హమ్మర్ హెచ్1

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది పాపులర్ ఒరిజినల్ అమెరికన్ హమ్మర్ హెచ్1 ఎస్‌యూవీ. దీనికి ముందు ఫొటోలో మీరు చూసినది హమ్మర్ హెచ్1కు కాపీ క్యాట్ వెర్షన్ అయిన డాంగ్‌ఫెంగ్ ఈక్యూ 2050 ఎస్‌యూవీ. ఈ డాంగ్‌ఫెంగ్ ఈక్యూ 2050 ఎస్‌యూనీ కూడా చైనా కంపెనీనే తయారు చేసింది. ఈ రెండింటిన పక్కపక్కనే ఉంచి చూస్తే, చిన్నపాటి కాస్మోటిక్ మార్పుల మినహా ఇవి రెండూ ఒకేలా కనిపిస్తాయి.

కార్లను పోలిన కార్లు

గ్రేట్ వాల్ ఫ్లోరిడ్ వెర్సస్...

కార్లను పోలిన కార్లు

టొయోటా ఫస్ట్

ఫన్నీ పేరే, కానీ అంత మంచి ఫన్నీ కాపీ కాదు. చైనాకు చెందిన గ్రేట్ వాల్ కంపెనీ జపాన్‌కు చెందిన టొయోటా అందిస్తున్న టొయోటా ఫస్ట్‌ను మోడల్‌ను యధావిధిగా కాపీ ఎలా కాపీ కొట్టేసిందో చూడండి. ఈ రెండు వానాహల వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఇవి ఇంచు మించు ఒకేలా అనిపిస్తాయి. గ్రేట్ వాల్ కంపెనీ ఇదొక్కటే కాదు, ఇలాంటి ఎన్నో పాపులర్ మోడళ్లను కాపీ కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి.

కార్లను పోలిన కార్లు

టెంపో ట్రాక్స్ జూడో వర్సెస్...

కార్లను పోలిన కార్లు

మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్

చైనా కంపెనీలు కేవలం చిన్న కార్ బ్రాండ్లనే కాదు మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ బ్రాండ్లను కూడా ఇట్టే కాపీ కొట్టేస్తాయి. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ ఎస్‌యూవీని, ఇదివరకటి ఫొటోలోని టెంపో ట్రాక్స్ జూడో ఎస్‌‌యూవీని చూడండి. ఫ్రంట్ డిజైన్‌లో చిన్న చిన్న మార్పుల మినహా ఈ రెండింటి బేసిక్ డిజైన్ ఒకేలా కనిపిస్తుంది కదూ..!

కార్లను పోలిన కార్లు

లిఫాన్ 320 వర్సెస్...

కార్లను పోలిన కార్లు

మినీ కూపర్

లిఫాన్ 320 కారును తయారు చేసింది కూడా ఓ చైనా కంపెనీయే. బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం కార్ బ్రాండ్ మినీ అందిస్తున్న మినీ కూపర్ మోడల్ డిజైన్‌ను అచ్చుగుద్దినట్లు ఎలా కాపీ కొట్టారో చూడండి. టూ-టోన్ పెయింట్ జాబ్, మినీ ఇన్‌స్పైర్డ్ గ్రిల్ వంటి ఎన్నో సిమిలారిటీలను ఈ రెండు కార్లలో గమనించవచ్చు.

కార్లను పోలిన కార్లు

అర్రీనెరా ఆటోమోటివ్ హుస్సారయా వెర్సస్...

కార్లను పోలిన కార్లు

లాంబోర్గినీ రెవంటన్

కార్ డిజైన్ కాపీ విషయంలో కేవలం చైనా కంపెనీలే కాదు, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు కేవలం లగ్జరీ కార్లతో సరిపెట్టుకోవటం లేదు. లాంబోర్గినీ వంటి సూపర్ కార్లను సైతం ఇవి ఇమిటేట్ చేసిన దాఖలాలున్నాయి. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న లాంబోర్గినీ రెవంటన్ మోడల్‌ను ఇదివరకటి ఫొటోలోని హుస్సారయా మోడల్‌ను చూడండి. ఈ రెండు డిజైన్‌లు చూడటానికి ఒకేలా అనిపిస్తున్నాయి కదూ..! హుస్సారయా మోడల్‌ను తయారు చేసింది పాలిష్ కంపెనీ అర్రీనెరా ఆటోమోటివ్.

కార్లను పోలిన కార్లు

షువాంగ్‌హువాన్ సీఈఓ వర్సెస్...

కార్లను పోలిన కార్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

చైనాకు చెందిన షువాంగ్‌హువాన్ కంపెనీ జర్మన్ డిజైన్ కార్లను కూడా కాపీ కొట్టేసింది. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారుని, ఇది వరకటి ఫొటోలోని షువాంగ్‌హువాన్ సీఈఓ కారును చూడండి, ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా? ఈ రెండు డిజైన్లలో చిన్న చిన్న కాస్మోటిక్ మార్పుల మినహా సైడ్ ప్రొఫైల్స్ మరియు రియర్ ప్రొఫైల్స్ పూర్తిగా ఒకేలా ఉన్నాయి కదా..!

కార్లను పోలిన కార్లు

హాటై బోలిగర్ వర్సెస్...

కార్లను పోలిన కార్లు

పోర్షే కయూన్

ఇదివరకటి ఫొటోలోని హాటై బోలిగర్‌ను ఈ ఫొటోలోని పోర్షే కయూన్ కార్లను గమనించండం. ఈ రెండింటి బేసిక్ డిజైన్ ఒకేలా అనిపిస్తుంటుంది. హాటై బోలిగర్ బెంట్లీ ఈఎక్స్‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్ స్టైల్ మాదిరిగా పెద్ద క్రోమ్ గ్రిల్‌ను కలిగి ఉండి సైడ్ మరియు రియర్ ప్రొఫైల్స్‌లు పోర్షే కయూన్ మాదిరిగా ఉంటాయి.

కార్లను పోలిన కార్లు

బిఏడబ్ల్యూ బి90 వెర్సస్...

కార్లను పోలిన కార్లు

రేంజ్ రోవర్

చైనాకి చెందిన బిఏడబ్ల్యూ (బిఎమ్‌డబ్ల్యూ కాదు) అనే ఆటోమొబైల్ కంపెనీ బ్రిటన్‌కు చెందిన ల్యాండ రోవర్ కంపెనీ అందిస్తున్న రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీని ఎలా కాపీ కొట్టిందో చూడండి. అచ్చం రేంజ్ రోవర్ ఒరిజినల్ డిజైన్‌ను పోలి ఉండేలా తయారు చేసిన బిఏడబ్ల్యూ బి90 ఎస్‌యూవీని చూస్తే ఎవ్వరైనా షాక్‌కు గురికాక తప్పదు.

కార్లను పోలిన కార్లు

గీలే జిఈ వెర్సస్...

కార్లను పోలిన కార్లు

రోల్స్ రాయిస్ ఫాంటమ్

చైనా కంపెనీలు రోల్స్ రాయిస్ బ్రాండ్‌ను కూడా వదళ్లేదు. ఇదివరకటి ఫొటోలో మీరు చూసినది గీలే జిఈ, ఈ ఫొటోలో మీరు చూస్తున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఈ రెండింటినీ పక్కపక్కనే ఉంచితే, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది పోల్చుకోవటం కష్టం.

కార్లను పోలిన కార్లు

మస్టాంగ్ ఎఫ్16 వర్సెస్...

కార్లను పోలిన కార్లు

ఆడి ఏ4 అవాంట్

డౌటే లేదు, ఇది కూడా చైనా బ్రాండే. ఈ ఫొటోలో మీరు చూస్తున్నది ఒరిజినల్ ఆడి ఏ4 అవాంట్, ఇదివరకటి ఫొటోలో మీరు చూసిన చైనా కంపెనీ తయారు చేసిన మస్టాంగ్ ఎఫ్16. ఈ రెండు మోడళ్లలో చిన్న మార్పులు మినహా బేసిక్ డిజైన్‌లో మీకేదైనా వ్యత్యాసం కనిపిస్తుందా..?

కార్లను పోలిన కార్లు

టాటా సఫారీ వర్సెస్...

కార్లను పోలిన కార్లు

1997 ల్యాండ్ రోవర్ డిస్కవర్

ఈ రెండు ఫొటోలోను కొంచెం నిశితంగా పరిశీలిస్తే, వీటిల్లో అనేక సిమిలారిటీలు కనిపిస్తున్నాయి కదా..! ల్యాండ్ రోవర్ డిస్కవరీ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది టాటా సఫారీని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది కదూ..! ప్రత్యేకించి ఈ రెండు మోడళ్ల సైడ్ ప్రొఫైల్స్, డోర్ డిజైన్, రూఫ్ లైన్స్ వంటి కొన్ని సిమిలారిటీలను ఇందులో చూడొచ్చు.

కార్లను పోలిన కార్లు

బివైడి ఎఫ్8 వర్సెస్...

కార్లను పోలిన కార్లు

మెర్సిడెస్ బెంజ్ సిఎల్‌కె

కాపీ క్యాట్‌ల దెబ్బకు మెర్సిడెస్ బెంజ్ కూడా బలయ్యింది. ఇదివరకటి ఫొటోలోని చైనాకు చెందిన బివైడి కంపెనీ అందిస్తున్న ఎఫ్8 మోడల్‌ను మరియు ఈ ఫొటోలో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న సిఎల్‌కె మోడల్‌ను చూడండి. అనేక సిమిలారిటీలు కనిపిస్తున్నాయి కదా.

కార్లను పోలిన కార్లు

షువాంగ్‌హువాన్ నోబెల్ వర్సెస్...

కార్లను పోలిన కార్లు

స్మార్ట్ ఫర్‌టూ

మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ స్మార్ట్ అందిస్తున్న స్మార్ట్ ఫర్‌టూ మోడల్‌కు జెరాక్స్ కాపీలా ఉన్న షువాంగ్‌హువాన్ మోడల్‌ను చూడండి. ఇవి రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి కదా..!

కార్లను పోలిన కార్లు

చైనా డిజైనర్లు తమ పనిని సులువు చేసుకునేందు ఇలా ఇదివరకే తయారైన కార్ల డిజైన్‌ను కాపీ కొడతారో లేక కాపీరైట్ నిబంధనలు తమనేం చేస్తాయిలే అనుకుంటారో తెలియదు కానీ, ఆ దేశంలో ఏ వస్తువుకైనా నకలు వస్తువు ఇట్టే దొరకుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 30, 2014, 9:10 [IST]
English summary
If you can't beat them, join them. This seems to be the mantra for so many things these days, and car design is not to be left out. Several cars in the world today are blatant rip offs of other automobiles - China is known to do this best, with a long list of copycat cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+