కారు రూఫ్‌ కెపాసిటీని మీరెప్పుడైనా పరిశీలించారా.?? అదేంటి అనుకుంటున్నారా.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలుసుకోండి

దేశంలో దాదాపుగా టూ వీలర్లతో సమానంగా కార్ల వినియోగం పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, ఫ్యామిలీ ప్రాధాన్యత పరంగా చాలా మంది తమ బడ్జెట్‌ ధరలో కారు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే యజమానులు కారును కూడా తమ కుటుంబంలో ఒకటిగా భావిస్తారు. అయితే ఇక్కడ మీ కారులో మీరు గమనించని ఓ ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాం..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటో మొబైల్‌ రంగంలో విస్తృమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక ఫీచర్లు, అధునాతన టెక్నాలజీ, సరికొత్త డిజైన్‌, అధిక భద్రతా ఫీచర్లు, ఇలా ఎన్నో మార్పులు కార్లలో వస్తున్నాయి. ఇంకా ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో కూడా కార్‌ మేకర్లు తమ ఉనికిని ప్రదర్శిస్తున్నాయి. ఇలా ఎన్ని మార్పులు వచ్చినా.. కారు డిజైన్‌ రూపుదిద్దుకునే విధానం మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

Car-Roof-Less-Strong

కారులో మనకు కనిపించే డిజైన్‌లోని ఒక్కో అంశం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. భద్రత, ఇంకా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుని కారును నిర్మిస్తారు. అందులో ముఖ్యమైనది కారు రూఫ్‌.. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా.?? కారు పై కప్పు(Car Roof Less Weight).. దాని ఫ్లోర్‌తో పోలిస్తే అంత బలంగా ఉండదు అని.. అందుకు కారణాలేంటో తెలుసా.??

కారు ఫ్లోర్‌తో పోలిస్తే.. రూఫ్‌(Car Roof) బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఫ్లోర్‌పై మనం ఎంత బలం పెట్టినా వంగదు. కానీ రూఫ్‌ మాత్రం వంగుతుంది. ఇది మీరు గమనించే ఉంటారు.. కానీ అందుకు గల కారణాలను ఆలోచించి ఉండరు. కారు ఫ్లోర్‌ను మెటల్‌ షీట్లతో తయారుచేస్తారు.

Car-Roof-Less-Strong

కానీ కారు రూఫ్‌ను అలా మెటల్‌ షీట్లతో తయారుచేయరు. అలా చేస్తే వాహనం బరువు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. దీని ద్వారా కారు ఫ్యూయెల్‌ కెపాసిటీ, పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. బలమైన పైకప్పును తయారు చేయడానికి ఎక్కువ మెటీరియల్‌ అవసరం అవుతుంది. దీని ద్వారా కారు ధర పెరుగుతుంది.

భారత్‌లో కార్లను తయారుచేసేటప్పుడు కారు తయారీలో నాణ్యతతో పాటు ఖర్చును కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఇంకా పైకప్పును తక్కువ బరువు ఉండేలా తయారుచేయడం ద్వారా.. కారులో అధిక బరువుతో ప్రయాణించేటప్పుడు డ్రైవర్‌కు ఇబ్బందులు ఏర్పడవు. ఎంతటి బరువునైనా సులభంగా లాగగలుగుతుంది. దీని ద్వారా కారు స్టెబిలిటీ కూడా మెరుగవుతుంది.

అయితే ఇక్కడ కారు పైకప్పు బరువు తక్కువగా ఉన్నంత మాత్రాన అది బలహీనంగా ఉంటూ భద్రతలో రాజీపడుతుందని అర్థం కాదు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కారు రూఫ్‌ను తక్కువ బరువుతో తయారుచేస్తారు. ఇందుకోసం లైట్ మెటీరియల్ (లైట్ షీట్) ను ఉపయోగిస్తారు.

దీని ద్వారా ఏదైనా ప్రమాదంలో ఇతర వాహనాలు ఢీకొట్టినా.. లేదంటే బోల్తా పడినా.. కారు రూఫ్‌ ఆ శక్తిని తట్టుకొని నిలబడగలదు. తద్వారా కారులోని ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండేలా రూఫ్‌ కాపాడుతుంది. ఈ కారణాల ద్వారా కారు రూఫ్‌ను తక్కువ బరువుతో భద్రత ఎక్కువ ఉండేలా రూపొందిస్తారు.

అందుకే కస్టమర్లు ఏదైనా కారును కొనుగోలు చేసేటప్పుడు, దాని భద్రత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కారు భద్రత అనేది నేరుగా మీ భద్రతకు సంబంధించినదని గమనించాలి. మీరు కారును కొనుగోలు చేసేటప్పుడు, మీరు దాని భద్రతా లక్షణాలను తనిఖీ చేయాలి. ఇందుకోసం గ్లోబల్ NCAP లేదా భారత్‌ NCAP ద్వారా ఆ కార్ల సేఫ్టీ రేటింగ్‌ను తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 28, 2024, 16:05 [IST]
English summary
Car roof is not as strong as floor here are the interesting facts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+