కళ్లు చెదిరే కారవాన్‌ .. తయారు చేసినోడి అడ్రస్‌ పెట్టు అంటున్న నెటిజన్లు

ప్రతీ సెలబ్రిటీ, పొలిటీషియన్స్‌, ఇతర ప్రముఖ వ్యాపార వేత్తలు కారవాన్లను (Caravan) విరివిగా వినియోగిస్తున్నారు. ఒకానొక సమయంలో సినీ తారలు, కేవలం ధనవంతులు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. కానీ నేడు వీటి వినియోగం పెరిగిపోయింది. ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లోనూ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కారవాన్లు తక్కువ ధర వద్ద అద్దెకు కూడా లభిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా మిని బస్సులు, వ్యాన్లను కారవాన్లుగా మారుస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక ఫీచర్లను జోడిస్తూ వీటిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 5 స్టార్ హోటల్స్‌కి దీటుగా కారవాన్లు ఉండటంతో చాలామంది కారవాన్‌లోనే సుదూర ప్రయాణం సాగిస్తున్నారు. తాజాగా సరికొత్తగా డిజైన్‌ చేయబడిన కారవాన్‌ వివరాలు మీకోసం..

ఈ కారవాన్ లోపల ఒక పడకగది, బాత్‌రూమ్‌ మరియు వంటగది కోసం తగినన్ని ఏర్పాట్లు ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక కదిలే ఇల్లు అనవచ్చు. అందుకే కారవాన్లు ఇతర సాధారణ వాహనాల కంటే భిన్నంగా కనిపిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో కారవాన్లను కూడా భారీగా అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా ఫైవ్ స్టార్ హోటల్ గదిని తలపించే కారవాన్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

Caravan-Design-Gone-Viral

నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ వీడియోను లోపల నుంచి చూస్తే ఒక లగ్జరీ ఇల్లు అనే ఫీలింగ్‌ వస్తుంది. దీని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగానే వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంబులెన్స్ వ్యాన్ లాంటి చిన్న వ్యాన్‌లో ఎన్నో సౌకర్యాలు ఉండటం గమనించవచ్చు. అన్ని గదులన్నీ పక్కపక్కనే ఉంటాయి. కానీ వాటిని భిన్నంగా డిజైన్ చేశారు. దీని ఇంటీరియర్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ఈ వాహనం లోపల 3 బెడ్లు, బాత్‌రూమ్‌, రిఫ్రిజిరేటర్ కూడా ఉన్నాయి. వాహనం పైకప్పు కింద ఒక పడకగదిని కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా కారవాన్లలో కూర్చోవడానికి మంచం బేస్‌మెంట్‌ చాలా కీలకం. పడకగది నుంచి పైకప్పు మీద చిన్న టెర్రస్‌ని గమనించవచ్చు. ఈ ప్రదేశంలో ఇద్దరు కూర్చోవచ్చు. ఇందుకోసం మంచాన్ని ఏర్పాటు చేశారు. పగటిపూట సన్ బాత్ చేయడానికి కూడా ఈ ప్రాంతం అనువైనదిగా ఉంది.

Caravan-Design-Gone-Viral

వాహనం నుంచి పైకప్పు వరకు మెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్ల అతి ముఖ్యమైన ఫీచర్‌ ఏంటంటే మెట్ల కోసం స్థలాన్ని వృథా చేయకుండా దాని కింద వస్తువులను ఉంచడానికి ఒక పెట్టె కూడా ఉంది. వాహనం లోపల 4 సీట్లు ఉన్నాయి. కానీ, ఈ కారవాన్ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే సరిపోతుంది. అంటే ఈ వాహనాన్ని సుదూర ప్రయాణాలకు తీసుకెళ్తే కేవలం ముగ్గురికి మాత్రమే సౌలభ్యంగా ఉంటుంది.

ఈ కారవాన్‌ని పోర్చుగల్‌లో రూపొందించారు. తక్కువ ఖర్చులో ఇలాంటి కారవాన్లను తయారు చేయడం సవాల్‌ అనే చెప్పాలి. డిజైనర్లు దీన్ని సింపుల్‌గా నిర్మించారు. కావాల్సినంత స్పేస్‌ని వినియోగించి అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ కారవాన్‌ని ఎలా రూపొందించారని కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిని రూపొందించిన వ్యక్తి 'అడ్రస్‌ పెట్టు' అంటూ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు దీని వెనక అంతర్యం తెలుసని వ్యగ్యంగా కామెంట్స్‌ చేశారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 2, 2024, 16:35 [IST]
English summary
Caravan design look like 5 star hotel the video of this specially designed vehicle hits internet
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+