కార్‌పూలింగ్‌పై రవాణా శాఖ సీరియస్.. ఇకపై అలా చేస్తే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే.!!

కార్లలో ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలు అని రెండు రకాలుంటాయి. ప్యాసింజర్ వాహనాలు కేవలం కుటుంబ అవసరాల కోసం మాత్రమే. అయితే వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసిన వాహనాలను కమర్షియల్ కార్లగా ఉపయోగించాలి. ఉదాహరణకు ట్యాక్సీలు. అయితే కొందరు తమ ప్రైవేట్ వాహనాలను సైతం ట్యాక్సీలుగా ఉపయోగిస్తున్నారు. ఉదహరణకు కార్‌పూలింగ్ యాప్‌లు(Carpooling apps).

బెంగళూరు(Bengaluru) మహానగరంలో ఈ యాప్స్ ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఎక్కువ మంది కలిసి ఒకే కారులో ఆఫీసుకు లేదా ఇతర ప్రదేశాలకు వెళ్లడాన్ని కార్‌పూలింగ్ అంటారు. అయితే వాణిజ్య అవసరాల కోసం నమోదు చేసుకున్న వాణిజ్య వాహనాలను మాత్రమే దీని కోసం ఉపయోగించాలి.

Carpooling-Is-Illegal

ఎవరైనా సరే వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన ప్రైవేట్ వాహనాలను ఉపయోగించకూడదు. కానీ చాలా మంది ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. దానికి ఇప్పుడు బెంగళూరు రవాణా శాఖ(Bengaluru Transport Department) చెక్ పెట్టింది. అదేంటి.. ఏంటా ఉత్తర్వులు అనేది ఈ కథనంలో చదవండి.

బెంగళూరు నగర రవాణా శాఖ ప్రైవేట్ వాహనాలను కమర్షియల్ వాహనంగా ఉపయోగించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ వాహనాలను వాణిజ్యపరంగా ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘించి ప్రైవేట్ వాహనాలను వాణిజ్యపరంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ ప్రకటించింది.

Carpooling-Is-Illegal

ఇకపై ప్రైవేట్ వాహనాలను కమర్షియల్ పరంగా ఉపయోగిస్తే సంబంధిత వాహన యజమానికి రూ. 10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. లేదా వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు. ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో బెంగళూరు రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే తమ ప్రైవేట్ వాహనాలను ట్యాక్సీలుగా, అంటే వాణిజ్య వాహనాలుగా నమోదు చేసుకోవచ్చని రవాణా శాఖ తెలిపింది. దీని ద్వారా కార్‌పూలింగ్ చేయడానికి ఏ ఇబ్బంది ఉండదని తెలిపింది. ట్యాక్సీగా అనుమతి పొందిన తర్వాతే ప్రైవేట్ వాహనాలను ట్యాక్సీలుగా ఉపయోగించుకోవచ్చని కూడా ప్రకటించింది.

Carpooling-Is-Illegal

అయితే రవాణా శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులను ప్రజలు స్వాగతించలేదు. కార్‌పూలింగ్ యాప్‌లు తమ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని వారు చెబుతున్నారు. అలాగే, బెంగుళూరులో నివసించే చాలా మంది ప్రజల అభిప్రాయం కూడా ఇదే. ట్రాఫిక్‌కు కేరాఫ్‌గా ఉన్న బెంగళూరులో ట్రాఫిక్ జామ్ సమస్య నుండి తప్పించుకోవడానికి కార్ పూలింగ్ ఎంతో దోహదపడుతుందని పేర్కొంటున్నారు.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడ బెంగళూరు రవాణా శాఖ కార్‌పూలింగ్‌(Carpooling is illegal)కు వ్యతిరేకం కాదు. కార్‌పూలింగ్‌ యాప్స్‌లో నమోదు చేసుకున్న ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వ్యతిరేకం. యజమానులు కార్‌పూలింగ్ యాప్ ద్వారా తమ కార్లను నడపాలనుకుంటే వాటిని కమర్షియల్ వెహికల్స్‌గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ బెంగళూరు నగరవాసులు రవాణా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల కార్‌పూలింగ్ యాప్ ద్వారా తాము తక్కువ ఖర్చులో ఆఫీసులకు వెళ్లగలుగుతున్నామని పేర్కొంటున్నారు. అయితే ప్రైవేట్ కంపెనీలు మాత్రమే కాకుండా కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఈ కార్‌పూలింగ్ యాప్స్‌ను సమర్థిస్తున్నాయి.

బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు 2 కి.మీ దూరాన్ని కవర్ చేయడానికి 1 గంట కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం బెంగళూరు నగరంలో 1.10 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దాదాపు 74 లక్షల టూ వీలర్లు ఉన్నాయి.

కార్ల సంఖ్య దాదాపు 24 లక్షలు. ఇంకా మిగిలినవి ఇతర వాహనాలుగా నమోదయ్యాయి. దీంతో బెంగళూరులో నిరంతరం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అందుకే బెంగళూరు నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి తప్పించుకునేందుకు కార్ పూలింగ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే బెంగళూరు రవాణా శాఖ అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారో వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Friday, September 29, 2023, 22:30 [IST]
English summary
Carpooling is illegal if violates rs 10000 challan imposed all you need to know full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+