Cars Breakdown: ఎక్స్‌ప్రెస్‌వేపై వరుసగా కార్లు బ్రేక్ డౌన్.. కారణాలేంటి.. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.?
భారత్‌లో పండుగ సీజన్, సెలవులు వచ్చాయంటే చాలు హడావుడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సెలవు రోజుల్లో పర్యాటక ప్రాంతాలకు జనం పోటెత్తుతారు. అయితే ఇలాంటి సందర్భంలో కార్లలో సమస్య ఎదురైతే.. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇక్కడ నడిరోడ్డుపై ఒకటి కాదు ఏకంగా వరుస పెట్టి వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి.
దేశంలో క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చాలా హడావుడి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక ప్రాం తాలకు జనం పోటెత్తుతున్నారు. ఈ సెలవులను, న్యూ ఇయర్‌ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఎక్కువగా మనాలి, సిమ్లాకు తరలివెళ్తున్నారు. తాజాగా మనాలిలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే..

కాగా క్రిస్మస్ పండుగ ముగియడంతో ప్రజలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రధాన పట్టణాలకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. హాలిడే సీజన్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయిన రోడ్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ వైరల్ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది.
దేశంలోనే బెంగళూరు, ఢిల్లీ తర్వాత మరో రద్దీ నగరం ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వే రహదారి(Cars Break Down On Mumbai- Pune Expressway)పై తీసిన ఈ వీడియోలో, ఒకే చోట చాలా కార్లు బ్రేక్ అవడాన్ని మనం చూడవచ్చు. ఈ కార్ల బానెట్లన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. అయితే ఒకే చోట ఇన్ని కార్లు ఎందుకు చెడిపోయాయి.??

అయితే, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు.. ముంబయి- పూణే ఎక్స్‌ప్రెస్ వే పశ్చిమ కనుమల(Western Ghats) గుండా వెళుతుంది. కాబట్టి కొన్ని చోట్ల రోడ్లు నిటారుగా ఉంటాయి. అలాంటి చోట వాహనాలు స్లోగా వెళ్లడం వల్ల క్లచ్ సహా విడిభాగాల వినియోగం పెరిగిపోయి, వేడెక్కుతాయి. ఈ కారణంగా బ్రేక్ డౌన్ అయి ఉండవచ్చని తెలుస్తోంది.

ఇలాంటి సమయాల్లో ఇలా జరగకుండా ఉండాలంటే.. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కొన్ని విషయాలను వాహనదారులు, డ్రైవర్లు గుర్తుంచుకోవాలి. ముందుగా మీ కారు బ్యాటరీలను చెక్ చేసుకోండి. అవసరమైతే వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఇంకా ఎయిర్ ఫిల్టర్లను కూడా తనిఖీ చేసుకోవడం ఉత్తమం. మురికి గాలి ఉన్న ఫిల్టర్‌లను మార్చడం ద్వారా, మీ కారు ఇంజిన్‌కు స్వచ్ఛమైన గాలి చేరేలా చూసుకోవాలి. ఇది మీ కారు మైలేజ్‌తో పాటు పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మీకు మార్గమధ్యలో సమస్యలు తలెత్తవు.

బయటకు వెళ్లటప్పుడు బ్రేక్‌లను తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. బాగా పనిచేసే బ్రేక్‌లు మాత్రమే మీకు భద్రతను ఇస్తాయి. కాబట్టి ఈ విషయంలో రాజీ పడకూడదు. ఇవన్నీ కాకుండా విడి టైర్లకు తగినంత గాలి ఉందా? అవి మంచి స్థితిలో ఉన్నాయా.?? అనేది కూడా చూసుకోవాలి.
వీటితో పాటు ఇంజిన్ ఆయిల్ లెవల్స్‌ని చెక్ చేసుకోవడం చాలా మంచి అలవాటు. మీరు హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ చిట్కాలు మీకు దోహదపడతాయి. లేదంటే మీరు మార్గమధ్యలో అనవసరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రేక్‌డౌన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు దగ్గర్లో సర్వీస్ సెంటర్ లేకపోతే కష్టపడాల్సి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








