ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్ వంటి పోటీ మార్కెట్లో, ఏదైనా కారు విజయం సాధించాలంటే, దాని డిజైన్ మరియు ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉండాలి. ఆటోమేకర్‌లు కూడా ప్రత్యేకంగా అన్ని విభాగాల కోసం వాహనాల డిజైన్‌కు కొత్త అంశాలను తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

అయితే, ఈ విషయంలో కొన్నిసార్లు సృజనాత్మకత వెనుకబడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, కార్ కంపెనీలు తయారు చేసే కొన్ని వాహనాలు ఇతర కార్ల డిజైన్లతో పోలికలను కలిగి ఉంటాయి, నిజానికి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. మనదేశంలో టెయిల్ ల్యాంప్స్ డిజైన్ లో ఇంచు మించు ఒకేలా కనిపించే కొన్ని కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

1. Maruti Ertiga మరియు Honda CR-V

రెండు వేర్వేరు OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) నుండి రెండు బహుళ ప్రయోజన వాహనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి టెయిల్ ల్యాంప్స్ డిజైన్ మాత్రం ఇంచు మించు ఒకేలా ఉంటుంది. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడయ్యే ఎమ్‌పివి ఎర్టిగా మరియు జపనీస్ కార్ బ్రాండ్ హోండా యొక్క ప్రీమియం ఎస్‌యూవీ సిఆర్-వి లు ఇంచు మించు ఒకే రకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ ను కలిగి ఉంటాయి.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ ఎమ్‌పివిగా ఉంటే, హోండా మాత్రం తమ పాపులర్ సిఆర్-వి ఎస్‌యూవీని భారత మార్కెట్లో విక్రయించడం నిలిపివేసింది. ఈ రెండు వాహనాలకు వాటి స్వంత ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నప్పటికీ, టెయిల్ లైట్ డిజైన్ విషయానికి వస్తే, ఇవి రెండూ ఒకదానికొకటి ప్రేరణ పొందినట్లుగా, దాదాపు ఒకేలా కనిపిస్తాయి.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

2. Ford Figo మరియు Tata Tiago

ఫోర్డ్ ఫిగో మరియు టాటా టియాగో రెండూ కూడా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లే. అయితే, వీటిలో ఫోర్డ్ ఫిగో ఇప్పుడు భారత మార్కెట్‌లో నిలిపివేయబడింది. కాగా, టాటా మోటార్స్ యొక్క సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో వచ్చిన టియాగో మాత్రం ఈ సెగ్మెంట్లో అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. పూర్తిగా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని స్వీకరించిన టాటా టియాగో, కంపెనీ యొక్క ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో కస్టమర్లను ఆకర్షిస్తోంది.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

టాటా మోటార్స్ తమ టియాగో డిజైన్‌లో చాలానే కృషి చేసినప్పటికీ, దాని టెయిల్ ల్యాంప్స్‌ డిజైన్ విషయంలో కంపెనీ కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఫోర్డ్ ఫిగో మరియు టాటా టియాగో కార్లను వెనుక వైపు నుండి చూస్తే, వాటి టెయిల్ ల్యాంప్స్ డిజైన్ ఇంచు మించు ఒకేలా కనిపిస్తుంది. ఈ విషయంలో టాటా మోటార్స్ సృజనాత్మకత లేకుండా, ఫిగో నుండి స్పూర్తి పొందినట్లుగా అనిపిస్తుంది.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

3. Maruti Ciaz మరియు Honda City Gen 4

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న C-సెగ్మెంట్ సెడాన్‌ల జాబితాలో మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటీ జెన్-4 రెండు మోడళ్లు కూడా అనేక పర్యాయాలు అమ్మకాల జాబితాలో అగ్రస్థానాల్లో నిలిచాయి. ఇవి రెండూ కూడా ఈ విభాగంలో చాలా విశిష్టమైన మోడళ్లు మరియు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్న కార్లు.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటీ కార్లు వాటి వాటి ప్రత్యేకతలను కలిగి ఉండి, రెండూ కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, వెనుక టెయిల్ ల్యాంప్‌ల విషయానికి వస్తే మాత్రం, ఇవి రెండూ ఇంచు మించు ఒకే స్టైల్‌లో కనిపిస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది దేని నుండి ప్రేరణ పొందిందో తెలియాలి.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

4. Datsun Go మరియు Maruti Swift

ఈ రెండిలో ఒకటి నిస్సాన్ కు చెందిన చవక కార్ బ్రాండ్ డాట్సన్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయితే 'గో' అయితే, మరొకటి భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి 'స్విఫ్ట్'. వీటి ఓవరాల్, డిజైన్, పెర్ఫార్మెన్స్ మరియు ఫీచర్ల వంటి అంశాల్లో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, వాటి టెయిల్ ల్యాంప్స్ డిజైన్ మాత్రం ఇంచు మించు ఒకేలా అనిపిస్తుంది.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రెండు కంపెనీలు కూడా జపాన్‌కు చెందినవే. కాబట్టి, ఇవి రెండూ ఒకే విధమైన డిజైన్ లేఅవుట్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తాయి. ఇవి రెండూ వాటి పూర్వీకుల నుండి ఉద్భవించినట్లుగా ఉంటాయి.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

5. Maruti WagonR మరియు Volvo XC60

ఇక చివరిగా, మారుతి సుజుకి అందిస్తున్న లేటెస్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్ మరియు స్వీడన్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో అందిస్తున్న ఎక్స్‌సి60 మోడళ్లు కూడా ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్ డిజైన్ ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తాయి. అయితే, వోల్వో టెయిల్ ల్యాంప్స్ స్ప్లిట్ డిజైన్ మరియు ఎల్ఈడి లైట్స్ ను కలిగి ఉంటుంది.

ఇంచు మించు ఒకేరకమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కలిగిన కార్లు

కాగా, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ హాలోజెన్ బల్బులతో కూడిన టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తుంటే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్, వోల్వో ఎక్స్‌సి60 మోడల్ నుండి స్పూర్తి పొంది రూపొందించినట్లుగా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Cars in india with similar tail lamps design details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X