భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

సాధారణంగా మనం ఎప్పుడూ సినీ తారల కార్లు, ప్రముఖ పొలిటికల్ లీడర్స్ కార్లు మరియు పారిశ్రామిక వేత్తల కార్లను గురించి ఇది వరకు చాల కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బుల్లితెర (టీవీ స్టార్స్) నటులు ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

ఆర్తి సింగ్ (Arti Singh):

ఆర్తీ శర్మ అని పిలువబడే 'ఆర్తి సింగ్' ప్రముఖ ఇండియన్ టీవీ యాక్టర్. 'తోడా హై బాస్ తోడా కి జరూర్ హై', 'పరిచయ్' మరియు 'వారిస్' వంటి టీవీ షోలలో పపౌలర్ అవ్వడమే కాకూండా, 2019 బిగ్ బాస్ 13 లో కంటెస్టెంట్‌గా పాల్గొని నాలుగో రన్నరప్‌గా నిలిచి, అందరికి సుపరిచయం అయిపోయింది. అయితే ఈమె 'మహీంద్రా' (Mahindra) కంపెనీ యొక్క 'థార్' (Thar) SUV ని కలిగి ఉంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

ఆర్తి సింగ్ కొనుగోలు చేసిన మహీంద్రా థార్ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ఉంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. మహీంద్రా థార్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లను పొందుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

అష్నూర్ కౌర్ (Ashnoor Kaur):

2009 లోనే సిరీస్ ఝాన్సీ కి రాణిలో ప్రాచీ పాత్రలో తన కెరీర్‌ను ప్రారంభించిన 'అష్నూర్ కౌర్' (Ashnoor Kaur) సంజు మరియు మన్మర్జియాన్‌లలో సహాయ పాత్రలతో బాలీవుడ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈమె వద్ద జర్మన్ బ్రాండ్ అయిన 'బిఎండబ్ల్యు ఎక్స్3' (BMW X3) ఉంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

అష్నూర్ కౌర్ కొనుగోలు చేసిన బిఎండబ్ల్యు ఎక్స్3 ధర రూ. 61.90 లక్షల నుంచి రూ. 67.90 లక్షల మధ్య ఉంది. ఈ సెడాన్ 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్‌ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 252 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఈ లగ్జరీ కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

అవ్నీత్ కౌర్ (Avneet Kaur):

అవ్‌నీత్ కౌర్ భారతదేశానికి చెందిన మోడల్ మాత్రమే కాదు, డాన్సర్ మరియు సినీ యాక్టర్ కూడా. ఈమె మొదటి 2014 లో విడుదలైన 'మర్దానీ' సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా టీవీ షోస్ మరియు ఇతర టీవీ సిరీస్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

అవ్నీత్ కౌర్ ఉపయోగించే లగ్జరీ కారు విషయానికి వస్తే, ఈమె 'రేంజ్ రోవర్ వెలార్' (Range Rover Velar) కలిగి ఉంది. దీని ధర రూ. 87 లక్షలు. ఈ ఫ్రీమియం ఎస్‌యూవీ ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, క్యాబిన్ ఎయిర్ అయనైజేషన్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin):

హిందీ టీవీ షోల ద్వారా పాపులర్ అయిన జాస్మిన్ భాసిన్ 2011 లో తమిళ మూవీతో సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. అంతే కాకుండా ఖత్రోన్ కే ఖిలాడీ 9 మరియు బిగ్ బాస్ 14 వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

జాస్మిన్ భాసిన్ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ అయిన 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes-Benz) యొక్క 'జిఎల్‌సి' (GLC) కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ కారు ధర రూ. 61.99 లక్షల నుండి రూ.67.99 లక్షల వరకు ఉంది. ఈమె కొనుగోలు చేసిన 'జిఎల్‌సి' చూడటానికి చాలా ఆకర్షణీయమైన బ్లూ కలర్ లో ఉంది. బెంజ్ జిఎల్‌సి తో పాటు ఈము ఆడి క్యూ7 మరియు హోండా సిటీ వంటి కార్లను కూడా కలిగి ఉంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

కరణ్ కుంద్రా (Karan Kundrra):

కరణ్ కుంద్రా 'కితాని మొహబ్బత్ హై' లో అర్జున్ పంజ్ మరియు 'దిల్ హీ తో హై' లో రిత్విక్ నూన్ పాత్ర పోషించి బాగా ఫెమస్ అయ్యాడు. అంతే కాకుండా బిగ్ బాస్ 15 రియాలిటీ షోలో పాల్గొని మూడవ స్థానంలో నిలిచాడు.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

కరణ్ కుంద్రా ఇప్పుడు 'జీప్ రాంగ్లర్ రూబికాన్' (Jeep Wrangler Rubicon) కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 60.35 లక్షలు. ఇది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 268 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

'జీప్ రాంగ్లర్ రూబికాన్' (Jeep Wrangler Rubicon) హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెదర్ అప్హోల్స్టరీ, యాంబియంట్ LED లైటింగ్, 7-ఇంచెస్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, 8.4-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆల్పైన్ ఆడియో 9-స్పీకర్ సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కరణ్ కుంద్రా దీనితో పాటు రేంజ్ రోవర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మినీ కూపర్ వంటివి కూడా ఉన్నాయి.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

కృష్ణ అభిషేక్ (Krushna Abhishek):

కృష్ణ అభిషేక్ ప్రముఖ హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ మరియు నిర్మాత. యితడు అనేక కామెడీ సర్కస్ సీజన్లలో పాల్గొన్న గొప్ప కమేడియన్ గా పేరుగాంచాడు. ఆ తరువాత కాలంలో అనేక డ్యాన్స్ రియాలిటీ షోలలో కూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నాడు.

కృష్ణ అభిషేక్ కార్ల విషయానికి వస్తే, ఇటీవల యితడు 'మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఈ' (Mercedes-Benz GLE) కొనుగోలు చేసాడు. దీని ప్రారంభ ధర రూ. 85.80 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర సుమారు రూ. 1.25 కోట్ల వరకు ఉంది. జర్మన్ బ్రాండ్ అయిన మెర్సిడెస్-బెంజ్ GLE మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

రాకేష్ బాపట్ (Raqesh Bapat):

రాకేష్ బాపట్ భారతీయ నటుడు మాత్రమే కాదు మోడల్ కూడా. ఇతడు 2017 లో టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ మహారాష్ట్రలో పదహారవ స్థానంలో నిలిచాడు.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

రాకేష్ బాపట్ 2022 ఫిబ్రవరిలో ఆడి కంపెనీ యొక్క క్యూ7 కొనుగోలు చేశాడు. ఈ SUV ధర రూ. 82.49 లక్షల నుండి రూ. 90 లక్షల మధ్య ఉంటుంది. ఇది ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ సెవెన్-సీటర్ లగ్జరీ కారులో ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సన్‌రూఫ్ మరియు 19-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

రూపాలీ గంగూలీ (Rupali Ganguly):

అనీల్ గంగూలీ కుమార్తె రూపాలీ గంగూలీ చిన్నతనంలోనే తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తన ఏడేళ్ల ప్రాయంలోనే తన తండ్రి నటించిన సాహెబ్ చిత్రంలో మొదటిసారి కనిపించింది. ఆ తరువాత కాలంలో మరింత పాపులర్ నటిగా తన ప్రస్థానం సాగించింది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

రూపాలీ గంగూలీ మహీంద్రా యొక్క థార్ SUV ని కలిగి ఉంది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఆఫ్ రోడర్ కి రూపాలీ గంగూలీ అభిమానురాలే. ఈ కారణంగానే ఈమె మహీంద్రా థార్ కొనుగోలు చేసింది. మహీంద్రా థార్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లను పొందుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

తేజస్వి ప్రకాష్ (Tejasswi Prakash):

2021 ఆమె బిగ్ బాస్ 15 వ సీజన్‌లో విజేతగా నిలిచిన తేజస్వి ప్రకాష్ ఆడి క్యూ7 కారుని కలిగి ఉంది. దీని ధర రూ.82.49 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ఉంది. ఎక్కువమంది సెలబ్రెటీలు కొనుగోలు చేసిన ఆడి బ్రాండ్స్ లో క్యూ7 ఒకటి. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, మంచి పనితీరుని అందిస్తుంది.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

ఉర్ఫీ జావేద్ (Urfi Javed):

అసాధారణమై డ్రెస్సింగ్ తో కుర్రకారును ఉర్రూతలూగించే ఉర్ఫీ జావేద్ (Urfi Javed) గురించి దాదాపు చాలామందికి తెలుసు. అయితే ఈమె 'జీప్ కంపాస్' ఆధునిక SUV కలిగి ఉందని చాలామందికి తెలిసి ఉండదు.

భారతదేశంలోని టాప్ 10 టీవీ స్టార్స్ ఉపయోగించే ఆధునిక కార్లు: వివరాలు

ఉర్ఫీ జావేద్ గ్యారేజిలో జీప్ కంపాస్ ఉంది. దీని ధర రూ.18.04 లక్షల నుంచి రూ.29.59 లక్షల మధ్య ఉంది. జీప్ కంపాస్ ఎక్కువమంది ఇష్టపడే కార్లలో ఒకటి. ఇది 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో చాలా అద్భుతంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 30, 2022, 10:53 [IST]
English summary
Cars of tv celebrities from mahindra thar to jeep compass details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+