లగ్జరీ కార్లతో పబ్లిక్ రోడ్లపై కార్ రేసింగ్.. పోలీసులకు ఎలా చిక్కారంటే!!

పబ్లిక్‌ రోడ్లపై వాహనాలతో విన్యాసం చేయడం చట్టపరంగా నేరం. ఇది తెలిసినా చాలా మంది ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పబ్లిక్ రోడ్లపై రేసింగ్‌ చేయడం, అత్యుత్సాహం ప్రదర్శించడం ఎప్పుడూ చాలా ప్రమాదకరం. కానీ ఇక్కడ తమ లగ్జరీ కార్ల సత్తాను ప్రదర్శించేందుకు పబ్లిక్‌ రహదారులను ఎంచుకున్నారు కొందరు వ్యక్తులు..

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా వారికే కాదు తోటి వాహనదారులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పబ్లిక్‌ రహదారిపై లగ్జరీ కార్లతో రేసింగ్‌ చేశారు ఆరుగురు వ్యక్తులు.. అందులో ఐదుగురు వ్యాపారవేత్తలే కావడం గమనార్హం. పూర్తి కథనం చదవండి.

Car-Racing-On-Roads

హైదరాబాద్‌ మహానగరంలో పబ్లిక్‌ రోడ్డుపై ఓ ఆరుగురు తమ సూపర్ లగ్జరీ కార్లు లంబోర్గినీ మరియు ఫెరారీలతో సహా మరో నాలుగు కార్లలో రేసింగ్‌ చేశారు. ఆ ఆరుగురిలో ఐదుగురు వ్యాపారవేత్తలు మరియు ఒక డ్రైవర్‌ ఉన్నారు. ఈ ఆరుగురిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేట్ సమీపంలోని మూవీ టవర్స్ రోడ్డులో జూలై 14న ఈ ఘటన జరిగింది. గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రేసింగ్‌కు పాల్పడిన వారి వాహనాలను కూడా సీజ్ చేసి స్థానిక కోర్టుకు పోలీసులు అప్పగించారు. రేసింగ్‌కు ఉపయోగించిన కార్ల జాబితాలో లంబోర్గినీ, ఫెరారీ, ఆడి, మెర్సిడెస్‌ బెంజ్‌ మరియు రెండు ఇన్నోవాలు ఉన్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. రెండు వాహనాలు నిందితులకు చెందినవి కాగా మరొకటి కంపెనీ పేరు మీద రిజిస్టర్‌ చేయబడి ఉందని వెల్లడించారు. మిగిలిన మూడు కార్ల వివరాలు సేకరిస్తున్నారు.

మెర్సిడెస్‌ బెంజ్‌ వేగాన్ని పరీక్షించేందుకే వారు పబ్లిక్‌ రోడ్డుపై ఈ రేసింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు . కారు రేసింగ్ గురించి తమకు సమాచారం అందించిందని మధుసూదన్ చెప్పారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా, వారిని వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు.

ఆరుగురు వ్యక్తులు పబ్లిక్‌ రోడ్డుపై ర్యాష్ మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని ఆయన పేర్కొన్నారు. నిందితులందరూ నగరవాసులు అయినప్పటికీ, లంబోర్గినీ, మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్‌ చేశారని, ఆడి కారు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్‌ అయిందని తెలిపారు. ఈ కార్లు అవుట్‌స్టేషన్ రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉండటంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడమని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి ఉదాహరణగా సిటీ రోడ్లపై జరిగిన పలు ప్రమాదాల వీడియోలను సైతం సైబరాబాద్‌ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఇంకా రోడ్లు డ్రైవింగ్‌ చేయడానికి, ట్రాక్‌లపై రేస్‌ చేయడానికి అనే విషయం గుర్తుంచుకుని వాహనదారులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 22, 2023, 11:05 [IST]
English summary
Case booked on six members for racing with luxury cars on hyderabad roads
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+