రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం.. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.. అమల్లోకి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్!
భారతీయ రోడ్లపై నిత్యం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా హిట్ అండ్ రన్ కేసులు ఉంటున్నాయి. అయితే బాధితులకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితులను హాస్పిటల్‌లో చేర్చించినా వైద్యం చేసేందుకు లీగల్ ప్రొసీడింగ్స్ కావాలని అడుగుతున్నారు. అయితే ఆపదలో ఉన్న వారిని కచ్చితంగా వైద్యం అందించాలనే నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా బాధితుల వైద్యం కోసం అయ్యే ఖర్చుకి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌కి లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ఎవరైనా యాక్సిడెంట్స్ వల్ల గాయాలు లేదా ఇతర ఇబ్బందులకు గురైతే ఆ బాధితులకు ఉచిత వైద్యం అందించేలా పైలట్ పథకాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని త్వరలోనే భారతదేశం అంతటా అమలు చేయాలని కోరతున్నారు. ప్రస్తుతం కేవలం చండీఘఢ్, అసోంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం పైలట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రయోగాత్మకంగా తీసుకుందని ఆయన చెప్పారు.

దీంతో భారతదేశం అంతటా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు ఏ రోడ్డుపైనైనా ప్రమాదం జరిగితే వెంటనే ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ABPM (ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన) అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రూ.1.5 లక్షల వరకు వైద్యానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఇందుకోసం రోడ్డు ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోగా చికిత్స పొందాల్సి ఉంటుంది. నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. మోటార్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి నిధుల విడుదలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2022 లో సవరించిన మోటారు ప్రమాద నిధి నిబంధనల ప్రకారం వైద్య చికిత్స పొందే వ్యక్తులు ఎంత డబ్బును పొందవచ్చనే వివరాలను స్పష్టంగా పేర్కొంది.

ఆ విధంగా ప్రమాద బాధితుల చికిత్సకు నిధులు సమకూరుస్తారు. ఈ పథకం కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ మరియు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ పథకానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు ప్రతి రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్స్ అమలుపై సమన్వయం చేయనున్నాయి.
ఈ పథకం ప్రకారం ఎవరైనా రోడ్డుపై ప్రమాదానికి గురైతే ఈ పథకం కింద వైద్యం పొందవచ్చు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రమాదాల్లో చిక్కుకున్న చాలా మంది సకాలంలో వైద్యం అందక, డబ్బుల్లేక చనిపోయే ప్రమాదం ఉంది. వారి కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పేదలకు, హిట్ అండ్ రన్ కేసుల్లో సీరియస్‌గా ఉండే వారికి ఈ పథకం మేలు చేయనుంది.

ప్రస్తుతం ఈ పథకం ట్రయల్ దశలో ఉందని.. ఇది విజయవంతం అయితే దేశంలోని మిగతా రాష్ట్రాలకు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చొరవ తీసుకోవడం అభినందనీయం. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








