కొత్త బైక్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు సిద్ధమవుతున్న క్యాస్ట్రాల్ రాకెట్ స్ట్రీమ్‌లైనర్

ప్రస్తుతం మోటార్‌సైకిల్ ల్యాండ్ స్పీడ్ రికార్డును రాకీ రాబిన్‌సన్ కలిగి ఉన్నాడు. 2010లో ఆక్ అటాక్ స్ట్రీమ్‌లైనర్‌పై రాబిన్‌సన్ గంటకు గరష్టంగా 605.364 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ రికార్డును సృష్టించాడు. కాగా.. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు చేసేందుకు మరొక కొత్త స్ట్రీమ్‌లైనర్ సిద్ధమైంది. గంటకు 400 మైళ్ల కన్నా (643.738 కి.మీ.) ఎక్కువ వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ రికార్డు కోసం ఉపయోగించనున్న మోటార్‌సైకిల్ పేరు క్యాస్ట్రాల్ రాకెట్ స్ట్రీమ్‌లైనర్, దీనిని జాన్సన్ డిసాల్వో రైడ్ చేయనున్నాడు. ఈ రాకెట్ మోటార్‌సైకిల్ పొడవు 35 అడుగులు, వెడల్పు 2 అడుగులు, ఎత్తు 3 అడుగులు. ఇది చూడటానికి రాకెట్ మాదిరిగానే ఉంటుంది. అందుకే దీనికి రాకెట్ పేరును పెట్టారు. హాట్ రాడ్ కాన్సిపిరసీ అండ్ కార్పెంటర్ రేసింగ్ సహకారాలతో ఈ రాకెట్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు.

Castrol Rocket Streamliner

ఈ రాకెట్ మోటార్‌సైకిల్‌కు ప్రధాన స్పాన్సర్లు క్యాస్ట్రాల్, ట్రైయంప్. ఈ రాకెట్ డివిజన్ సి స్ట్రీమ్‌లైన్డ్ టైప్ 5, స్పార్క్ ఇగ్నిషన్. 2000సీసీ నుంచి 3000సీసీ క్లాస్‌కు ఎగువన పాల్గొనబోతుంది. ఈ స్ట్రీమ్‌లైనర్ రెండు మోడిఫై చేయబడిన ట్రైయంప్ రాకెట్ 3 మోటార్‌సైకిల్ ఇంజన్లతో నడుస్తుంది. ప్రతి ఇంజన్ సామర్థ్యం 2295 సీసీ. అయితే వీటిని ట్యూన్ 1485సీసీకి తగ్గించి రెండింటి మొత్తం సామర్థ్యాన్ని 2970సీసీకి కుదించారు. ఇంజన్ సామర్థ్యాన్ని 3000సీసీ కన్నా తక్కువగా ఉండేలా ట్యూన్ చేశారు. మరి ఈ రాకెట్ మోటార్‌సైకిల్ వీడియోను క్రింద వీక్షించండి.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/qt7GQx1Uibo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, September 3, 2013, 17:24 [IST]
English summary
The land speed record for motorcycles is currently held by Rocky Robinson. The top speed achieved was 605.364 km/h with a Ack Attack streamliner back in 2010. A new streamliner is now getting ready to challenge it by trying to reach a top speed exceeding 400 mph or 643.738 km/h.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+