మహిళా దినోత్సవం కానుకగా మీకు ఇష్టమైన వారికి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా.. అయితే 85వేలలో ఈ స్కూటర్లు బెస్ట్

ప్రతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Womens Day) మార్చి 8న జరుపుకుంటారు. వివిధ రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించడం, ఆయా రంగాల్లో వారి కృషిని అభినందించడంతో పాటు, లింగ సమానత్వం పై ప్రజల్లో అవగాహన తీసుకురావడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. ఈ ప్రత్యేకమైన రోజు వారికి గుర్తుండి పోయే విధంగా చేసేందుకు అమ్మ, చెల్లి, భార్య ఇలా ఇష్టమైన వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న వారు ఎలక్ట్రిక్ స్కూటర్ కొని ఇస్తే వారి ఆనందానికి హద్దులుండవు.

ఉద్యోగాలకు, కాలేజీలు, ఇతరత్రా అవసరాలకు స్కూటర్లు వినియోగించే మహిళల సంఖ్య పెరుగుతోంది. వారికోసమే కొన్ని ప్రత్యేక మోడల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. 'ఉమెన్స్‌ డే' నాడు వాటిలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుని కొనిస్తే సర్ ప్రైజ్ గిఫ్ట్ అవుతుంది. హోండా యాక్టివా 110, టీవీఎస్ జూపిటర్ 110, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ ఎన్‌టార్క్, హీరో జూమ్ 125 మోడళ్లలో ఏదో ఒకటి కొని బహుమతిగా ఇవ్వవచ్చు.

Honda Activa

హోండా యాక్టివా 110: ఈ స్కూటర్ ధర రూ.80,950(ఎక్స్-షోరూమ్). 109.51సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అందుబాటులో ఉంది. ఇది లీటరుకు 59.5కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.ఇది డీసెంట్ బ్లూ మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ఈ హోండా యాక్టివా 110 స్కూటర్ టీఎఫ్‎టీ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్ , బ్యాక్ సింగిల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్ అమర్చారు. రైడర్ సేఫ్టీ దృష్ట్యా దీనికి డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు.

Honda Activa Scooter

టీవీఎస్ జూపిటర్ 110: ఈ స్కూటర్ ధర రూ.78,391 నుంచి రూ.92,366(ఎక్స్ షోరూం)మధ్య ఉంటుంది. ఇది 113.3 సిసి, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ OBD-2B ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది లీటరుకు 53కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా పలు ఫీచర్లు ఉన్నాయి.

TVS Jupior

సుజుకి యాక్సెస్ 125: ఈ స్కూటర్ ధర రూ.81,700 (ఎక్స్-షోరూమ్). ఇందులో 125సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది లీటరుకు 45 కి.మీ.మైలేజీని అందిస్తుంది. దీనికి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. రైడర్ సేఫ్టీ కోసం దీనికి డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు.

Suzuki Motor

టీవీఎస్ ఎన్‌టార్క్: ఈ స్కూటర్ ధర రూ.93,126 నుంచి రూ.1.09 (ఎక్స్ షోరూం)లక్షల మధ్య ఉంటుంది. ఇది 124.8 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ లీటరుకు 47కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది.దీనిలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు మరిన్నీ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ బ్రేక్‌లు ఆప్షనల్‌గా అందుబాటులో ఉంది.

Herp Xoom

హీరో జూమ్ 125: దీని ధర రూ.86,900(ఎక్స్-షోరూమ్). ఇది 124.6 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 45 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతుంది. ఇది LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. రైడర్ సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

Article Published On: Saturday, March 8, 2025, 15:37 [IST]
English summary
Celebrate international womens day with a perfect gift top 5 scooters under 85 000 for your loved
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+