ఆటో ఎక్స్‌పో 2014లో సందడి చేసిన సెలబ్రిటీలు

By Ravi

గ్రేటర్ నోయిడా: ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే భారత ఆటోమొబైల్ ఫెస్టివల్ 'ఆటో ఎక్స్‌పో' ఫిబ్రవరి 5, 2014వ తేదిన ప్రారంభమైన సంగతి తెలిసినదే. ప్రస్తుతం జరుగుతున్నది 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పో. గతంలో కన్నా ఈసారి బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది తారలు ఆటో ఎక్స్‌పో 2014లో సందడి చేశారు.

మీడియా డేస్ అయిన ఫిబ్రవరి 5, 6 తేదీలలో వివిధ కంపెనీల ద్వారా ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు ఇక్కడికి విచ్చేశారు. ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో దాదాపు 70కి పైగా కొత్త కార్లను, 26 కొత్త కార్లకు వరల్డ్ ప్రీమియర్ నిర్వహించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్ద జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పో రేపటితో (ఫిబ్రవరి 11, 2014)తో ముగియనుంది.

మరి ఈ ఆటో ఎక్స్‌పోలో హల్ చల్ చేసిన ఆ సెలబ్రిటీలెవరో ఈ కథనంలో చూద్దాం రండి..!

ఇలియానా

ఇలియానా

ఆడి ఏ3 సెడాన్ ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటి ఇలియాన్ డిక్రూజ్ మరియు మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రి.

జాన్ అబ్రహామ్

జాన్ అబ్రహామ్

యమహా స్పోర్ట్స్ బైక్ ఆవిష్కరణలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్.

జాన్ అబ్రహామ్

జాన్ అబ్రహామ్

కస్టమైజ్డ్ యమహా రే స్కూటర్‌పై ఫొటోలకు ఫోజిలిస్తున్న బాలీవుడ్ హీరో జాన్ అబ్రహామ్.

కరీనా కపూర్

కరీనా కపూర్

ప్రముఖ ఆటోమొబైల్ కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్స్ అభివృద్ధి చేసిన డిసి ఎలెరాన్ ఎస్‌యూవీ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్. చిత్రంలో డిసి డిజైన్స్ అధినేత దిలీప్ ఛాబ్రియాను కూడా చూడొచ్చు.

కరీనా కపూర్

కరీనా కపూర్

ప్రముఖ ఆటోమొబైల్ కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్స్ అభివృద్ధి చేసిన డిసి టియా స్మాల్ కార్ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్. చిత్రంలో డిసి డిజైన్స్ అధినేత దిలీప్ ఛాబ్రియాను కూడా చూడొచ్చు.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ తయారు చేసిన లాంగ్ వీల్ బేస్ 'రేంజ్ రోవర్ ఎల్' వేరియంట్‌ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

ల్యాండ్ రోవర్ తయారు చేసిన లాంగ్ వీల్ బేస్ 'రేంజ్ రోవర్ ఎల్' వేరియంట్‌తో ఫొటోలకు ఫోజిలిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

పవర్‍‌ఫుల్ హీరో మోటోకార్ప్ స్కూటర్లను ఆవిష్కరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్. చిత్రంలో హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజాల్‌ను చూడొచ్చు.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

హీరో మోటోకార్ప్ స్టాల్‌లో సందడి చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్. చిత్రంలో హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజాల్‌ను చూడొచ్చు.

 సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

బిఎమ్‌డబ్ల్యూ స్టాల్‌లో కంపెనీ అభివృద్ధి చేసిన ఐ8 హైబ్రిడ్ కారును ఆవిష్కరిస్తున్న భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్.

 సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారుతో సచిన్ టెండూల్కర్. చిత్రంలో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సార్‌ను చూడొచ్చు.

సమీరా రెడ్డి

సమీరా రెడ్డి

వర్డెంచి మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటీమణి సమీరా రెడ్డి.

సమీరా రెడ్డి

సమీరా రెడ్డి

వర్డెంచి మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరిస్తున్న సమీరా రెడ్డి. చిత్రంలో సమీరా రెడ్డి భర్త అకాషి వర్డెను చూడొచ్చు.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

హోండా మోటార్‌సైకిల్స్ స్టాల్‌లో సందడి చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.

More from DriveSpark

Article Published On: Monday, February 10, 2014, 10:50 [IST]
English summary
Several celebrities like Ranbir Kapoor, Priyanka Chopra, Sameera Reddy, Ileana Dcruze, Ravi Shasthri, Akshay Kumar, John Abraham and Sachin Tendulkar were spotted at the Auto Expo 2014. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+