Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు: మీకు తెలుసా..!!

సాధారణంగా చాలామందికి బైకులు మారియు కార్లు అంటే చాలా ఇష్టం. అయితే ఈ విషయంలో సెలబ్రెటీలు ముందు ఉంటారు. కావున చాలామంది సెలబ్రెటీలు లగ్జరీ బైకులు మరియు విలాసవంతమైన కార్లు కలిగి ఉంటారు.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటి (Ducati) శక్తివంతమైన సూపర్‌బైక్‌లకు ప్రసిద్ధి చెందింది. కంపెనీ తన బైకులను ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు అందిస్తూనే ఉంది. ఈ కారణంగా ఎంతోమంది ఈ డుకాటి సూపర్‌బైక్‌లను కలిగి ఉన్నారు. భారతేదేశంలోని చాలామంది సెలబ్రెటీలు కూడా ఈ బైకులను కలిగి ఉన్నారు.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో భారతదేశంలోని సెలబ్రెటీలు కలిగి ఉన్న డుకాటి బైక్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. రండి.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

షాహిద్ కపూర్:

బాలీవుడ్ చిత్ర సీమలో ప్రసిద్ధి చెందిన షాహిద్ కపూర్ 2019లో డుకాటి స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ ఎడిషన్‌ కొనుగోలు చేసారు. ఈ బైక్ ను కంపెనీ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందిస్తుంది. అవి స్క్రాంబ్లర్ 1100, స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ మరియు స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ వేరియంట్స్.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

2019 లో షాహిద్ కపూర్ తన స్క్రాంబ్లర్ 1100 స్పెషల్‌ ఎడిషన్‌ బైకును రూ. 11.12 లక్షలతో కొనుగోలు చేశారు. స్క్రాంబ్లర్ 1100 బైక్ 1,079 సిసి లిక్విడ్-కూల్డ్, ఎల్-ట్విన్ ఇంజన్‌తో 85 బిహెచ్‌పి పవర్‌ మరియు 88 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ బైక్ యాక్టివ్, జర్నీ మరియు సిటీ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

సంజయ్ దత్:

సంజయ్ దత్ విలాసవంతమైన కార్లు మరియు బైకులను కలిగి ఉన్నారు. యితడు హార్లే డేవిడ్సన్ బైక్ వంటి లగ్జరీ బైక్ కూడా కలిగి ఉన్నాడు. సంజయ్ దత్ డుకాటీ మల్టీస్ట్రాడా 1200 బైక్ కలిగి ఉన్నాడు. ఈ బైక్ 1200 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 157.8 బిహెచ్‌పి పవ మరియు 136 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

కునాల్ ఖేము:

కునాల్ ఖేముకు కి కూడా సూపర్ బైక్‌లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇతడు కొంతకాలం క్రితం డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్‌ని కొనుగోలు చేశాడు. ఈ స్క్రాంబ్లర్ బైక్‌లో ఎల్-ట్విన్ 803 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది 73 బిహెచ్‌పి పవర్ మరియు 67 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

వివేక్ ఒబెరాయ్:

డుకాటి బైకులు కలిగి ఉన్న సెలబ్రెటీలలో ఒకరు 'వివేక్ ఒబెరాయ్‌'. ఇతడు డుకాటి 1098 కలిగి ఉన్నారు. దీనిని ఇతడు గత సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారతదేశంలో డుకాటి 1098 ధర రూ.8 లక్షలు. ఇది మాత్రమే కాకుండా వివేక్ ఒబెరాయ్ హార్లీ-డేవిడ్‌సన్ బైక్ కూడా కలిగి ఉన్నారు.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

నీల్ నితిన్ ముఖేష్:

నీల్ నితిన్ ముఖేష్ కూడా డుకాటి బైక్‌ల అభిమాని. కావున ఇతడు 2011లో డుకాటీ బ్రాండ్ యొక్క డుకాటీ 848 బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈ బైక్ లిక్విడ్ కూల్డ్ ఎల్-ట్విన్ 849.4 సిసి ఇంజన్‌తో వస్తుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది అద్భుతమైన ప్[పనితీరుని అందిస్తుంది.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

అర్షద్ వార్సి:

లగ్జరీ బైకులను మరియు కార్లను ఎక్కువగా ఇష్టపడే సెలబ్రెటీల జాబితాలో అర్షద్ వార్సి ఒకరు. ఈ కారణంగా ఇతడు డుకాటి మాన్‌స్టర్ 797 బైక్ కొనుగోలు చేశారు. ఈ డుకాటి మాన్‌స్టర్ 797 బైక్ ఎల్-ట్విన్ 803 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 74 బిహెచ్‌పి పవర్ మరియు 67 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

సూర్య:

ప్రముఖ దక్షిణ భారత సినీ నటుడు అయిన సూర్య అత్యంత ప్రసిద్ధి చెందిన నటుడు. సింగం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సూర్య ఆటో మొబైల్ ప్రేమికుడు కూడా. ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉన్న వారి సూర్య కూడా ఒకరు.

Ducati బైక్స్ కలిగి ఉన్న సెలబ్రెటీలు.. వీరే: మీకు తెలుసా..!!

సూర్య ఇటీవల డుకాటీ నుండి స్టైలిష్ స్ట్రీట్-ఫైటర్ డిజైన్‌తో డుకాటి మాన్‌స్టర్ 821ని కొనుగోలు చేశాడు. ఈ బైక్‌లో శక్తివంతమైన 821 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్ మరియు 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 30, 2021, 12:08 [IST]
English summary
Celebrities having ducati bikes shahid kapur vivek oberoi and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+