ఈ సంవత్సరం (2022) దేశంలో జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదాలు, ఇవే..!!
ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. 2021 లో రోజుకు సగటున 1,130 ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరంలో (2021) ఏకంగా 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే దేశంలో ప్రతి గంటకు 18 మంచి రోడ్డు ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడానికి రోడ్డు రవాణా మంత్రి 'నితిన్ గడ్కరీ' కొత్త విధానాలను అమలుచేయడమే కాకుండా, కఠినమైన నిబంధనలను కూడా ప్రవేశపెట్టారు. అంతే కాకుండా దేశంలో సురక్షితమైన కార్లను ప్రవేశపెట్టాలని కూడా వాహన తయారీ సంస్థలను ఆదేశించారు. కావున రానున్న రోజుల్లో తప్పకుండా 6 ఎయిర్ బ్యాగులు కూడా అమలులోకి రానున్నాయి.

ఈ సంవత్సరంలో (2022) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రముఖులు కూడా మరణించారు. అంతే కాకుండా.. భయంకరమైన రోడ్డు ప్రమాదాల వల్ల కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. 2022 లో జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదాలలో గాయపడిన మరియు మరణించిన వారిని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

రిషబ్ పంత్:
భారత మాజీ వికెట్ కీపర్ మరియు కెప్టెన్ 'రిషబ్ పంత్' కారు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ ఎక్కువ గాయాలు పాలు కాగా, తన కారు పూర్తిగా కాలిపోయి నుజ్జు నుజ్జు అయిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం, రిషబ్ పంత్ తమ మీద, కాలికి, వీపు భాగంలో గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో అతని బెంజ్ కారు పూర్తిగా కాలిపోయి ఉండటం గమనించవచ్చు.

రిషబ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురి కావడానికి సరైన కారణం తెలియదు, బహుశా ఉదయం కావున పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన సరైన వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. ప్రమాదంలో చాలా కష్టం మీద రిషబ్ పంత్ బయటపడగలిగాడు, అంతే కాకుండా సమయానికి హాస్పిటల్ లో చేరడం వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

మలైకా అరోరా:
ప్రముఖ బాలీవుడ్ నటి గత ఏప్రిల్ నెలలో పూణే నుండి ముంబైకి తన రేంజ్ రోవర్ SUV లో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో ఆమె నుదిటి గాయాలయ్యాయి, డాక్టర్లు
ఆమె నుదిటి కుట్లు కూడా వేశారు. మలైకా అరోరా ఇటీవల కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు తృటిలో తప్పించుకుంది.
ప్రమాదం తరువాత మలైకా అరోరా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శారీరకంగా గాయం నయమైపోయినప్పటికీ మానసికంగా ఇప్పటికీ భయం అలాగే ఉందని చెప్పింది. ఈ సంఘటన జరిగిన తరువాత ఆమె కారుని కూడా నడపలేకపోయినట్లు చెప్పుకొచ్చింది.

దీప్ సిద్ధూ:
ఈ సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్ధూ ప్రాణాలు కోల్పోయాడు. 2022 ఫిబ్రవరి నెలలో కుండ్లి- మనేసర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ సంఘటనలో దీప్ సిద్ధూ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

సైరస్ మిస్త్రీ:
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయన తన మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి SUV లో మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్ - ముంబై హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు ఘోర రోడ్డు ప్రమాదం జరగటం వల్ల ఇది జరిగింది.

ఈ ప్రమాదానికి అతివేగమే కారణమంటూ హాంకాంగ్ మెర్సిడెజ్ బెంజ్ టీమ్ నివేదికలను కూడా ఇచ్చింది.ఆయన ప్రయాణించిన కారు యాజమాన్యం మెర్సిడెస్ బెంజ్ అధికారులు సైతం స్పాట్‌కి వచ్చి విచారణ చేపట్టారు. మెర్సిడెస్ బెంజ్ తన ప్రాథమిక రిపోర్టును పోలీసులకు సమర్పించింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ సీట్ బెల్ట్ ధరించలేదు.

ప్రస్తుతం భారతదేశంలో శీతాకాలం కావడం వల్ల రోడ్లన్నీ కూడా మంచు దుప్పట్లు కప్పుకుని ఉంటాయి. కావున ఉదయం సమయంలో రోడ్డు ప్రయాణం చేసేవారికి రోడ్డు స్పష్టంగా కనిపించే అవకాశం లేదు. ఆ సందర్భంలో తప్పకుండా ప్రమాదాలు జరుగుతాయి. కావున ఈ శీతాకాలంలో రోడ్డు ప్రయాణం చేసేవారు నెమ్మదిగా తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.


Click it and Unblock the Notifications








