పూజ హెగ్డే నుంచి ముఖేష్ అంబానీ వరకు.. అందరికీ ఈ కారంటే ఇష్టమే!

ల్యాండ్ రోవర్ కార్లను చాలా ఖరీదైన కార్ల విభాగానికి చెందినవని అందరికి తెలుసు. ఖరీదు ఎక్కువ కావడం వల్ల ధనవంతులు మాత్రమే ఈ కార్లను కొనుగోలు చేస్తారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ మరియు వ్యాపారవేత్తలు తమ గ్యారేజీల్లో ల్యాండ్ రోవర్ కార్లకు స్థానం కల్పించారు. ఈ కథనంలో ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న ప్రముఖ సెలబ్రిటీలు ఎవరు? వారి దగ్గర ఉన్న కార్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.. రండి.

పూజా హెగ్డే

ప్రముఖ నటి పూజా హెగ్డే గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించి పాపులర్ అయింది. ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఈమె గత కొన్ని రోజులకు ముందు రూ. 4 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ SUV కొనుగోలు చేసింది.

Sonam Kapoor Land Rover Defender

సోనమ్ కపూర్

నటి సోనమ్ కపూర్ కూడా.. పూజా హెగ్డే మాదిరిగానే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్ బేస్ కారును కొనుగోలు చేసింది. సోనమ్ కపూర్ ల్యాండ్ రోవర్ కారు బూడిద రంగులో ఉండటం చూడవచ్చు. ఈ SUV ధర రూ. 3.76 కోట్లు అని సమాచారం. ఈ కారులో సోనమ్ కపూర్ చాలా సార్లు కనిపించింది.

అలియా భట్ & రణబీర్ కపూర్

మూడుముళ్లతో ఒక్కటైన ఈ అలియా భట్ మరియు రణబీర్ కపూర్ కూడా రెండు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్ బేస్ కార్లను కలిగి ఉన్నారు. అలియా అలియా భట్ యొక్క కారు బెల్గ్రావియా గ్రీన్ కలర్ పొందింది. రణబీర్ కారు కూడా ఇదే రంగులో ఉంచి. వీటి ధరలు రూ.3.76 కోట్లు (ఒక్కొక్కటి). రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 3.0-లీటర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ ఇన్‌లైన్ సిక్స్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది.

Alia Bhatt Range Rover

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా రేంజ్ రోవర్ కారును కలిగి ఉన్నారు. ఈయన వద్ద ఉన్న కారు పోర్టోఫినో బ్లూ రేంజ్ రోవర్ ఎస్వీ లాంగ్ వీల్ బేస్ మోడల్. దీని ధర రూ.4.4 కోట్లు. ఇది 3.0-లీటర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 503 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది బుల్లెట్ ప్రూఫ్ అని సమాచారం.

షారుఖ్ ఖాన్

నటుడు షారుఖ్ ఖాన్ కూడా ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న ప్రముఖులలో ఒకరు. ఈయన వద్ద 3.0-ఇంజిన్ ఆప్షన్ పొందిన రేంజ్ రోవర్ ఎస్వీ లాంగ్ వీల్ బేస్ మోడల్ ఉంది. దీని ధర రూ.4.4 కోట్లు. ఇది సిల్వర్ క్లాసీ షేడ్‌లో ఉంది. ఈ కారు 503 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 3.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది.

పైన చెప్పిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా క్రికెటర్స్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కూడా ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు. అంతే కాకుండా నిమ్రత్ కౌర్, మనీష్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్, అమితాబ్ బచ్చన్, గౌతమ్ అదానీ మరియు ముఖేష్ అంబానీ వంటి బిలినీయర్ కూడా ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2024, 12:11 [IST]
English summary
Celebrity owners of range rover in india
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+