బెంజ్‌ కారులో సిమెంట్ బస్తాల తరలింపు.. నవ్వు తెప్పిస్తున్న నెటిజన్ల కామెంట్స్‌

లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఓ బ్రాండ్‌. ఈ కారును ఎక్కువగా ధనవంతులు, సెలబ్రిటీల వద్దనే చూస్తుంటాం. వాహనదారులు ఈ కారును చాలా జాగ్రత్తగా సున్నితంగా చూసుకుంటారు. ఎందుకంటే దీని ఖరీదు రూ. కోట్లలో ఉంటుంది. దీని మెయింటెనెన్స్‌ కూడా ఖర్చుతో కూడుకున్నదే. అలాంటి కారును ఓ వ్యక్తి సిమెంట్‌ రవాణాకు ఉపయోగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ. కోట్ల విలువైన మెర్సిడెస్‌ బెంజ్‌ జి- వ్యాగన్‌ను సిమెంట్‌ రవాణాకు వినియోగించారు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను TeamSCEII841 అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ కారు రోడ్డుపై వెళ్తుండగా వీడియో తీశారు. కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఈ వీడియో ఉంది.

Cement-Bags-In-Mercedes-G-Wagon

ఈ వీడియోలో, తెల్లటి మెర్సిడెస్ G-వ్యాగన్ టెయిల్‌గేట్ తెరిచి రోడ్డు పక్కన ఆగి ఉండటాన్ని చూడవచ్చు. ఈ లగ్జరీ కార్లు వాహనం వెనుక భాగంలో ఏదో లోడ్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదేంటా అని నిశితంగా పరిశీలిస్తే సిమెంట్‌ సంచులను లోడ్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో G-వ్యాగన్ రిజిస్ట్రేషన్ నంబర్ సరిగ్గా కనిపించడం లేదు.

కాగా వీడియోను పరిశీలించినట్లయితే ఈ సంఘటన ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియోలో కనిపించిన మెర్సిడెస్‌ బెంజ్‌ G- వ్యాగన్‌.. G63 AMG లేదా G 350d అనే సమాచారం స్పష్టంగా అందుబాటులో లేదు. ఏదేమైనా ఇలాంటి లగ్జరీ G-వ్యాగన్‌ ఎస్‌యూవీని ఈ విధంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి కావచ్చు.

Cement-Bags-In-Mercedes-G-Wagon

కాగా మెర్సిడెస్‌ బెంజ్‌ G-Wagon ఒక భారీ SUV. ఇది ఆఫ్-రోడింగ్‌కు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ లగ్జరీ కారు 480 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. మెర్సిడెస్-బెంజ్ శ్రేణిలో ఎప్పటినుంచో ఉన్న SUVలలో జీ వ్యాగన్‌ కూడా ఒకటి.. కాగా ఇతర Mercedes-Benz మోడల్‌ల మాదిరిగానే, G-వ్యాగన్‌కు కూడా ఓ హిస్టరీ ఉందనే చెప్పొచ్చు.

మెర్సిడెస్‌ బెంజ్‌ G- వ్యాగన్‌ను సాధారణంగా సైన్యం కోసం రూపొందించారు. ఆ తరువాత, G-వ్యాగన్‌ను మరింత ప్రీమియం సౌకర్యాలతో రూపొందించడంతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారు బాక్సీ డిజైన్‌ను మాత్రం ఇప్పటికీ మార్చలేదు. మెర్సిడెస్ జీ వ్యాగన్‌ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వెర్షన్‌తో సహా అన్ని తరాలలో దాని బాక్సీ డిజైన్‌ను మాత్రమే తీసుకురానున్నారు.

Cement-Bags-In-Mercedes-G-Wagon

ప్రస్తుత తరం G63 AMG 4.0-లీటర్ బై-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 585 Bhp శక్తిని మరియు 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు స్పోర్ట్స్‌, సినీ సెలబ్రిటీలకు ఫేవరెట్‌గా మారింది. కాగా ఇటీవల మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ ఈ లగ్జరీ G63 AMGని కొనుగోలు చేశారు.

అయితే ఇప్పుడు ఇలాంటి లగ్జరీ కారులో సిమెంట్‌ బస్తాలను తీసుకెళ్లడం తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కాగా భారత మార్కెట్లో G63 AMG ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.3 కోట్లుగా ఉంది. G350d స్థానంలో రూ. 2.55 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో అప్‌డేటెడ్‌ G400d ను ప్రవేపట్టారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 1, 2024, 17:45 [IST]
English summary
Cement bags transport in mercedes g wagon suv video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+