పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ, డ్రైవర్ల నిరసనలతో హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం కీలక నిర్ణయం..!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతీయ శిక్షస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులపై (hit and Run cases) తీసుకొచ్చిన కఠిన నిబంధనలు పొందుపరిచింది. ఇందులోని రెండో నిబంధనపై ట్రక్కు డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిబంధన ఏం చెబుతోంది.
ఈ నిబంధన ఏం చెబుతుందంటే రోడ్డు ప్రమాదాలకు కారణం అయిన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు కచ్చితంగా సమాచారం అందించాలి. సమాచారం ఇవ్వకుండా ఘటన స్థలం నుంచి పారిపోతే ఈ నిబంధన కింద గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఈ నిబంధనతో బస్సు, ట్యాంకర్ డ్రైవర్ల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఫలితంగా పలుచోట్ల ఇంధన కొరత నెలకొంది. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టారు. గత రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ కాంగ్రెస్ సమావేశం అయింది. ఈ భేటీలో హిట్ అండ్ రన్ కేసులకు 10 సంవత్సరాల శిక్ష మరియు రూ.7 లక్షల జరిమానా విధించే కొత్త నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 304A (నిర్లక్ష్యం వల్ల మరణం) కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

నూతన చట్టాలు ఇంకా అమల్లోకి రాలేదని, అమలు చేసేందుకు ముందు వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చిస్తామని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. అనంతరమే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్లు తమ విధులకు హాజరుకావాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
ఏంటీ హిట్ అండ్ రన్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ఆధారంగా హిట్ అండ్ రన్.. పూర్తి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. అయితే ఇందులోని సెక్షన్ 104లో రెండు నిబంధనలున్నాయి. మొదటి నిబంధన ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల మరణాలకు కారణం అయితే గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు.

అయితే ఇందులోని రెండో నిబంధనలపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ఏం చెబుతుందంటే రోడ్డు ప్రమాదాలకు కారణం అయిన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు కచ్చితంగా సమాచారం అందించాలి. సమాచారం ఇవ్వకుండా ఘటన స్థలం నుంచి పారిపోతే ఈ నిబంధన కింద గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే ఈ రెండో నిబంధనపై ప్రైవేటు బస్సులు, లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో దీనిపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్లు ఘటన స్థలంలోనే ఉంటే స్థానికులు తమపై దాడి చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు హిట్ అండ్ రన్ కేసులో గరిష్ఠంగా పది సంవత్సరాలపాటు శిక్ష పడితే అన్ని రోజులు తన కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు రూ.7 లక్షల జరిమానా కూడా చెల్లించడం సాధ్యం కాదని చెబుతున్నారు.
హిట్ అండ్ రన్ చట్టం ఉద్దేశం ఏంటీ : కేంద్రం చెబుతున్న వివరాల ప్రకారం హిట్ రన్ కేసులో సమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సరైన సందర్భాల్లో సరైన సమయానికి వైద్య సాయం అందక ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులకు సమాచారం అందితే వారిని సకాలంలో హాస్పిటల్‌కు తరలించి, ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








