డీజిల్ కార్లపై పూర్తిగా నిషేధం..!! 2027 నుంచి ఈ కార్లు కనిపించకపోవచ్చు.!!
దేశంలో డీజిల్ కార్లు ఇప్పటికీ బాగా ప్రాచుర్యం పొందాయి. భారతీయులు ఎక్కువగా డీజిల్ కార్లవైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు డీజిల్ బొలెరో కార్లు గత మూడు నెలల్లోనే 25,910 యూనిట్లను విక్రయించాయి. ఈ నేపథ్యంలో విశేష స్పందన లభిస్తున్న డీజిల్ కార్ల విక్రయాలకు స్వస్తి పలకాలని భారత్ యోచిస్తోంది.
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీని ఆధారంగానే డీజిల్ వాహనాలను దశలవారీగా నిలిపివేసేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలో 2027 నుంచి డీజిల్ వాహనాల అమ్మకాలపై పూర్తి నిషేధం విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ భారీ నిషేధం భారతీయ వినియోగదారులకు ప్రముఖ ఎంపికలుగా ఉన్న అనేక ప్రసిద్ధ డీజిల్ కార్లపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి కొన్ని ప్రముఖ కార్ మోడల్స్ త్వరలో వినియోగదారులకు దూరం కానున్నాయి. పూర్తిగా 25 డీజిల్-ఇంజిన్ కార్ మోడళ్లు మార్కెట్ నుంచి నిష్క్రమించబోతున్నాయి. వాటి వివరాలు ఈ కథనంలో చూద్దాం.
టాటా డీజిల్ కార్లు: టాటాకు చెందిన కొన్ని ఉత్పత్తులు కేవలం డీజిల్‌తో నడిచే మరియు డీజిల్-పెట్రోల్ ఎంపికల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా నుంచి ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు సఫారీ మోడళ్లలో డీజిల్ ఇంజిన్ ఎంపికలను అందిస్తుంది. ప్రభుత్వం డీజిల్ వాహనాల నిషేధం కారణంగా ఈ కార్ మోడళ్లన్నీ మార్కెట్‌లో లేవు. ఈ మోడల్స్ పెట్రోల్ వేరియంట్‌లో లభిస్తున్నాయి. పెట్రోల్ కార్ల విక్రయంపై ఎలాంటి అడ్డంకులు లేవు.

మహీంద్రా: టాటా మాదిరిగానే మహీంద్రా తన ప్రసిద్ధ కార్ మోడళ్లలో డీజిల్ ఎంపికను అందిస్తోంది. మహీంద్రా బొలెరో, బొలెరో నియో, మరాజ్జో, థార్, XUV 700, స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N లలో డీజిల్ ఎంపికను అందిస్తుంది. ఈ అన్ని మోడళ్ల డీజిల్ ఎంపికలు దశలవారీగా నిలిపివేయబడతాయి.
హ్యుందాయ్ డీజిల్ కార్లు: హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ, క్రెటా మరియు అల్కాజార్ వంటి ప్రముఖ మోడళ్లలో డీజిల్ ఇంజిన్ల ఎంపికను అందిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్ సున్నితమైన డ్రైవింగ్ అనుభవంతో పాటు మంచి మైలేజీని అందిస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ సబ్‌కాంపాక్ట్ SUV ప్రత్యామ్నాయ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో తిరిగి ఆవిష్కరించవలసి ఉంటుంది.

కియా మోటార్స్: కియా మోటార్స్‌లో మూడు కారు మోడళ్లలో పెట్రోల్‌తో పాటు డీజిల్ ఎంపికను అందిస్తుంది. సోనెట్, గ్యారెన్స్ మరియు సెల్టోస్. సొనెట్ మరియు సెల్డోజ్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లు. డీజిల్ వేరియంట్‌ను రెండింటి నుంచి తొలగిస్తుండటం వలన, దాని అమ్మకాలపై కొద్దిగా ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
MG మరియు టయోటా నుంచి కొన్ని డీజిల్ కార్లకు భారతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఈ క్రమంలో MG గ్లోస్టర్ మరియు హెక్టర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్న డీజిల్ ఎంపికలు మార్కెట్ నుంచి దశలవారీగా తొలగించబడుతున్నాయి. అదేవిధంగా, టయోటాకు చెందిన ప్రముఖ కారు మోడళ్లు ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్‌ల డీజిల్ వేరియంట్లు కూడా మార్కెట్ నుండి కనుమరుగు కానున్నాయి.

అయితే ఇన్నోవా క్రిస్టా డీజిల్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నోవా క్రిస్టా పూర్తిగా భారతీయ మార్కెట్ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. డీజిల్ నిషేధంతో, ఈ టయోటా ఐకానిక్ MPV కోసం క్లీనర్ టెక్నాలజీలపై దృష్టి పెట్టనుంది.
డీజిల్ కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధంతో పైన పేర్కొన్న కారు మోడళ్లే కాకుండా జీప్ కంపాస్ మరియు ఫోర్స్ గుర్గా వంటి కార్ మోడల్‌లు కూడా ప్రభావితమవుతున్నాయని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్ మోడళ్లలో చాలా వరకు డీజిల్ మోటార్ ఎంపికల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, 2027 తర్వాత ఆ కార్లు కనిపించే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications








