మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే లక్ష్యం: నితిన్ గడ్కరీ

భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమ ఎగుమతుల విషయంలో రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రపంచంలోనే నెంబర్ 01 గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రస్తావించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి భారతదేశ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం మన ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్ రూ. 7.5 లక్షల కోట్లు. ఇది నిజంగా గొప్ప విషయం.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

అయితే రానున్న మరో ఐదు సంవత్సరాలలో ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్ రూ. 15 లక్షల కోట్లకు పైగా చేరే అవకాశం ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా ఉపాధి, ఎగుమతి, ఆదాయాన్ని అందిస్తున్న పరిశ్రమలో ఆటో మొబైల్ పరిశ్రమ ముందు వరుసలో ఉంది. అనంతకుమార్ స్మారక ఉపన్యాసం తొలి సంచికలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

భారతదేశంలో మరో ఐదేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బస్సులు, ఆటో రిక్షాలు మరియు ట్రక్కుల ఎగుమతులలో ఆటో మొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే తమ దృష్టి, నిబద్ధత అని కూడా ఆయన అన్నారు. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వల్ల పర్యావరణం చాలా కలుషితం అవుతుంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాలు ప్రశ్నర్థకంగా మారతాయి. కావున ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం చాలా అవసరం ఐ ఆయన అన్నారు.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ, నైతికత మరియు జీవావరణ శాస్త్రం మరియు పర్యావరణం అనేవి చాలా ప్రధానమైనవి. కావున వీటిని దృష్టిలో ఉంచుకుని భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 01 ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకుంటున్నాము, అని గడ్కరీ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ వర్ధంతి సందర్భంగా అనంతకుమార్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో స్మారక ఉపన్యాసంలో ఇవన్నీ ఉపన్యసించారు.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాకుండా ఎల్‌ఎన్‌జి, వ్యర్థ జలాల నుండి గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఫ్లెక్స్ ఇంజన్‌లను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రణాళికలపై ఈ విషయంలో బెంగళూరులోని స్టార్టప్‌లు, వ్యాపారాలు మరియు పరిశోధనా సంస్థలు చేసిన కృషిని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ అభినందించారు.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

అంతే కాకుండా కాలుష్య నియంత్రణకు దోహదపడే ఎలక్ట్రిక్ లేదా ఫ్లెక్స్ ఇంజన్లతో కూడిన వాహనాలను కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా రంగానికి సంబంధించి, గడ్కరీ మాట్లాడుతూ, మా మొదటి ప్రాధాన్యత జలమార్గాలు, రెండవ రైల్వేలు, మూడవ రహదారి మరియు నాల్గవ విమానయానం, అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు 90 శాతం ప్రయాణీకుల ట్రాఫిక్ రోడ్డుపై మరియు 70 శాతం వస్తువుల ట్రాఫిక్ రహదారిపై ఉన్నాయి.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు జాతీయ రహదారి 96 వేల కి.మీలు ఉండగా ప్రస్తుతం 1,47,000 కి.మీలు ఉన్నాయని, అప్పట్లో జాతీయ రహదారి నిర్మాణం రోజుకు 2 కి.మీ.గా ఉండేదని, ఇప్పుడు రోజుకు 38 కి.మీ. జాతీయ రహదారుల రహదారి నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఇవన్నీ దేశ ప్రగతికి చాలా దోహదపడతాయి. కావున రహదారులు మొదలైన విషయాలలో ప్రపంచంలోనే మనం అత్యున్నత స్థానంలో ఉన్నామని కూడా ఆయన అన్నారు.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

హైవే రోడ్డు పనులను రికార్డు సమయంలో పూర్తి చేసినందుకు నితిన్ గడ్కరీ వివరిస్తూ, రోడ్డు నిర్మాణంలో మనం ఇప్పుడు ముందున్నాము. అంతే కాకుండా నా లక్ష్యం మరో మూడేళ్లలో భారతీయ రోడ్లను US-స్టాండర్డ్‌గా మార్చడం అన్నారు. చెన్నై నుండి బెంగళూరు వరకు కూడా మేము గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే తయారు చేస్తున్నాము అన్నారు.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

అంతే కాకూండా కర్ణాటకకు సంబంధించి పలు ప్రాజెక్టులకు హామీ ఇస్తూ, తన తదుపరి పర్యటనలో, తాను బెంగళూరు రింగ్ రోడ్డుపై కూడా పని చేస్తామని, దీనికి కావాల్సిన ఏర్పాట్లు త్వరలో పనులు అమలులోకి వస్తాయని కూడా వారు అన్నారు. షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 103 జలమార్గాల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ఆయన హైలైట్ చేశారు. ఏది ఏమైనా మంత్రి కంటున్న కళలను నిజం చేయడానికి మరియు భారతదేశాన్ని ప్రగతి మార్గంలో తీసుకెళ్లడానికి మన వంతు కూడా కృషి చేయాలి. దీని కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి కంకణం కట్టుకోవాలి.

మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగం నెంబర్ 01 కి చేరటమే నా లక్ష్యం: నితిన్ గడ్కరీ

ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా అద్భుతమైన రాయితీలను కల్పిస్తున్నాయి. అంతే కాకుండా రోజురోజుకి అమాంతంగా పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి సహాయపడతాయి.

Most Read Articles

English summary
Central minister nitin gadkari aims to make indian automobile sector no 1 details
Story first published: Saturday, November 13, 2021, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X