కేంద్ర మంత్రిగా ఉండి ఆ వ్యాఖ్యలు చేయాలంటే ధైర్యం ఉండాలి..యుద్ధంలో కంటే, రోడ్డు ప్రమాదంలోనే ఎక్కువ మరణాలు!!
ప్రపంచంలో మరీ ముఖ్యంగా దేశంలో భారీ ప్రాణనష్టానికి కారణమయ్యే సంఘటనల గురించి అడిగితే చాలా మంది ప్రకృతి వైపరీత్యాలు, అల్లర్లు, యుద్ధాలు అని చెబుతారు. కానీ రోడ్డు ప్రమాదాలు అని ఎవరూ అనుకోరు. కానీ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు రోడ్డు ప్రమాదాలే కారణమవుతున్నాయి. యుద్ధాలు, ఉగ్రవాద దాడుల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా వాహనాలు లేకుండా మన దైనందిన జీవితం నడవడం అసాధ్యం. ప్రతీ పనికి మనం ఆటోమొబైల్స్ మీద ఎక్కువగా ఆధారపడటం అలవాటైంది. వాహనాలను ఉపయోగించడంలో తప్పులేదు. మనిషి కనిపెట్టిన వాటిలో ఇదొకటి. కానీ మనలో చాలా మందికి వాహనాలను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు. దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది.

ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ హైవేలపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందులోనూ హైస్పీడ్ వల్లే ప్రమాదం జరుగుతున్నాయని తేలింది. దీంతో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ బ్లాక్ స్పాట్స్ పెరుగుతున్నాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఫిక్కీ నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్ 6వ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బ్లాక్ స్పాట్ల సంఖ్య నిరంతరం పెరగడానికి రోడ్డు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సరిగా లేకపోవడమే కారణమని ఆయన పేర్కొన్నారు. యుద్ధాలు, ఉగ్రదాడుల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని, 3 లక్షల మంది గాయపడుతున్నారని ఆయన చెప్పారు. దీని వల్ల దేశ జీడీపీ 3 శాతం క్షీణిస్తుందని పేర్కొన్నారు. అన్ని ప్రమాదాలకు డ్రైవర్లు కారణం అయినా కానీ రోడ్ ఇంజినీరింగ్‌లో లోపం ఉందని గడ్కరీ అన్నారు. దేశంలోని అన్ని రహదారులపై సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని గడ్కరీ అన్నారు.
రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలంటే ఒకే రోడ్డుపై వెళ్లడం అలవాటు చేసుకోవాలని నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను త్వరితగతిన ఆదుకునేందుకు అంబులెన్స్‌లు, డ్రైవర్లను కూడా సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలను అంబులెన్స్ డ్రైవర్లు ఒక్కోసారి బాధితులను రక్షించేందుకు 3 గంటల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక 2025 నుంచి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు కలిగిన బస్సులను మాత్రమే విక్రయించడానికి అనుమతిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజారవాణా భద్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న బస్సులు ఎక్కువగా చెక్క, అల్యూమినియం రేకులతో తయారైనట్లు వీటి వల్ల ప్రమాద స్థాయి పెరుగుతుందని అన్నారు. అందులో భాగంగా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటించాలని నిర్ణయించినట్లు గడ్కరీ తెలిపారు.
డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: మానవ జీవితం విలువైనది. కానీ ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ఇందుకు ప్రధాన కారణం. కాబట్టి రోడ్లపైకి రాగానే కాస్త శ్రద్ధతో డ్రైవ్ చేయండి. ఎందుకంటే మీకోసం మీ ఫ్యామిలీ ఇంట్లో ఎదురు చూస్తుంది. కావున ముందుగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందుకోసం సమయాన్ని సరిగ్గా పాటించండి.


Click it and Unblock the Notifications








