టికెట్‌ లేకుండా రైలు ప్రయాణాలు.. రూ. 300 కోట్లు జరిమానాలు వసూలు చేసిన రైల్వే శాఖ.. అత్యధికంగా ఎక్కడంటే.??

టికెట్‌ లేకుండా రైల్లో ప్రయాణించడం(Central Railway Penalties) నేరం. అందుకు జరిమానా తప్పదు. అయినా సరే చాలా మంది టికెట్‌ లేకుండా ప్రయాణిస్తుంటారు. అయితే భారతీయ రైల్వే శాఖ మొత్తంలో సెంట్రల్‌ రైల్వే జోన్‌లో ఎక్కువగా టికెట్‌ లేకుండా ప్రయాణిస్తారట. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్‌ రైల్వే జోన్‌లో దాదాపు రూ. 300 కోట్ల జరిమానాలు వసూలయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరంలో జరిమానాల వసూళ్ల విషయంలో సెంట్రల్‌ రైల్వే జోన్‌(Train Journey Without Tickets) ముందజలో ఉంది. దాదాపు 46.26 లక్షల మంది నుంచి ఏకంగా రూ. 300 కోట్లు జరిమానాగా వసూలు చేసింది. ఇందులో టిక్కెట్లు లేని వారు మాత్రమే కాకుండా సరైన క్లియరెన్స్ లేకుండా అదనపు లగేజీని తీసుకెళ్లినవారు కూడా ఉన్నారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ లేని వారు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.

Train-Journey-Without-Tickets

కాగా గతేడాది టార్గెట్‌ కంటే ఈ ఆర్థిక సంవత్సరం జరిమానాలు అధికంగా వసూలు చేసినట్లుగా రైల్వే సీఆర్‌ తెలిపారు. 2023-24 సంవత్సరంలో రూ. 275 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. అంతకు మించి అంటే రూ. 298 కోట్లు జరిమానాలను సెంట్రల్‌ రైల్వే జోన్‌ వసూలు చేసింది. అంటే దాదాపు రూ. 23 కోట్లు వసూలయ్యాయని వెల్లడించారు.

ఒక్క సెంట్రల్ రైల్వే జోన్‌లోనే ఇన్ని కోట్ల రూపాయలు వసూలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ జోన్ పరిధిలో ఐదు డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా, భారతీయ రైల్వేలు సెంట్రల్ రైల్వేతో పాటు మొత్తం 12 జోన్లను కలిగి ఉంది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని డివిజన్లు ముంబయి, నాగ్‌పూర్, భుస్వాల్‌, పూణే మరియు సోలాపూర్ డివిజన్లు.

Train-Journey-Without-Tickets

ఈ ఐదు కేటగిరీల్లోనే 46.26 లక్షల మంది సరైన ప్రయాణ టిక్కెట్లు లేకుండా, అనుమతి లేకుండా లగేజీలు తీసుకెళ్తుండగా అధికారులకు చిక్కారు. ఇందుకు కారణం రద్దీ కారణంగా భారతదేశంలో అత్యధికంగా టిక్కెట్లు లేని ప్రయాణికులతో సెంట్రల్ రైల్వే జోన్‌లో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి.

అయితే ఈ సెంట్రల్ రైల్వే జోన్‌లో జరిమానాల వసూళ్లలో ముంబయి డివిజన్ మొదటి స్థానంలో ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ముంబయి డివిజన్‌లో రూ.115.29 కోట్లు పెనాల్టీగా వసూలు చేశారు. ఇక్కడ 20.56 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం.

Train-Journey-Without-Tickets

ఇక బస్వాల్ రైల్వే జోన్‌లో ప్రయాణికుల నుంచి పెనాల్టీగా రూ. 66.33 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇక్కడ మొత్తం 8.34 లక్షల కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత 5.70 లక్షల కేసులతో నాగ్‌పూర్ డివిజన్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ రూ.34.52 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.

నాలుగో స్థానంలో ఉన్న సోలాపూర్‌ డివిజన్‌లో 5.44 లక్షల కేసులు టికెట్‌ లేని ప్రయాణాలుగా నమోదయ్యాయి. ఈ డివిజన్‌లో ఏకంగా రూ. 34.74 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఇక పూణె డివిజన్‌ ​​ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ మొత్తం 2.47 లక్షల కేసులు నమోదు కాగా.. 20.96 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశారు.

Train-Journey-Without-Tickets

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 7, 2024, 1:22 [IST]
English summary
Central railway zone collects rs 300 crores in 2023 24 financial year as fines
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+