సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు

'హిందుస్థాన్ మోటార్స్' యొక్క 'అంబాసిడర్' (Ambassador) కారు ఎంతోమంది సుపరిచయమే, ఎందుకంటే గొప్ప ధనవంతలు మరియు ప్రభుత్వ అధికారులు ఉపయోగించే వాహనంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. 1990 ల్లోనే ఈ కారు విపరీతమైన ప్రజాదరణ పొందినదిగా కీర్తి గడించి చాలా రంగాల్లో తన సేవలను అందించింది. ఇప్పటికి కూడా చాలామంది వాహన ప్రియులు ఈ అంబాసిడర్ కారుని కలిగి ఉన్నారు. మనం కూడా చాలా సందర్భాల్లో అక్కడక్కడా చూసే ఉంటాము.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

భారతీయ మార్కెట్లో సుదీర్ఘ కాలంపాటు సేవలందించిన ఈ కారు 2014లో ఉత్పత్తి నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది. కానీ చాలామంది అధికారులు చాలా రోజుల వరకు వినియోగించారు. ముంబై రైల్వే విభాగంలో కూడా ఈ కారుని ఏకధాటిగా 35 సంవత్సరాలు వినియోగించారు. అయితే ఇటీవల ఈ కారు ముంబై రైల్వే విభాగానికి వీడ్కోలు పలికింది.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

ఈ అంబాసిడర్‌ కారు 1985 జనవరి 22న ముంబై రైల్వే విభాగంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి కూడా వినియోగంలోనే వుంది. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కారు డ్రైవర్ కూడా ఆ కారుతో పాటు రిటైర్ తీసుకున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

భారతదేశంలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలులోకి వచ్చిన తరువాత కొన్ని నియమాలు సూచించడం జరిగింది. ఈ నియమాల కారణంగా పాత వాహనాలను స్క్రాపింగ్ చేయాలి. దీనిని కూడా స్క్రాపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా ఆ అంబాసిడర్‌ కారుకి ఘనంగా వీడ్కోలు పలికారు.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

అంబాసిడర్‌ కారుకి పూల మాలలతో అలంకరించి వీడ్కోలు పలికారు. ఆ కారు డ్రైవర్ కూడా ఆసందర్భంగా రిటైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముంబై రైల్వే అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆటోమోటివ్ శకాన్ని ప్రారంభించిన కారు ఈ 'అంబాసిడర్' కారు బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ కాకపోవడం వల్ల నిలిపివేయబడింది. హిందుస్థాన్ అంబాసిడర్‌ ఇప్పటికీ చాలా చోట్ల టాక్సీ మరియు క్యాబ్‌లుగా ఉపయోగిస్తున్నారు.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ యొక్క చివరి అంబాసిడర్ కారు డ్రైవర్‌తో సహా మొత్తం 5 మంది వ్యక్తులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రారంభంలో దీనిని సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ యొక్క ఇంజినీరింగ్ విభాగం 1985 లో రూ. 75000 ధరతో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ కారు 6 జూన్ 1992న సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్‌లోని వాణిజ్య విభాగానికి మారింది. ఈ కారు సుదీర్ఘంగా డ్యూటీలో సేవలందించినా ఎటువంటి సమస్యలకు లోను కాలేదని అధికారులు తెలిపారు.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

35 సంవత్సరాలు సేవలందించిన ఈ కారుకి డ్రైవర్ 'ముత్తు పాండి అండి నాడార్'. ఇతడు 1992 నుంచి ఈ కారును డ్రైవ్ చేస్తున్నాడు. అయితే యితడు 1984 లో సెంట్రల్ రైల్వేలో ఖలాసీగా చేరారు. ఆ తరువాత 1988లో డ్రైవర్‌ అయ్యాడు. 1992 లో ముత్తుకు ఈ కారు డ్రైవింగ్ బాధ్యతలు అధికారులు అప్పగించారు.

సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు, ఎక్కడో తెలుసా?

ఈ కారుకి వీడ్కోలు పలికే సందర్భంలో డ్రైవర్ ముత్తు మాట్లాడుతూ, నా యువరాణిని చాలా మిస్ అవుతున్నానని అన్నారు, అంతే కాకుండా.. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి సమస్యలకు మరియు ప్రమాదాలకు గురి కాలేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ కారుకి ఎక్కడా ట్రాఫిక్ చలానాలు కూడా కట్టే అవకాశం రాలేదని ఆయన గర్వంగా చెప్పాడు. అయితే ఈ రోజే ఈ కారుతో నా చివరి ప్రయాణం అని కూడా బాధపడ్డాడు.

NOTE: ఇక్కడ ఉపయోగించిన మొదటి ఫోటో తప్పా మిగిలినవి కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Article Published On: Monday, April 4, 2022, 14:23 [IST]
English summary
Central railways mumbai division retires last ambassador car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+