Challan On Cops హెల్మెట్ లేకుండా డ్రైవింగ్.. డ్యూటీ పోలీసులకు చక్కులు చూపించిన మహిళ.. రూ.1000 జరిమానా
దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను అధిక సంఖ్యలో నివారించవచ్చు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై చాలా సందర్భాల్లో భారీ సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు. అయినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా నిత్యం జరిమానాల కట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుడటం గమనార్హం.
అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం చలనాలు జారీ చేయబడుతున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా క్షణాల్లో వాహనదారులకు జరిమానాలు జారీ అవుతున్నాయి. ప్రమాదాలలో గాయాలతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారిక యంత్రాంగం భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీని కారణంగా, సురక్షితమైన డ్రైవింగ్ కోసం అనేక కఠినమైన చర్యలు అమల్లోకి తీసుకువచ్చింది.

ప్రస్తుత యుగంలో ఏది జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు తప్పు చేసినా లేదా నియమాలను ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు. సామాన్యంగా ట్రాఫిక్ నియమలాను ఎవరైన ఉల్లంఘిస్తే సోషల్ మీడియాలో పంచుకోవడం జనాలకు అలావాటైపోయింది. ఇక ఇదే తప్పిదాన్ని పోలీసులు చేస్తే ఇక అది పక్కా వైరల్ అవ్వాల్సిందే. శిక్షించాల్సిన పోలీసులే అదే తప్పులు చేస్తే ఎలా అంటూ తమదైన శైలిలో విరుచుకుపడతారు.
విధి నిర్వహణలో ఉన్న ఆ పోలీసులు హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో మంజుల్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. TVS Apache RTR బైక్‌పై వారు వళ్తున్న విజువల్స్ ని చూడవచ్చు. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులకు రూ.1000 జరిమానా విధించిన సంఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ లో జరిగింది.
బైక్‌పై వెళ్తున్న ఇద్దరు పోలీసులు విధినిర్వహణలో భాగంగా బైక్ ని ఉపయోగిస్తున్నారు. బైక్ రైడర్, వెనకాలే కూర్చున్న మరో పోలీసు కూడా ఎటువంటి హెల్మెట్ ధరించలేదు. ఇద్దరు పోలీసులు యూనిఫాంలో ఉన్నారు. వీడియో రికార్డింగ్ చేస్తున్న రైడర్లు వారిని ఇదే విషయాన్ని ప్రశ్నించగా వారు పట్టించుకోలేదు. గట్టిగా అరుస్తుండగా వారు బైక్ వేగాన్ని పెంచి దూసుకెళ్తారు. ఈ వీడియోలో వెనకాల ఉన్న రైడర్ సంభాషణ అంతా రికార్డైంది.
ఎందుకు హెల్మెట్ ధరించడం లేదని.. ఈ నియమాలు పోలీసు అధికారులకు వర్తించవా అని ఆమె వాదిస్తుంది. వారిని ఫాలో అవుతున్న బైక్ పై వెనక ఉన్న వ్యక్తి ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసింది. మహిళ వీడియో రికార్డ్ చేయడాన్ని గుర్తించిన పోలీసులు వేగాన్ని పెంచారు. తాము దీనిని రికార్డు చేస్తున్నామని వారికి తెలిపారు. ఈ ఘటన అనంతరం వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా, సీనియర్ అధికారులు వీడియోను చూసి వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అపాచీ RTR మోటార్‌సైకిల్‌కు రూ.1000 చలాన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆన్ లైన్ లో ట్యాగ్ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎవరూ అతీతులు కారంటూ ఆ ట్వీట్ లో ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
పోలీసులను వీడియో రికార్డ్ చేసిన మహిళను ప్రశంసిస్తున్నామని అధికారులు చెప్పారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం నేరమని అది అందరికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటివి అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నగరంలో వివిధ చోట్ల అమర్చబడిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఇటువంటి వారి వీడియోలు రికార్డ్ చేయబడతాయని అన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని మరోసారి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








