Scooty Seat Belt సీటు బెల్టు లేదని స్కూటీ ఓనర్ కి జరిమానా.. అధికారుల షాకింగ్ జవాబు

ఓ ద్విచక్ర వాహన యజమాని స్కూటీపై వెళుతుండగా సీటు బెల్టు పెట్టుకోనందుకు ట్రాఫిక్ చలాన్ విధించారు. బీహార్‌లోని సమతిపూర్‌లో ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనానికి సీటు బెల్ట్ లేనందుకు ట్రాఫిక్ చలాన్‌ వేయడంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సమతిపూర్‌లో ఈ సంఘటన జరిగింది.

అయితే దీనిపై ఇప్పటికే చలాన్‌ జమ అయిందని తెలిసి అవ్వాక్ అవ్వడం అతని వంతు అయ్యిందని స్కూటర్ ఓనర్ కృష్ణ కుమార్‌ ఝా తెలిపారు. ఏప్రిల్ 27న బనారస్ (వారణాసి) రైలులో ఉన్నప్పుడు నా పేరుపై రూ.1,000 చలాన్ జారీ చేయబడిందని నాకు మెసేజ్ వచ్చింది. తన వద్ద ఉన్న స్కూటీపై పడిన జరిమానా వివరాలను చూసినప్పుడు, 2020 అక్టోబర్‌లో సీట్‌బెల్ట్ ధరించనందుకు ఫైన్ విధించినట్లు చెప్పారు.

Challan on scooter owner

ఝా అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేయబడిందని బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ తెలిపారు. ఇప్పుడు వీటన్నింటిని ఈ-చలాన్‌లుగా మార్చే పనిలో ఉన్నామని అందులో భాగంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తనిఖీ చేయనున్నట్లు వివరించారు. ఫిబ్రవరిలో ఒడిశాలో ఇదే విధమైన సంఘటన జరిగింది. అభిషేక్ కర్ తన ద్విచక్ర వాహనంలో సీటుబెల్ట్ ధరించనందుకు రూ.1,000 జరిమానా విధించారు.

దీనిపై రాజ్‌గంగ్‌పూర్‌కు చెందిన కర్ అనే వ్యక్తి ఒడిషా టీవీతో మాట్లాడారు. ఈ-చలాన్‌లో ఉన్న ఫోటో మరొకరిదని తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. లోపం గురించి అప్రమత్తం చేయడానికి అతను స్థానిక రవాణా అధికారులను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించినట్లు అన్నారు. అదే సమయంలో, ఏదో ఒక లోపం కారణంగా చలాన్ విధించవచ్చు అని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

చలానా జారీ విషయంలో చాలామంది వివిధ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఇతరుల బైక్ నెంబర్లను లేదా కారు నెంబర్లను ఉపయోగించి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో నిజమైన ఓనర్లకు చలాన్లు అందుతున్నాయి. ఈ స్థితిలో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలకు ఉపక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

గత సంవత్సరం ముంబైకి చెందిన వ్యక్తికి ఓ భయానక అనుభవం ఎదురైంది. తన నంబర్ పై అనేక చలాన్లు జారీ అయ్యాయని చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి తన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ఉపయోగించి సాధారణ ట్రాఫిక్ ను ఉల్లంఘించేవాడు. అతని నంబర్ ప్లేట్ సంఖ్య MH02EJ0759 కానీ దానిని MH02FJ0759 లాగా మార్చాడు. దీంతో అతని చలాన్లన్నీ నా 4 వీలర్ వాహనంపై FJ0759 నంబర్‌తో వస్తున్నయని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనిపై ఫిర్యాదులను లేవనెత్తడంలో విసిగిపోయానని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిబంధనలను కఠినతరం చేయాలని సుచిత్ షా అనే వ్యక్తి అధికారులను కోరాడు. చాలామంది వ్యక్తులు ఇలాంటి వాటిని అతిక్రమిస్తుండటంతో నిజమైన ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలానే కొనసాగితే నేరాలు పెరుగుతాయని భయందోళనకు గురవుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 5, 2023, 15:39 [IST]
English summary
Challan on scooter owner for not wearing seat belt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+