ఛాంపియన్స్‎గా నిలిచిన టీం ఇండియా క్రికెటర్ల దగ్గర ఎంత ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా ?.. వాటి ఫీచర్స్ ఇవే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీం ఇండియా అవతరించింది. ఆదివారం దుబాయ్ లో జ‌రిగిన ఫైన‌ల్లో న్యూజిలాండ్‎ను 4వికెట్ల తేడాతో ఓడించి కప్పును కైవసం చేసుకుంది. దాదాపు 12ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. 12సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని భారత క్రికెటర్లు మన దేశానికి తీసుకొచ్చారు. ఈ విజయంతో 25ఏళ్ల కిందట న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన 140కోట్ల మంది భారతీయులను తలెత్తుకునే విధంగా చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కానీ చివరికీ భారత జట్టు గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో టీం ఇండియా ప్లేయర్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ల దగ్గర ఉన్న ఖరీదైన కార్ల గురించి తెలుసుకుందాం.

Rohit Sharma Car Collection

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వద్ద చాలా ఖరీదైన కార్లలో ఒకటైన లంబోర్ఘిని ఉరస్ ఉంది. ఈ కారు రోజ్ అల్లా అనే కస్టమైజ్డ్ కలర్‌లో వస్తుంది. ఇది చెర్రీ ఎరుపు, నలుపు కాంబినేషన్లో ఉంటుంది. ఇది డ్యూయల్ టోన్ కారు. ఈ కారు 4-లీటర్ ట్విన్-టర్బోచార్జ్ డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారు 850 Nm పీక్ టార్క్‌తో నడుస్తుంది.

ఆ తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దగ్గర ఆడి కంపెనీ R8 మోడల్ కారు ఉంది. ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 5.7 లీటర్ V10 ఇంజిన్ ఉంటుంది. ఈ కారు 570 hp పవర్, 540 Nm పీక్ టార్క్‌ను అందించగల కెపాసిటీతో రూపొందించారు.

వీరి తర్వాత హార్దిక్ పాండ్యా దగ్గర లంబోర్ఘిని హురాకాన్ ఎవో కారు ఉంది. ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 5.2-లీటర్ V10 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 631hp పవర్, 600Nm టార్క్‌ను అందించే విధంగా తయారు చేశారు.

Champion s Trophy Team

స్టార్ ప్లేయర్ కెఎల్ రాహుల్ వద్ద మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే ఉంది. ఈ కారు 3.0-లీటర్ ఇన్‌లైన్ 6 టర్బో చార్జ్ డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ కారు 429 hp పవర్, 520 Nm టార్క్‌ను అందించగల కెపాసిటీని కలిగి ఉంది. ఇది ఆకర్షించే లగ్జరీ ఇంటీరియర్‎తో తయారైంది.

నిన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరి ఓవర్‌లో 4 పరుగులు చేసి భారత్‌ను గెలిపించడంలో సాయపడిన రవీంద్ర జడేజా వద్ద ఆడి క్యూ7 ఉంది. ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 3.0 లీటర్ V6 TDI డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు లగ్జరీ కార్లలో ఒకటిగా చెప్పవచ్చు.

Champion s Trophy Winning Car Collection

ఈ సిరీస్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన శ్రేయాస్ అయ్యర్ వద్ద మెర్సిడెస్-బెంజ్ AMG కారును కొనుగోలు చేశాడు. ఆయన దగ్గర ఇంకా ఖరీదైన లంబోర్ఘిని హురాకాన్ కూడా ఉంది. దీని ధర రూ.3.21 కోట్లు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2025, 14:00 [IST]
English summary
Champions trophy winning team india players own these luxurious cars prices will leave you stunned
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+